హైదరాబాద్ మెట్రో విస్తరణ లాభసాటి కాదన్న కేంద్రం యూపీలోని 10 నగరాల్లో నిర్మిస్తోంది: కేటీఆర్
Minster KTR: కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పలు కార్పొరేట్ కంపెనీలు 50 చెరువులను దత్తత తీసుకున్న కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
Minster KTR: హైదరాబాద్‌లో మరో వరల్డ్ క్లాస్ ఫిలింసిటీ రాబోతోందన్నారు మంత్రి కేటీఆర్. అందుకోసం రాచకొండలో భూమిని ఐడెంటిఫై చేశామన్నారు. ఒలింపిక్ స్థాయి కలిగిన స్పోర్ట్స్ సిటీ కోసం అన్వేషిస్తున్నామని తెలిపారు. అకడమిక్ సిటీ కూడా రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇవన్నీ సీఎం కేసీఆర్ మనసులో ఉన్నాయని, ఆయన ఏది ఆలోచించినా పెద్దగా ఆలోచిస్తారని అన్నారు కేటీఆర్.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పలు కార్పొరేట్ కంపెనీలు 50 చెరువులను దత్తత తీసుకున్న కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. చెరువులను అభివృద్ధి చేస్తున్న నమూనా స్టాల్స్ పరిశీలించారు. ఈ చెరువులన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలో 25 ఉండగా, హెచ్‌ఎండీఏ పరిధిలో 25 వాటర్ బాడీస్ ఉన్నాయి. ఏ చెరువు కెపాసిటీ ఎంత ఉందో మీడియాకు చెబుతామన్నారు కేటీఆర్. చెరువుల అభివృద్ధి తూతూ మంత్రంగా ఉండొద్దని సూచించారు. చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్, ప్లాంటేషన్, బెంచీలు, ఓపెన్ జిమ్స్, టాయిలెట్స్, లైటింగ్, ఆటస్థలాలు, సెక్యూరిటీ రూం , సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకేనేలా వసతులు ఉండాలని సూచించారు. హనుమకొండ భద్రకాళి బండ్ లాగా దుర్గంచెరువు కూడా లేదని అన్నారు మంత్రి కేటీఆర్. నాగర్ కర్నూల్ చెరువు హైదరాబాద్ ట్యాంక్ బండ్ లా ఉంటుందని ప్రశంసించారు.
నాకు గండిపేట నీళ్లు వంటబట్టాయి- కేటీఆర్
‘’నాలుగువ తరగతిలో నగరానికి వచ్చాను. ఇక్కడి వాతావరణం అలవాటు పడ్డాక, నాకు గండిపేట నీళ్లు వంటబట్టాయి అన్నారు. 103 సంవత్సరాల కింద ఈ రెండు రిజర్వాయర్లు కట్టారు. మన నగరానికి అతిపెద్ద వరం మూసీ నది. 94 శాతం నీరు గ్రావిటీ ద్వారా మన మూసిలోకి వస్తాయి. అప్పటి రూపురేఖలు మారిపోయాయి. దేశంలోనే అతిపెద్ద అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మన హెచ్ఎండీఏ. కుటుంబ సమేతంగా కొద్దిసేపు సమయం గడుపుదామని అనుకునే వారికి ఈ చెరువులు ఉపయోగపడతాయి. ఈ మధ్యకాలంలో దుర్గంచెరువు బ్రిడ్జ్ లేని సినిమా లేదు. ఫాక్స్ కాన్ చైర్మన్ 200 ఎకరాల్లో యూనిట్ పెడుతున్నారు. వారిని కొంగరకలాన్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా దుర్గంచెరువు బ్రిడ్జి మీదుగా తీసుకు వచ్చాను. ఆయన ఇది ఇండియానేనా అని ఆశ్చర్యపోయారు. మన నగరం చాలా అభివృద్ధి చెందిందని విదేశాల నుంచి వచ్చిన వారు చెబుతున్నారు’’- కేటీఆర్
కట్టుకథలు, పిట్టకథలు చెబితే పెట్టుబడులు రావు- కేటీఆర్
‘’50 చెరువులను తాము అభివృద్ధి చేస్తామని పెద్ద కంపెనీలు ముందుకు రావడం సంతోషకరం. ఒక్కో చెరువు అభివృద్ధికి కోటి రూపాయల వరకు ఖర్చు పెడుతున్నారు. మీరు లాభాల కోసం చూడకండి. మన ముందు తరాలకు వీటిని అందించాలి. చెరువులలో పట్టా భూములు ఉన్నాయి. ఇందుకోసం ఒక ఆలోచన చేశాం. 13 చెరువులలో ఉన్న 115 ఎకరాల ప్రైవేట్ భూములను సేకరించి 182 TDRలు ఇచ్చాం. మేము చెరువులను వారికి రాసివ్వడం లేదు. వారితో ఇక్కడ ఖర్చు చేయిస్తున్నాం. చిన్న తప్పు జరిగినా అందరం బద్నాం అవుతాం. 2022లో ఆఫీస్ స్పేస్ అంశంలో నంబర్ వన్ వచ్చింది మన హైదరాబాద్. కట్టుకథలు, పిట్టకథలు చెబితే పెట్టుబడులు రావు. వాక్సిన్ హబ్‌గా తయారైంది హైదరాబాద్. వచ్చే సంవత్సరం వరకు 1400 కోట్ల వాక్సిన్ ఉత్పత్తి అవుతుంది. ఫాక్స్ కాన్ ఏర్పాటుతో 30వేల మందికి ఉపాధి దొరుకుతుంది. ఫెడెక్స్ సంస్థ 7వేలఉద్యోగాలు సృష్టించింది. గతేడాది లక్షా 50 వేల ఉద్యోగాలు వచ్చాయి. 2021 లైఫ్ సైన్సెస్ సిస్టం విలువ 50 బిలియన్ డాలర్లు. 2030 వరకు 250 బిలియన్ డాలర్లు అనుకుంటున్నాం’’- కేటీఆర్
ఇది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందుంది- కేటీఆర్
‘’31 కి.మీ ఎయిర్ పోర్టు మెట్రోను మూడేండ్లలో పూర్తి చేస్తాం. పటాన్ చెరువు నుంచి లకిడి కా పుల్, నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు మెట్రో విస్తరణకు సహకరించాలని కేంద్రాన్ని కోరితే ఫీజిబుల్ కాదని సమాచారం వచ్చింది. వారు సహకరించినా , సహకరించకపోయినా మెట్రోని విస్తరిస్తాం. యూపీలో పది నగరాల్లో మెట్రో నిర్మిస్తున్న వారికి డబ్బులు ఇస్తారు కానీ మనకు ఎందుకు ఇవ్వరు. మన పన్నులు తీసుకుని ఇతర నగరాల అబివృద్దికి ఇస్తున్నారు. వివక్ష చూపితే బాధ అనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా హైదరాబాద్ నగర అబివృద్దికి సహకరించండి. ఫార్మా సిటీ వస్తుంది. ఇంకా చాలా అభివృద్ధి జరుగుతుంది. కోవిడ్ వల్ల ప్రభుత్వానికి లక్ష కోట్ల ఆదాయం నష్టం వచ్చింది. నగరానికి 250 కి.మీ మెట్రో తప్పకుండా ఉండాలి. 500 ఎలక్ట్రికల్ బస్సులను తెస్తున్నాం. మూసీపై 14 బ్రిడ్జిలను రూ. 10వేల కోట్లతో నిర్మిస్తున్నాం. ఇది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందుంది’’- కేటీఆర్
అగ్గిపెట్టెల్లాంటి బిల్డింగులు మనకు వద్దు- కేటీఆర్
‘’చెరువుల అభివృద్ధిని నామమాత్రంగా చేయకండి. జూలై చివరి వరకు దేశంలోనే వంద శాతం మురుగు నీటి శుద్ధి గల నగరంగా హైదరాబాద్ తయారవుతుంది. ప్రైవేట్ STPలను కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది. జిల్లాల్లో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల సుందరీకరిస్తున్నాం. నగరాల్లో, పట్టణాల్లో ఐకానిక్ బిల్డింగులు రావాల్సిన అవసరం ఉంది. మంగళూరులో విభిన్నమైన భవంతులు కనిపిస్తాయి. మనవాళ్లు కూడా ఇప్పుడిప్పుడే ధైర్యం చేస్తున్నారు. అగ్గిపెట్టెల్లాంటి భవనాలు మనకు వద్దు. వాటివల్ల నష్టం తప్ప, లాభం లేదు. డిజైన్ మీద కూడా కొంత ఖర్చు పెట్టండి’’-- కేటీఆర్