Sukumar Das: అంతర్జాతీయ పోటీలకు సుకుమార్ దాస్, పతకాలు తేవాలన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
Srinivas Goud Congratulated Sukumar Das: బ్రెజిల్ లో జరుగనున్న 11వ వరల్డ్ పారా మోటార్ ఛాంపియన్స్ షిప్ - 2022లో హైదరాబాద్‌కు చెందిన సుకుమార్ దాస్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
Minister Srinivas Goud Congratulated Sukumar Das: హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో దేశం తరఫున ప్రాతినిథ్యం వహించనున్న తెలంగాణ క్రీడాకారుడు సుకుమార్ దాస్‌ను తెలంగాణ క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ లో జరుగనున్న 11వ వరల్డ్ పారా మోటార్ ఛాంపియన్స్ షిప్ - 2022 (11th FAI World Paramotor Championships 2022)లో హైదరాబాద్ నగరానికి చెందిన పైలెట్ సుకుమార్ దాస్ భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తెలంగాణ క్రీడాకారులు దేశానికి ప్రాతినిథ్యం వహించనుండటం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు.
బ్రెజిల్ లో 11వ వరల్డ్ పారా మోటార్ ఛాంపియన్స్ షిప్ - 2022 (11th FAI World Paramotor Championship 2022 Brazil) ఏప్రిల్ 20 నుంచి 30 తేదీ వరకు జరుగనున్నాయి. భారత్‌తో పాటు 30 దేశాలకు చెందిన 150 మంది అడ్వెంచర్స్ పైలెట్లు పాల్గొంటున్నారు. వారిలో మన రాష్ట్రానికి చెందిన పైలెట్ సుకుమార్ దాస్ ఉండటం గర్వకారణమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పారా ఛాంపియన్ షిప్‌లో సుకుమార్ దాస్ పతకాలు సాధించి తిరిగి రావాలని ఆకాంక్షించారు. యూరోపియన్ దేశాల్లో ఈ అడ్వెంచర్స్ స్పోర్ట్స్, ఏరో స్పోర్ట్స్ చాలా ఫేమస్.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడలతో పాటు అన్ని రంగాలను ప్రోత్సాహిస్తున్నామని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నగరాలైన లండన్, న్యూయార్క్, పారిస్, సిడ్నీ, మెల్‌బోర్న్ నగరాలతో పాటు స్పెయిన్, జర్మనీ లాంటి దేశాల్లో ఏరో స్పోర్ట్స్, అడ్వెంచర్స్ స్పోర్ట్స్, టూరిజంతో పర్యాటకులను ఆకర్షిస్తున్నారు. దీంతో అక్కడ టూరిజం బాగా డెవలప్ అయిందన్నారు.
Congratulated Sukumar Das, resident of Hyderabad for being selected to represent our country at The 11th FAI World Paramotor Championships 2022 which will take place from April 20th to 30th in Brazil. pic.twitter.com/q5OKTwJC4g
— V Srinivas Goud (@VSrinivasGoud) February 22, 2022
పారా మోటోరింగ్ స్పోర్ట్స్ ప్రమోషన్ లో భాగంగా మన రాష్ట్రంలో హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో నగరానికి బ్రాండింగ్ ను కల్పించేందుకు పారా మోటరింగ్ ఏషియన్ ఛాంపియన్స్ షిప్ - 2022 ను నిర్వహించాలని భావిస్తున్నారు. హైదరాబాద్, మహబూబ్ నగర్ పట్టణాల్లో నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించేందుకు వరల్డ్ పారా మోటరింగ్ అసోసియేషన్- స్విజర్లాండ్, సివిల్ ఏవియేషన్ మంత్రిత్వశాఖ లు ప్రాథమికంగా అనుమతులు మంజూరు చేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
Also Read: Wriddhiman Saha: ఒకరి కెరీర్‌ను నాశనం చేసే టైపు కాదు నేను - జర్నలిస్టు పేరు చెప్పనంటున్న సాహా!
Also Read: IPL 2022 News: ఫామ్‌లో ఉన్నప్పుడు వాడుకొని ఇప్పుడు వెన్నుపోటు పొడుస్తారా - రైనా ఫ్యాన్స్ ఫైర్