అన్వేషించండి

RS Praveen Kumar: మునుగోడు ఉప ఎన్నికలో పోటీకి రెడీ, ఆ పార్టీని పాతెయ్యడం ఖాయం - ఆర్ఎస్ ప్రవీణ్

BSP News: బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు.

నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు తాము రెడీ అని బహుజన్‌ సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ వెల్లడించారు. నాలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీ నేతలతో బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ఆ తర్వాత సమావేశ వివరాలను తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని సమస్యలను తప్పించుకోవడానికి కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు.

మునుగోడు ఉప ఎన్నిక గురించి మాట్లాడుతూ.. ప్రజలు రాజగోపాల్‌ రెడ్డికి కచ్చితంగా బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల నుంచి బహుజన్ సమాజ్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పారు. బీఎస్పీకి గెలుపు అనేది చారిత్రక అవసరమని అన్నారు. సామాజిక న్యాయమే అజెండాగా ఉప ఎన్నికల కోసం ప్రచారం చేస్తామని కెప్పారు, వెళ్తామని ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో పోటీ ఒంటరిగానే
వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం తాము తెలంగాణలో అన్ని స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. బీఎస్పీ గెలుపు చారిత్రక అవసరమని అన్నారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌. రాష్ట్రంలోని సమస్యలను తప్పించుకోవడానికి కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీలు నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌.

Also Read: Telangana Politics : ఉప ఎన్నికలా ? ముందస్తు ఎన్నికలా ? తెలంగాణలో ఏం జరగబోతోంది ?

అగ్రవర్ణాల చేతిలోనే ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రం అగ్ర వ‌ర్ణాల చేతిలో బందీగా ఉంద‌ని ప్రవీణ్ కుమార్ ఆవేద‌న వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజ‌లు కోరుకున్న రాష్ట్రం ఇలాంటిది కాదని చెప్పారు. బ‌డుగుబ‌ల‌హీన వ‌ర్గాల ప్రజ‌ల‌ను అగ్రవ‌ర్ణాల వారు అణ‌గ తొక్కుతున్నార‌ని ఆందోళ‌న వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని పాతి పెట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలు జరిగితే మునుగోడు నియోజవర్గ ప్రజలు క‌చ్చితంగా బుద్ది చెబుతారని ఆయన అన్నారు.

సోనియాకు రాజగోపాల్ లేఖ

మరోవైపు, మునుగోడులో పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోనియా గాంధీకి లేఖ పంపారు. తన రాజీనామాకు కారణం టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డేనని అన్నారు.  రాజీనామాకు దారితీసిన పరిణామాలను రాజగోపాల్ రెడ్డి లేఖలో తెలిపారు. 30 ఏళ్లుగా పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశానని అన్నారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నaట్లు లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని కొందరు నిర్వీర్యం చేశారని.. ఎమ్మెల్యేలను గెలిపించలేని వ్యక్తులు, గెలిచిన ఎమ్మెల్యేల్లో మనోధైర్యం నింపలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. జైలుపాలైన వ్యక్తి ఆధ్వర్యంలో తాను కలిసి పనిచేయలేనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

Also Read: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల రహస్య సమావేశం- త్వరలోనే రాజీనామా: బండి సంజయ్ లీక్స్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Rythu Bharosa Scheme Update: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!
Telangana Meeseva Charges: తెలంగాణలో మీసేవ ఛార్జీలు భారీగా పెంపు! ఏయే సర్టిఫికెట్‌కు ఎంతు తీసుకుంటారు?
తెలంగాణలో మీసేవ ఛార్జీలు భారీగా పెంపు! ఏయే సర్టిఫికెట్‌కు ఎంతు తీసుకుంటారు?
Paadi Kaushik Reddy Controversy: కౌశిక్ రెడ్డికి వివాదాలు అలవాటుగా మారాయా? బీఆర్‌ఎస్‌కు నష్టమా? లాభమా?
కౌశిక్ రెడ్డికి వివాదాలు అలవాటుగా మారాయా? బీఆర్‌ఎస్‌కు నష్టమా? లాభమా?
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక విమర్శలు- లక్షల కోట్ల ప్రజాధనం వృథా, ప్లానింగ్ లోపాలే కారణమని వెల్లడి!
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక విమర్శలు- లక్షల కోట్ల ప్రజాధనం వృథా, ప్లానింగ్ లోపాలే కారణమని వెల్లడి!

వీడియోలు

Arjun Tendulkar Comments on Mumbai Indians | ముంబై ఇండియన్స్ పై అర్జున్ టెండూల్కర్ కామెంట్స్ | ABP Desam
Jadeja Breaks Silence on MS Dhoni | ధోనీపై జడేజా సంచలన వ్యాఖ్యలు | ABP Desam
IPL 2026 DC VS LSG Highlights | ఆల్ రౌండ్ షోతో బోణీ కొట్టిన ఢిల్లీ | ABP Desam
Rishabh Pant LSG vs Delhi Capitals IPL 2026 | లక్నో సూపర్ జెయింట్స్ ఓటమికి కారణం అదేనా | ABP Desam
NASA Artemis 2 Mission Launch | 50 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రుడిపైకి మానవుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raghav Chadha: ఆమ్‌ఆద్మీ పార్టీ యాక్షన్‌కు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ రియాక్షన్! గొంతు నొక్కుతున్నారా అంటూ క్వశ్చన్స్!
ఆమ్‌ఆద్మీ పార్టీ యాక్షన్‌కు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ రియాక్షన్! గొంతు నొక్కుతున్నారా అంటూ క్వశ్చన్స్!
Telangana Rythu Bharosa Scheme Update: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!
YSRCP No friends: మిత్రులే లేని వైసీపీ - బీఆర్ఎస్ కూడా హ్యాండ్ - జగన్ రాజకీయం ఇంత తేడానా?
మిత్రులే లేని వైసీపీ - బీఆర్ఎస్ కూడా హ్యాండ్ - జగన్ రాజకీయం ఇంత తేడానా?
Tamil Nadu Elections 2026: విజయ్ డబుల్ రోల్ వ్యూహం - తమిళనాడు రాజకీయాల్లో సాహసమా లేక తప్పిదమా?
విజయ్ డబుల్ రోల్ వ్యూహం - తమిళనాడు రాజకీయాల్లో సాహసమా లేక తప్పిదమా?
Biker Movie Review - 'బైకర్' రివ్యూ: తండ్రీ కుమారుల కథ ఎలా ఉంది? 'నారీ నారీ...' తర్వాత శర్వానంద్ మరో సక్సెస్ కొట్టారా?
'బైకర్' రివ్యూ: తండ్రీ కుమారుల కథ ఎలా ఉంది? 'నారీ నారీ...' తర్వాత శర్వానంద్ మరో సక్సెస్ కొట్టారా?
Kaleshwaram Politics: కాళేశ్వరంపై రేవంత్ వాదననే వినిపిస్తున్నకేంద్రం - బీఆర్ఎస్‌ ఉక్కిరిబిక్కిరి -ఎదురుదాడి ఎలా?
కాళేశ్వరంపై రేవంత్ వాదననే వినిపిస్తున్నకేంద్రం - బీఆర్ఎస్‌ ఉక్కిరిబిక్కిరి -ఎదురుదాడి ఎలా?
Mrithyunjay OTT : ఆ మర్డర్స్ చేసింది ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ మృత్యుంజయ్
ఆ మర్డర్స్ చేసింది ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ మృత్యుంజయ్
Palasa- Ichchapuram: ఉద్దానం ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్‌! దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో పలాస- ఇచ్చాపురం సెక్షన్‌ విలీనం!
ఉద్దానం ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్‌! దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో పలాస- ఇచ్చాపురం సెక్షన్‌ విలీనం!
Embed widget