Munugode Bypoll : మునుగోడు బైపోల్ కు టీఆర్ఎస్ రెడీ, కాంగ్రెస్ తోనే మాకు పోటీ - మంత్రి జగదీశ్ రెడ్డి
Munugode Bypoll : మునుగోడు బైపోల్ కు టీఆర్ఎస్ సిద్ధంగా ఉందని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.
Munugode Bypoll : మునుగోడు ఉపఎన్నికకు నగారా మోగింది. కేంద్ర ఎన్నిక సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. దీంతో ప్రధాన పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. మునుగోడు ఉపఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉందని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు, నిత్యవసరాలు ధరలు పెంచి ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్న బీజేపీకి బుద్ధి చెప్పడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. దేశాభివృద్ధికి కొత్త నమూనాతో ముందుకు వస్తున్న కేసీఆర్ ను బలపరచడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్న బీజేపీ దుష్ట ఆలోచనలను అడ్డుకోడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కొరుకుంటున్నారని తేల్చి చెప్పారు.
మునుగోడు ఉపఎన్నికకు సిద్ధంగా ఉన్నాం. #MunugodeWithTRS #TelanganaWithKCR #VoteForCar @trspartyonline @KTRTRS @TelanganaCMO pic.twitter.com/7zEKosj7W4
— Jagadish Reddy G (@jagadishTRS) October 3, 2022
కాంగ్రెస్ తోనే పోటీ
తెలంగాణ సంక్షేమ పథకాలు తమకు కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను జాతీయ రాజకీయాలకు పంపుతున్నారని తెలిపారు. తెలంగాణ సంక్షేమం దేశం మొత్తం విస్తరించాలని కోరుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ నిన్నటి సమావేశం చూసి ప్రధాని మోదీ, అమిత్ షాలకు రాత్రి నిద్ర పట్టక ఇవాళ మునుగోడు ఉపఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారని ఆరోపించారు. మునుగోడులో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ అని తెల్చేశారు. ఈ ఎన్నికల్లో తప్పకుండా టీఆర్ఎస్ గెలుస్తుందని మంత్రి జగదీశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఓటమి భయంతోనే నోటిఫికేషన్ ఆలస్యం
"మునుగోడు ఉపఎన్నికకు టీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. దేశానికి ద్రోహం చేస్తూ, రైతాంగాన్ని ముంచుతూ, మరో వైపు నిత్యవసరాల ధరలు అడ్డగోలుగా పెంచి వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతూ, పేద, మధ్య తరగతి ప్రజల పొట్టగొడుతున్న బీజేపీకి బుద్ధి చెప్పేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఓ కోవర్టును కొనుక్కోవడం ద్వారా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్యాన్ని మునుగోడు ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రజల మనసుల్లోని బాధను స్వయంగా తెలుసుకుని, ఆ బాధల నుంచి విముక్తి చేయడానికి అనేక నూతన పథకాలు తీసుకొస్తున్న కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వ్యవసాయ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించేలా చేస్తున్న సీఎం కేసీఆర్ ఆలోచనలు అడ్డుకునేందుకు కేంద్రం కుట్రలు చేస్తుంది. తప్పకుండా మునుగోడులో టీఆర్ఎస్ గెలిచితీరుతుంది. ఈ నోటిఫికేషన్ ముందే రావాల్సిఉంది. కావాలనే ఆలస్యంచేశారు. ఓటమి భయంతోనే బీజేపీ మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ ఆలస్యం చేశారు. కేసీఆర్ రోజురోజుకు బలపడుతున్నారని భయంతో ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. రాజకీయాలను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో కేసీఆర్ దిట్ట. "- మంత్రి జగదీశ్ రెడ్డి
Also Read : BJP Plan : వేరే పనుల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ - మునుగోడు షెడ్యూల్ బీజేపీకి అడ్వాంటేజ్ ?
Also Read : Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల - పోలింగ్ డేట్, కౌంటింగ్ ఎప్పుడంటే