Rakhi Day: రాఖీ కట్టడానికి వెళ్తూ బస్‌లో ప్రసవం- రాఖీ కట్టి తుది శ్వాస విడిచిన సోదరి- పండగ రోజు ఎమోషనల్ సీన్స్
Rakhi Day Emotional Moments : సోదరుడికి రాఖీ కట్టేందుకు వెళ్తూ గర్భిణి బస్సులోనే ప్రసవించింది. ఆమెకు కండక్టర్‌తోపాటు ఓ నర్సు సాయం చేసి ప్రశంసలు అందుకున్నారు. మరో చోట రాఖీ కట్టీ ఓ సోదరి కన్నుమూశారు.
Telangana: తెలంగాణలో జరిగిన రెండు ఎమోషనల్ సీన్స్ కంటతడి పెట్టిస్తున్నాయి. తాను గర్బిణీ అని తెలిసినా... డెలివరీ టైం దగ్గర పడిందని తెలిసినా సోదరుడికి రాఖీ కట్టేందుకు ఓ సోదరి వెళ్తూ మార్గ మధ్యలోనే ప్రసవించారు. ఆర్టీసీ బస్‌లో ప్రసవ నొప్పురు రాగానే ఆమెను బస్సులో ప్రసవం చేశారు. మరో చోట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోదరి తన బ్రదర్‌కి రాఖీ కట్టిన కాసేపటికే కన్నుమూశారు.
సోదరుడికి రాఖీ కట్టేందుకు బయల్దేరిన నిండు చూలాలు.. బస్సులోనే ప్రసవించింది. సదరు బస్సులో లేడీ కండక్టర్‌తో పాటు ఓ నర్సు అందుబాటులో ఉండటంతో ఆమెకు దగ్గరుండి డెలివరీ చేయించారు. గద్వాల్ నుంచి వనపర్తి వెళ్లే ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది.
గద్వాల డిపోనకు చెందిన గద్వాల-వనపర్తి రూట్ పల్లె వెలుగు బస్సులో సోమవారం ఉదయం సంధ్య అనే గర్భిణి తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తున్నారు. బస్సు నాచహల్లి సమీపంలోకి రాగానే ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్ భారతి బస్సును ఆపించారు. అదే బస్సులో ఉన్న ఒక నర్సు సాయంతో గర్భిణికి పురుడు పోశారు. సంధ్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. 108 పిలిచి తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
రాఖీ పండుగ నాడు బస్సులో డెలివరీ చేసి ఒక మహిళా కండక్టర్‌ను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రశంసించారు. మానవత్వం చాటుకున్నారని కితాబు ఇచ్చారు. జరిగిన విషయాన్ని ఎక్స్ వేదికగా వివరించారు. "రక్షాబంధన్ రోజున బస్సులో గర్భిణికి పురుడు పోసిన కండక్టర్ భారతికి TGSRTC యాజమాన్యం తరపున అభినందనలు. తాను సమయస్పూర్తితో వ్యవహారించి నర్సు సాయంతో సకాలంలో పురుడుపోయడం వల్లే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతూనే.. సామాజిక బాధ్యతగా సేవాస్ఫూర్తిని ఆర్టీసీ ఉద్యోగులు చాటుతుండటం గొప్ప విషయం." అని సజ్జనార్ అన్నారు.
రాఖీ పండుగ నాడు #TGSRTC బస్సులో గర్భిణికి డెలివరీ చేసి ఒక మహిళా కండక్టర్ మానవత్వం చాటుకున్నారు. తాను విధులు నిర్వర్తిస్తోన్న బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రాగా, ఆమె వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సుతో కలిసి ప్రసవం చేశారు. అనంతరం తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి… pic.twitter.com/nTpfVpl5iT
— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) August 19, 2024
ప్రేమ పేరుతో ఆకతాయిలు వేధింపులు భరించ లేక మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటకు చెందిన ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృత్యువతో పోరాడుతున్న ఆమె తన సోదరులకు రాఖీ కట్టారు. రాఖీ కట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే మృతి చందారు. ఆమె కోదాడలో డిప్లొమా చదువుతుండగా ప్రేమ పేరుతో యువకులు వేధించారు. దీంతో ఆమె ఆత్మహత్యకు యత్నించారు.
Also Read: ఇవాళ నువ్వు రాఖీ కట్టలేకపోయి ఉండొచ్చు- కవితను ఉద్దేశించి కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్