ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ వాళ్లకు ఏజెంట్, జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
Veer Savarkar: రాహుల్ గాంధీ వీర్ సావర్కర్ పై చేసిన కామెంట్లలో తప్పేం లేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఈ విషయంలో రాహుల్ గాంధీకి పూర్తి మద్దతిస్తున్నట్లు వివరించారు.
Veer Savarkar: రాహుల్ గాంధీ వీర్ సావర్కర్ పై మాట్లాడిన దాంట్లో తప్పేం లేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. స్వాతంత్ర్య సాధనలో నెహ్రూ, గాంధీలు కూడా జైలుకు వెళ్లారని, అలాగే ఇందిరా గాంధీ కూడా జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ నిజం చెప్పారన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి... ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ కి ఏజెంట్ గా ఉందని అనేక పుస్తకాల్లో రాసి ఉందని అన్నారు. వీర సావర్కర్ కూడా అంతేనని.. అది అభియోగం కాదు చెప్పుకొచ్చారు. గాంధీని చంపింది కూడా ఆర్ ఎస్ ఎస్ స్వయం సేవక్... గాడ్సే కదా అంటూ కామెంట్లు చేశారు. గాడ్సే ని పొగిడిన బీజేపీ నేతలది తప్పు అని ఎందుకు చెప్పలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడ్సే ని సమర్ధించే బీజేపీ ఏం చెప్తుందన్నారు.
సావర్కర్ మీద రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్లో తప్పేం లేదన్నారు. రాహుల్ గాంధీ ఫోటోని చెప్పులతో కొట్టండి అని కర్ణాటకలో బీజేపీ చెప్పిందని ఆరోపించారు. మా వద్ద లేవా చెప్పులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేవుళ్ల పేరు.. హిందు అని రాజకీయంగా బతకడం తప్పితే..బీజేపీ కి ఏం తెలుసంటూ ఆరోపించారు. మీరు రాహుల్ గాంధీ మీద చెప్పులు వేస్తే.. మోడీ, అమిత్ షా ల మీద చెప్పులు పడతాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండ్రోజుల క్రితమే ఎన్నికల్లో పోటీ చేయట్లేదంటూ కామెంట్లు..
చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్నా జగ్గారెడ్డి ఇప్పుడు హఠాత్తుగా సంగారెడ్డి నుంచి తాను పోటీ చేయడం లేదని ప్రకటించడంతో కాంగ్రెస్ వర్గాల్లోనూ జగ్గారెడ్డి వ్యవహారంపై చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ అంశంపై పార్టీ హైకమాండ్ సర్వేలు నిర్వహిస్తోంది. సర్వేల్లో మంచి ఫలితాలు వచ్చిన వారికే టిక్కెట్ అని చెబుతున్నారు. ఈ క్రమంలో సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మార్చాలనుకుంటుందనే సమాచారం వచ్చి ఉంటుందని అందుకే ఇలాంటి ప్రకటన చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే సంగారెడ్డిలో జగ్గారెడ్డి లాంటి నేత లేడని.. ఆయనకు పోటీగా.. నియోజకవర్గ స్థాయి నేత లేరని అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో పలువురు బలమైన అభ్యర్థులు ఇతర నియోజకవర్గాల్లో పోటీ కోసం చూస్తున్నారు. వారిలో ఎవరైనా పోటీకి సిద్ధమయ్యే చాన్స్ ఉంది.
వరుస వివాదాలతో కొంత కాలంగా సైలెంట్‌గా ఉన్న జగ్గారెడ్డి
అయితే జగ్గారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయను అనే ప్రకటన రాజకీయం మాత్రమేనని... ఆయన అనుచరులు కూడా అనుకుంటున్నారు. పార్టీ హైకమాండ్ మరో ఆలోచన లేకుండా తననే పోటీ చేయమని అడిగేలా చేయడమే ఈ వ్యూహమని అంటున్నారు. ఇటీవల జగ్గారెడ్డి కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల్లో చురుకుగా తిరుగుతున్నారు. ఆయన భార్య నిర్మలా.. పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇప్పుడు ఆమెను ఎమ్మెల్యే చేయాలని జగ్గారెడ్డి అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. జగ్గారెడ్డి ప్రకటనపై కాంగ్రెస్ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
Also Read : Harish Rao: యూపీ వెళ్లి భూతవైద్యం కోర్సు నేర్చుకుంటే బెటర్ - హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్