Rajgopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చెప్పుతో దాడి, పాల్వాయి స్రవంతి కాన్వాయ్ పై దాడికి రివేంజ్!
Rajgopal Reddy : మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ దగ్గరకు వస్తుండడంతో ప్రధాన పార్టీ కార్యకర్తలు ప్రత్యక్ష దాడులకు దిగుతున్నారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్త చెప్పుతో దాడి చేశాడు.
Rajgopal Reddy : మునుగోడు పోలింగ్ టైమ్ దగ్గర పడేకొద్దీ పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం పెరుగుతోంది. ఇప్పటి వరకూ ప్రచారాల్లో తిట్లదండకాలతో సరిపెట్టిన పార్టీలు ఇప్పుడు ప్రత్యక్ష ఫైట్ లకు దిగుతున్నాయి. ఆదివారం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి స్రవంతి కాన్వాయ్ పై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు రివేంజ్ గా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చెప్పుతో దాడి జరిగింది.
చౌటుప్పల్ మండలం జై కేసారంలో బిజెపి ఎన్నికల ప్రచారంలోకి వచ్చిన టిఅర్ఎస్, కాంగ్రెస్ పార్టీల గుండాలు, రౌడీలు గొడవలు సృష్టిస్తూ @krg_reddy గారిపై దాడికి యత్నించడం జరిగింది, రక్షణ కల్పించాల్సిన పోలీసులు చేతులు ముడుచుకుని చోద్యం చూడడం సిగ్గుచేటు pic.twitter.com/1rKJEgiNcb
— Team Rajanna (@RajannaTeam) October 24, 2022
రాజగోపాల్ రెడ్డిపై చెప్పుతో దాడి
మునుగోడు ఉపఎన్నికల ప్రచారం మరింత జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు రోడ్ షోలు, ఇంటింటా ప్రచారాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే అధికార, విపక్ష పార్టీల నేతల మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. నేతల మధ్య మాటల యుద్ధం కాస్త దాడులు చేసుకునే స్థాయికి చేరింది. ఆదివారం కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి కాన్వాయ్‌పై బీజేపీ కార్యకర్తల దాడికి పాల్పడ్డారు. నాంపల్లి మండలంలో స్రవంతి ప్రచారానికి వెళుతుండగా కొందరు బీజేపీ కార్యకర్తలు ఆమె వాహనాన్ని అడ్డుకున్నారు. నాంపల్లి అంబేడ్కర్ చౌరస్తా వద్ద పాల్వాయి స్రవంతి, ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో ఓ కాంగ్రెస్ కార్యకర్త కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై దాడికి పాల్పడ్డాడు. ఎన్నికల ప్రచారంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతుండగా కాంగ్రెస్ కార్యకర్త చెప్పుతో ప్రచార వాహనంపైకి ఎక్కి కొట్టేందుకు యత్నించాడు. అప్రమత్తమైన రాజగోపాల్ రెడ్డి పక్కకు జరిగారు. బీజేపీ కార్యకర్తలు అతడిని పక్కకోవడంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
పోలీసులపై రాజగోపాల్ రెడ్డి ఫైర్
మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోలీసులపై ఫైర్ అయ్యారు. మంత్రి కేటీఆర్ కాన్వాయ్ కోసం హైవే బ్లాక్ చేశారని మండిపడ్డారు. ట్రాఫిక్ లో రెండు అంబులెన్స్ లు చిక్కుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి మంత్రి కేటీఆర్ చౌటుప్పల్ నుంచి గట్టుప్పల్ వెళుతున్న సమయంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. అదే సమయంలో అటుగా వస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్రాఫిక్ లో అంబులెన్స్ ఆగిపోయిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి కేటీఆర్ కోసం అంబులెన్స్ ఆపారంటూ ఆయన ఆరోపించారు. కానీ పోలీసులు మాత్రం తాము వాటిని గమనించలేదని చెప్పారు. ఒకవేళ గమనిస్తే వెంటనే రూట్ క్లియర్ చేసేవాళ్లమని పేర్కొన్నారు. దీంతో రాజగోపాల్ రెడ్డికి పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. కేటీఆర్ ముఖ్యమంత్రా? మీరు ఎందుకు హైవేని బ్లాక్ చేశారంటూ పోలీసులపై రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. మీ వల్ల రెండు అంబులెన్స్ లో పేషెంట్లు ఇబ్బంది పడ్డారని పోలీసు ఉన్నతాధికారిని నిలదీశారు.
కేటీఆర్ కోసం హైవే బ్లాక్ చేస్తారా?
"మూడు అంబులెన్స్ లు ఆగిపోయాయి. మీకు తెలియడంలేదా? అందులో పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. కేటీఆర్ ఏమైనా ముఖ్యమంత్రా? ట్రాఫిక్ ఎందుకు ఆపారు. పోలీసులంటే నాకు ఎంతో గౌరవం. కానీ మీరు చేసింది సరికాదు. కేటీఆర్ కోసం హైవే బ్లాక్ చేస్తారా? . ఎవరొచ్చినా హైవే ఆపుతారా? హైవే పై ట్రాఫిక్ ఆపే హక్కు మీకెవ్వరిచ్చారు." -రాజగోపాల్ రెడ్డి