By: ABP Desam | Updated at : 11 Nov 2021 11:39 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
రియల్‌మీ క్యూ3టీ స్మార్ట్ ఫోన్
రియల్‌మీ క్యూ3టీ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. గతంలో లాంచ్ అయిన రియల్‌మీ క్యూ3ఎస్ స్మార్ట్ ఫోన్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఇందులో అందించారు. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లేను ఇందులో అందించారు.
రియల్‌మీ క్యూ3టీ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 2,099 యువాన్లుగా(సుమారు రూ.24,300) నిర్ణయించారు. నెబ్యులా, నైట్ స్కై బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ప్రస్తుతానికి చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.
రియల్‌మీ క్యూ3టీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్ కాగా, స్క్రీన్ టు బాడీ రేషియో 90.8 శాతంగా ఉంది.
8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. అలాగే 30W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
ఈ స్మార్ట్ ఫోన్‌లో డైనమిక్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్(డీఆర్ఈ) ఫీచర్‌ను అందించారు. ఈ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను వర్చువల్‌గా పెంచుకునే అవకాశం ఉంటుంది.
Also Read: రూ.10 వేలలోనే ఒప్పో కొత్త ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!
Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!
Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!
Samsung F14 5G: రూ.13 వేలలోపే శాంసంగ్ 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!
Jio IPL Plans: రూ.219కే రోజూ 3 జీబీ డేటా - అదనంగా 2 జీబీ కూడా - ఐపీఎల్ ముందు జియో కొత్త ప్లాన్లు!
Samsung Galaxy M54 5G: 108 మెగాపిక్సెల్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో శాంసంగ్ 5జీ ఫోన్ - ఎలా ఉందో చూసేయండి!
Nothing Ear 2: రేటుతో బెదరగొడుతున్న నథింగ్ - కొత్త ఇయర్‌బడ్స్ లాంచ్ - ఇంత పెడితే ఎవరైనా కొంటారా?
Data Transfer: కొత్త ఫోన్‌కు డేటా ట్రాన్స్ఫర్ మరింత ఈజీ - మెసేజ్‌లు, చాటింగ్‌లు, యాప్ డేటా కూడా!
YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్సీపీకి నష్టం చేస్తున్నాయా ?
MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!
AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు
రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల