Srisailam Tour Package: కొండల మధ్య కృష్ణమ్మ ప్రవాహంలో లాంచీ ప్రయాణం షురూ - టికెట్ల ధరలు ఇలా
Somasila to Srisailam Boat Service | ప్రకృతిని ఆస్వాదిస్తూ పచ్చటి కొండల మధ్య కృష్ణమ్మ పరవళ్లు తొక్కుంటే నదిలో ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా, నవంబర్ 2 నుంచి సర్వీసులు ప్రారంభం అవుతున్నాయి.

Boat service from Nagarjuna Sagar to Srisailam resumes
టూరిజం శాఖ వెబ్‌సైట్‌లో టిక్కెట్ల బుకింగ్: మంత్రి జూపల్లి కృష్ఱారావు
హైదరాబాద్: టూరిజం ఇష్టపడే వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొండల మధ్యలో కృష్ణమ్మ ప్రవహిస్తుంటే ప్రకృతి వాతావరణాన్ని ఆస్వాదించాలనుకునే వారి కోసం లాంచీ (క్రూయిజ్) సేవలు ప్రారంభించినట్లు రాష్ట్ర టూరిజం శాఖ ఇటీవల ప్రకటించింది. సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ (క్రూయిజ్) సేవలు, అదే విధంగా నాగర్జున సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ సేవలు నవంబర్ 2 నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
కృష్ణమ్మ ఒడిలో, నల్లమల పచ్చదనం అందాలను వీక్షిస్తూ కృష్ణా నదిలో సాగే జల విహారానికి రాష్ట్ర పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి జూపల్లి వెల్లడించారు. ప్రయాణికుల కోసం టూర్ ప్యాకేజీకి సంబంధించిన ఇతర వివరాలు, బుకింగ్ కోసం వెబ్ సైట్ https://tourism.telangana.gov.in/ ను సందర్శించి, పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. ఏమైనా సందేహాలు ఉంటే 9848306435 లేదా 9848540371 నెంబర్లలో సంప్రదించాలి. లేకపోతే marketing@tgtdc.in కు మెయిల్ చేసి వివరాలు కోరవచ్చునని రాష్ట్ర పర్యాటకశాఖ సూచించింది.
టూర్ ప్యాకేజీ వివరాలు
సోమశిల నుంచి శ్రీశైలం వరకు, అదే విధంగా నాగర్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు కృష్ణమ్మ ప్రవాహంపై సింగిల్ రైడ్‌తో పాటు రౌండప్ క్రూయిజ్ జర్నీ ధరలను నిర్ణయించారు. ఈ రెండు వేర్వేరు ప్యాకేజీలకు ఒకే రకమైన టికెట్ ధరలే వర్తిస్తాయని అధికారులు తెలిపారు. అయితే పిల్లలకు, పెద్దలకు టికెట్ ధరలు వేర్వేరుగా ఉన్నాయి.
సింగిల్ జర్నీలో పెద్దలకు టికెట్ ధర రూ.2000, చిన్నారులకు టికెట్ ధర రూ.1,600, రౌండప్ (రానుపోను) జర్నీలో పెద్దలకు టికెట్ ధర రూ.3,000, పిల్లలకు రూ.2,400 గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో లాంచీ ప్రయాణంతో పాటు వారికి టీ, స్నాక్స్ అందిస్తారు.
Also Read: TGSRTC Special Buses: కురుమూర్తి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, టికెట్ బుకింగ్స్ ఇలా
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

