MLA Ravi Shanker: "క్షుద్ర పూజలు చేసేది మీరు, సీఎం కేసీఆర్ కు క్షమాపణలు చెప్పాల్సిందే"
MLA Ravi Shanker: సీఎం కేసీఆర్ క్షుద్ర పూజలు చేశారంటూ బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి పూజలు చేసేది మీరంటూ ఫైర్ అయ్యారు.
MLA Ravi Shanker: సీఎం కేసీఆర్ క్షుద్ర పూజలు చేశారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్లపై చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశకంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక కల్యాణం కోసం, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ హోమాలు, యజ్ఞాలు చేస్తుంటే బండి సంజయ్ ఇలా మాట్లాడడం చాలా తప్పని హితవు పలికారు. కరీంనగర్ లో విలేకరులతో మాట్లాడుతూ... మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకుని, తెలంగాణ ప్రజలకు, సీఎం కేసీఆర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజల చేతిలో బండి చెంప దెబ్బ తినక తప్పదని హెచ్చరించారు. బండి సంజయ్ చెప్పేవి పిచ్చి మాటలంటూ.. అతడిని ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.
క్షుద్రపూజలు చేసేది మీరూ మీ పార్టీ @bandisanjay_bjp @BJP4India pic.twitter.com/cFo4wAvKSO
— Sunke Ravishankar (@RavishankarTRS) October 9, 2022
కరీంనగర్ లో ఏం చేశావో చెప్పు - ఎమ్మెల్యే
పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ కు ఏం చేశావో చెప్పమంటూ బండి సంజయ్ పై ఎమ్మెల్యే రవి శంకర్ మండిపడ్డారు. ఇక్కడ చెప్పాలనిపించకపోతే కనీసం మునుగోడులోనైనా సరే.. కరీంనగర్ లో నువ్వు చేసిన అభివృద్ధి గురించి వివరించమంటూ సెటైర్లు వేశారు. జిల్లాలోనే ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేని నువ్వు రాష్ట్రానికి ఏం చేయగలవు అంటూ ప్రశ్నించారు. మునుగోడులో బీజేపీ డిపాజిట్ కోల్పోవడం ఖాయమంటూ జోస్యం చెప్పారు.
కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఏంచేసావో చెప్పు @bandisanjay_bjp ఇక్కడ చెప్పబుద్ది కాకపోతే మునుగోడు లో చెప్పు కరీంనగర్ కి గిన్ని కోట్లు తెచ్చిన, గింత అభివృద్ధి చేసిన అని. జిల్లాకే ఏం చేయనోనివి.. రాష్ట్రానికి ఎమ్ చేస్తానని తిరుగుతున్నావ్.. @KTRTRS @vinodboianpalli @RavishankarTRS pic.twitter.com/NLMDTnfStt
— TRS Party choppadandi (@TrsChoppadandi) October 9, 2022
కేసీఆర్ ప్రభంజనాన్ని తట్టుకోలేకే...
కేసీఆర్ ప్రభంజనాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు తట్టుకోలేకే అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను.. దమ్ముంటే బీజేపీ పాలిత రాష్టాల్లో అమలు చేసి చూపించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
బండి సంజయ్ ఏమన్నారంటే...?
సీఎం కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. తాంత్రికుడి సలహా మేరకే టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చారన్నారు. తాంత్రికుడి సూచనతోనే సచివాలయానికి వెళ్లడం లేదని, ఫాంహౌజ్ లో నిత్యం నల్ల పిల్లితో క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం తనకు ఓ స్వామిజీ తెలిపారని కేసీఆర్ చేస్తోన్న పనులు, వాస్తవాలన్నీ రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ విషయం చెబుతున్నానన్నారు. స్వామిజీలు, వేద పండితులతోపాటు సమాజ హితం కోరే వాళ్లంతా కేసీఆర్ క్షుద్ర పూజల నుంచి తెలంగాణను కాపాడాలని వేడుకుంటున్నట్లు తెలిపారు. బీజేపీ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, తమిళనాడు సహ ఇంఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ తో కలిసి బండి సంజయ్ సమక్షంలో మలక్ పేట నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బండి సంజయ్.
కేసీఆర్ ఫాంహౌజ్ లో సకుటుంబ సమేతంగా తాంత్రిక పూజలు చేసిండు. ఆ పూజల అనంతరం వాటిని కాళేశ్వరం పోయి ఆ నీళ్లలో కలిపిండు. పైకి మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళుతున్నానని చెప్పిండు.
— BJP Telangana (@BJP4Telangana) October 8, 2022
- శ్రీ @bandisanjay_bjp ఎంపి,
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు#KCRPracticesBlackMagic pic.twitter.com/iG8x5eQ94F