అన్వేషించండి

Komatireddy Rajagopal Reddy: మనకు న్యాయం జరగాలంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారాలేమో: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలనం

Hyderabad Regional Ring Road | రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో చేసిన అలైన్‌మెంట్ కారణంగా ఎక్కువగా భూములు కోల్పోతున్నది మునుగోడు నియోజకవర్గ ప్రజలేనని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

komatireddy Rajagopal Reddy | సంస్థాన్ నారాయణపురం: "రీజనల్ రింగ్ రోడ్ (Hyderabad RRR)లో భూములు కోల్పోతున్న చౌటుప్పల్ డివిజన్ (ఉత్తర భాగం) రైతులు తలుపు తట్టని అధికారులు లేరు. ఢిల్లీలో పెద్దల్ని కలిసినా బాధితులకు న్యాయం జరగలేదు. వాళ్లకు కావాల్సిన విధంగా జరగాలంటే ప్రభుత్వం మారాలేమో" అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం హయాంలో దివీస్ సంస్థ కోసం రూట్ అలైన్‌మెంట్ మార్చారు. ఇప్పుడు దక్షిణ భాగం మారాలంటే మొదటగా ఉత్తర భాగం అలైన్‌మెంట్ మారాలి. RRR ఉత్తర భాగం అలైన్‌మెంట్ మారాలంటే రాష్ట్ర ప్రభుత్వమే మారాలేమో అని కాంగ్రెస్ నేత రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.

భూనిర్వాసితులతో రాజగోపాల్ రెడ్డి సమావేశం

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఆదివారం భూనిర్వాసితులతో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి భూములు కోల్పోనున్న రైతులతో మాట్లాడారు. "నాకు జరిగిన అన్యాయాన్ని నేను తట్టుకున్నాను. కానీ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే మాత్రం సైలెంట్‌గా ఉండలేను. అవసరమైతే ట్రిపుల్ ఆర్ (RRR) రద్దయినా సరే, ఉత్తర భాగం భూనిర్వాసితుల హక్కులను కాపాడుతా" అని రైతులకు ఆయన భరోసా ఇచ్చారు.

ప్రజల కోసం ఏ త్యాగానికైనా రెడీ

"మన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ప్రశ్నించి, స్తంబింపజేయాలి. మునుగోడు ప్రజలే నాకు బలం, వారి కోసం ఎలాంటి పోరాటానికైనా, అవసరమైతే ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. అదే విధంగా ప్రజలు, రైతులు కూడా నాతో కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలి. నేను అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేనైనా, ప్రజలకు అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రభుత్వంతో పోరాటానికి మాత్రం వెనుకాడను. పదవుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరకు వెళ్లే మనిషిని కాను. నాకు నా ప్రాంత ప్రజలే ముఖ్యమని సీఎంకు చెబుతానని" ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. 

మునుగోడు ప్రజలకే ఎక్కువ నష్టం

"నాపై ఉంచిన మీ నమ్మకాన్ని ఎన్నటికీ వమ్ము చేయను. రైతుకు, భూమికి మధ్య ఉన్న బంధం విడదీయలేనిది. భూమి అంటే కేవలం వ్యవసాయం కాదు. అది మనకు దక్కే గౌరవం, ఒక స్టేటస్. ట్రిపుల్ ఆర్ లో భాగంగా చేస్తున్న పనులలో ఎక్కువ భూములు కోల్పోతున్నది మునుగోడు నియోజకవర్గ ప్రజలే. వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాను. అవసరమైతే కేంద్ర మంత్రులను కూడా కలుసుకుని మన సమస్యలు వారికి వివరిస్తాను. మీకు న్యాయం జరిగేవరకు బాధ్యతగల ఎమ్మెల్యేగా మీతో కలిసి పోరాడతా" అని వారికి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం జరిగిన ఈ సమావేశంలో నారాయణపురం మండలానికి చెందిన భూములు కోల్పోయిన రైతులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఇదివరకే మంత్రి పదవి విషయంపై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వంలో సెగలు రేపుతున్నాయి. తాజాగా ట్రిపుల్ ఆర్ అలైన్ మెంట్ విషయాన్ని లేవనెత్తారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget