అన్వేషించండి

Munugode Bypoll : మునుగోడులో ముగిసిన పోలింగ్, పలుచోట్ల ఘర్షణలు

Munugode Bypoll : మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు.

Munugode Bypoll :  మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌ చిన్న చిన్న ఘటనల మినహా ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గ వ్యాప్తంగా 119 కేంద్రాల్లోని 298 బూత్‌లలో గురువారం సాయంత్రం 6 గంటలకు పోలింగ్‌ ముగిసింది. అయితే కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న వారికి టోకెన్లు ఇచ్చి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉండగా సాయంత్రం 5 గంటల వరకు 1,87,527 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని ఎన్నికల అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్‌ నమోదైందని వెల్లడించారు. గత ఎన్నికల్లో 91.30 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈసారి అంతకంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదు అయ్యే అవకాశముందని ప్రధాన పార్టీలు భావిస్తున్నారు. చివరి గంటలో ఎక్కువ మంది పోలింగ్‌ కేంద్రాలకు వస్తుండడంతో పలు కేంద్రాల వద్ద చెదురు మదురు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పూర్తిస్థాయి పోలింగ్‌ శాతంపై స్పష్టత వచ్చేందుకు కొంత సమయం పట్టే అవకాశముందని ఎన్నికల అధికారులు అంటున్నారు. 

ప్రశాంతంగా పోలింగ్ 

"మునుగోడు ఉపఎన్నికల పోలింగ్ చాలా ప్రశాంతంగా సాగింది. ఇంకా చాలా ప్రాంతాల్లో క్యూ లైన్ లో ఓటర్లు వేచి ఉన్నారు. మూడు ఈవీఏంలు మార్చారు, నాలుగు వీవీప్యాట్ లు మార్చారు.  ఇప్పటి వరకూ 6100 లీటర్లు మద్యం స్వాధీనం చేసుకున్నారు. రూ.8.27 కోట్ల నగదు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నాం. 3.29 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నాం. ఈరోజు 98 ఫిర్యాదులు వచ్చాయి. 70 మందిని స్థానికేతరులను గుర్తించారు. వారిని బయటకి పంపారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట భద్రత ఉంటుంది. లెక్కింపు సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చాం. లెక్కింపు కోసం మైక్రో అబ్జర్వర్ లను నియమిస్తాం.  స్థానికేతరలను అబ్జర్వర్ల బృందాలల్లో నియమిస్తాం"- వికాస్ రాజ్, ప్రధాన ఎన్నికల అధికారి 

ఓటర్ నాడిపై ఉత్కంఠ 

మునుగోడులో టీఆర్ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ ఆరోపించారు. పోలింగ్ ముగిశాక ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెప్పిన మాట వినాలంటూ అధికారులను టీఆర్ఎస్‌ నేతలు బెదిరించారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మునుగోడులో బీజేపీ  గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌, బీఎస్పీ తోపాటు వివిధ పార్టీలు, స్వతంత్రులు కలిపి మొత్తం 47 మంది మునుగోడు ఉపఎన్నికలో పోటీ పడ్డారు. ముఖ్యంగా టీఆర్ఎస్,  బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే పోటీ నడిచింది. పోలింగ్ ప్రక్రియ ముగిసినప్పటికీ ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఉపఎన్నికలో గెలుపు తమదే విజయమని ఆయా పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఫలితం ఎలా ఉంటుందోనని లోలోపల మాత్రం టెన్షన్ పడుతున్నారు అభ్యర్థులు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు ఉపఎన్నికను సెమీఫైనల్‌గా భావిస్తున్నారు. దీంతో మునుగోడు ఫలితంపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది.

Also Read : KA Paul: పోలింగ్ బూత్‌ల వద్ద కేఏ పాల్ ఉరుకులు, ఆయన సమాధానం వింటే నవ్వుకోవాల్సిందే!

టాప్ హెడ్ లైన్స్

RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Kalvakuntla Kavitha: సొంత మనుషులపై మరిగే నీళ్లు! నమ్మినోళ్లను నట్టేట ముంచడం కేటీఆర్‌ నైజం: కవిత
సొంత మనుషులపై మరిగే నీళ్లు! నమ్మినోళ్లను నట్టేట ముంచడం కేటీఆర్‌ నైజం: కవిత
Special Trains: విజయవాడ - విశాఖ మధ్య సహా పలు ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్ – నహర్లగూన్ స్పెషల్ సర్వీస్
విజయవాడ - విశాఖ మధ్య సహా పలు ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్ – నహర్లగూన్ స్పెషల్ సర్వీస్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget