అన్వేషించండి

Munugode Election Counting: మునుగోడు ఫలితాల వెల్లడిలో జాప్యంపై చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ క్లారిటీ, కారణం ఏంటంటే

మన దగ్గర అభ్యర్థులు ఎక్కువగా ఉండడం వల్లనే లేట్ అవుతుందని సీఈవో వికాస్ రాజ్ అన్నారు. రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం చేసిన తరువాతనే రిజల్ట్ లు రౌండ్ ల వారీగా వస్తాయని చెప్పారు.

మునుగోడు ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడిలో జాప్యంపై చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ బుద్ధ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 4వ రౌండ్ కి 5వ రౌండ్ కి 20 నిమిషాలు లేట్ అయ్యింది అంతేనని అన్నారు. ఏదైనా కారణం వల్ల లేట్ అయితే తాము ఏమి చేయగలమని అన్నారు. మన దగ్గర అభ్యర్థులు ఎక్కువగా ఉండడం వల్లనే లేట్ అవుతుందని అన్నారు. రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం చేసిన తరువాతనే రిజల్ట్ లు రౌండ్ ల వారీగా వస్తాయని చెప్పారు. ప్రతి రౌండ్ ముగియగానే మీడియాకు సమాచారం ఇస్తున్నామని అన్నారు. ప్రతి టేబుల్‌ వద్ద అబ్జర్వర్లు, పార్టీల ఏజెంట్లు ఉన్నారని తెలిపారు.

స్పందించిన కలెక్టర్

అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడకుండా కొన్ని మీడియా ఛానళ్లు లేదా కొన్ని ఇతర మాధ్యమాలు ఊహగానాలతో ఫలితాలను ముందస్తుగా, ఊహిస్తూ ప్రసారం చేస్తున్నాయని జిల్లా కలెక్టర్ వినయ కృష్ణారెడ్డి అన్నారు. కాబట్టి, వాటిని అధికారికమైన వాటిగా పరిగణనలోకి తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ వినయ కృష్ణారెడ్డి కోరారు. ఇప్పటివరకు కేవలం మూడవ రౌండ్ ఫలితాలు మాత్రమే అధికారికంగా వెలువడ్డాయని ఆయన తెలిపినట్లుగా జిల్లా పౌర సంబంధాల అధికారి (డీపీఆర్వో) ఓ ప్రకటన విడుదల చేశారు.

సీఈవోకు కిషన్ రెడ్డి ఫోన్

మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో కాస్త ఆలస్యం కావడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నాలుగో రౌండ్ వరకూ ఎప్పటికప్పుడూ ఫలితాలను ప్రకటిస్తూ వచ్చిన అధికారులు ఐదో రౌండ్ లెక్కలు మాత్రం చాలా జాప్యం చేశారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యం జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఎందుకు ఫలితాలు వెల్లడించడం లేదని కిషన్ రెడ్డి సీఈవోను ప్రశ్నించారు. కేంద్ర మంత్రి ఫోన్ చేసిన 10 నిమిషాల్లోనే 4 రౌండ్ల ఫలితాలను సీఈవో అప్ లోడ్ చేశారు. 

బండి సంజయ్ ఆగ్రహం

మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వైఖరి అనుమానాస్పదంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ లీడ్ వస్తే తప్ప రౌండ్ల వారీగా సీఈవో ఫలితాలను అప్ డేట్ చేయడం లేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ లీడ్ వచ్చినప్పటికీ ఫలితాలను సీఈవో వెల్లడించడం లేదని విమర్శించారు. మొదటి, రెండు రౌండ్ల తరువాత మూడు, నాలుగు రౌండ్ల ఫలితాలను అప్ డేట్ చేసేందుకు జాప్యానికి కారణాలేమిటో సీఈవో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎన్నడూ లేనంత ఆలస్యం ఇప్పుడే ఎందుకు జరుగుతోందని బండి సంజయ్ నిలదీశారు. మీడియా నుండి తీవ్రమైన ఒత్తిడి వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ తేల్చి చెప్పారు.

ఎన్నికల కమిషన్ స్పందించాల్సిందే  - మంత్రి జగదీష్ రెడ్డి

రౌండ్ ల వారీగా ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెల్లడి ఆలస్యం కావడంపైన మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటింగ్ కేంద్రం నుంచి మీడియాకి అధికారులు లీకులు అందుతున్నాయన్న వార్తల పైన ఎలక్షన్ కమిషన్ స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రతి రౌండ్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత వెంటనే అధికారులు మీడియాకి స్వయంగా వివరాలు తెలిపాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాల జాప్యంపైన మీడియా ప్రతినిధులు కూడా నిరసన తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Breaking News: విజయవాడలో పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు
విజయవాడలో పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు
Telangana ACB Raids: తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Breaking News: విజయవాడలో పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు
విజయవాడలో పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు
Telangana ACB Raids: తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Family Stars Season 2: వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
US Iran Conflict: టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
కొత్త మారుతి కారు కొనాలనుకుంటున్నారా? వెంటనే బుక్ చేసుకోండి, మరోసారి ధరల పెంపు!
మారుతి సుజుకీ గట్టి షాక్‌ ఇవ్వబోతోంది, కొత్త కారు కొనేవాళ్ల జేబుకు చిల్లు!
CPM West Bengal Revival: బెంగాల్‌లో ఎర్రజెండా పునరుజ్జీవం సాధ్యమేనా? టీఎంసీ సంక్షోభం.. సీపీఎంకు దక్కే ఛాన్స్ ఎంత?
బెంగాల్‌లో ఎర్రజెండా పునరుజ్జీవం సాధ్యమేనా? టీఎంసీ సంక్షోభం.. సీపీఎంకు దక్కే ఛాన్స్ ఎంత?
Embed widget