Wriddhiman Saha: ఒకరి కెరీర్‌ను నాశనం చేసే టైపు కాదు నేను - జర్నలిస్టు పేరు చెప్పనంటున్న సాహా!
Wriddhiman Saha - BCCI: తనను బెదిరించిన జర్నలిస్టు పేరును బయటపెట్టనని టీమ్‌ఇండియా సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా (wriddhiman saha) అంటున్నాడు.
Wriddhiman Saha Not To Reveal Name Of Journalist: తనను బెదిరించిన జర్నలిస్టు పేరును బయటపెట్టనని టీమ్‌ఇండియా సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా (wriddhiman saha) అంటున్నాడు. ఒకవేళ బీసీసీఐ అడిగినా పేరు బయటపెట్టి అతడి కెరీర్‌ను నాశనం చేయబోనని పేర్కొన్నాడు. తన తల్లిదండ్రులు తననలా పెంచలేదని వెల్లడించాడు.
వృద్ధిమాన్ సాహా బీసీసీఐపై (BCCI) ఎదురుదాడికి దిగిన సంగతి తెలిసిందే! తనతో మాట్లాడింది ఒకటైతే ఇప్పుడు జరుగుతున్నది మరొకటని పేర్కొన్నాడు. జట్టులో తనకు చోటు ఉంటుందని సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) హామీ ఇస్తే కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) మాత్రం వీడ్కోలు నిర్ణయానికి సమయం వచ్చిందని పరోక్షంగా చెప్పాడని వివరించాడు. చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ (Chetan Sharma) సైతం మరోలా మాట్లాడుతున్నారని వెల్లడించాడు. శ్రీలంక సిరీసుకు జట్టును ఎంపిక చేసిన తర్వాత సాహా మీడియాతో మాట్లాడటం రచ్చగా మారింది.
మీడియా సమావేశం తర్వాత సాహా మరొక స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. 'నాతో ఒక ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది. నువ్వు ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటే నేను ఒత్తిడి చేయను. వారు అత్యుత్తమ వికెట్ కీపర్ ఒకరినే ఎంచుకుంటారు. కానీ నువ్వు 11 మంది జర్నలిస్టును ఎంపిక చేసేందుకు ప్రయత్నిస్తున్నావు. అదంత మంచిది కాదు. ఎక్కువ సాయపడే వారినే ఎంచుకో. నువ్వు నాకు ఫోన్ కాల్స్ చేయలేదు. నేను మళ్లీ నిన్ను ఇంటర్వ్యూ చేస్తానా! అవమానాలను నేను తేలిగ్గా తీసుకోను. నువ్విలా చేయాల్సింది కాదు' అంటూ ఆ స్క్రీన్‌షాట్‌లో ఉంది. ఓ 'గౌరవనీయ' జర్నలిస్టు తననిలా అవమాన పరిచాడని సాహా అన్నాడు. దాంతో ఆ జర్నలిస్టు ఎవరో, ఏ ఉద్దేశంతో అలా చేశాడో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ అన్నారు.
ధుమాల్ ప్రకటనపై సాహా స్పందించాడు. బీసీసీఐ నుంచి ఇంకా తనకెలాంటి కాల్స్ రాలేదని పేర్కొన్నాడు. ఒకవేళ వచ్చినా ఆ జర్నలిస్టు పేరు చెప్పనని అంటున్నాడు. పాత్రికేయుల్లో అలాంటి వారు ఉన్నారని చెప్పేందుకే స్క్రీన్ షాట్ బయటపెట్టానని పేర్కొన్నాడు. ఒకరి కెరీర్‌ను తాను నాశనం చేయాలని కోరుకోవడం లేదన్నాడు. మిగతా క్రికెటర్లకు ఇలాంటి సందేశాలు రాకూడదన్నదే తన ఉద్దేశం వెల్లడించాడు. బీసీసీఐ అంతర్గత విషయాలను బయటపెడుతున్న సాహా ఇది చెప్పననడం విడ్డూరంగా మారింది!
After all of my contributions to Indian cricket..this is what I face from a so called “Respected” journalist! This is where the journalism has gone. pic.twitter.com/woVyq1sOZX
— Wriddhiman Saha (@Wriddhipops) February 19, 2022