News
News
వీడియోలు ఆటలు
X

Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్

Minister KTR: బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో అభ్యంతరకర ట్వీట్ చేసిందుకే నటుడు చేతన్ ను అరెస్ట్ చేశారని.. కానీ తమను తిడుతుంటే మాత్రం సహనంగా భరిస్తున్నామని పేర్కొన్నారు. 

FOLLOW US: 
Share:

Minister KTR: బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో  అభ్యంతరకర ట్వీట్ చేసినందుకే కన్నడ నటుడు చేతన్ ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను ఘోరంగా అవమానిస్తున్నా సహిస్తున్నామని ట్విట్టర్ వేధికగా వెల్లడించారు. బహుశా తాము కూడా కర్ణాటక తరహాలోనే సమాధానం ఇవ్వాలేమో అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు అంటే.. అబ్యూస్ చేసే హక్కు ఉన్నట్లు కాదని మంత్రి కేటీఆర్ చెప్పారు. 

అసలీ చేతన్ ఎవరు, ఏం చేశాడు?

చేతన్ సోమవారం రోజు ఓ మతాన్ని కించపరుస్తూ ట్వీట్ చేశాడు. అది కాస్తా నెట్టింట వైరల్ గా మారడంతో కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడి ట్వీట్ రెండు వర్గాల మధ్య ఘర్షణలను రెచ్చగొట్టేలా ఉందన్న అభియోగాలపై పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే చేతన్... దళిత, గిరిజనుల హక్కుల కార్యకర్తగా పని చేస్తున్నారు. ఈయన వివాదాల్లో నిలవడం ఇదే మొదటి సారి ఏంకాదు. 2022 ఫిబ్రవరిలోనూ హిజాబ్ కేసును విచారిస్తున్న కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కృష్ణ దీక్షిత్ పై అభ్యంతరక ట్వీట్ చేసి వివాదాల్లో ఇరుక్కున్నాడు. ఈ కేసులోనే పోలీసులు అరెస్ట్ చేయగా.. ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యాడు.

Published at : 22 Mar 2023 02:15 PM (IST) Tags: KTR Latest Tweet Minister KTR Telangana News Kannada Actor Chetan Arrest KTR Tweet on Chetan Arrest

సంబంధిత కథనాలు

Weather Latest Update: సండే మండే, రెండు రోజులు అసలు బయటకు వెళ్లొద్దు- సూరన్నతో కాస్త జాగ్రత్త

Weather Latest Update: సండే మండే, రెండు రోజులు అసలు బయటకు వెళ్లొద్దు- సూరన్నతో కాస్త జాగ్రత్త

NITW MBA Admissions: నిట్‌ వరంగల్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్, ప్రవేశం ఇలా!

NITW MBA Admissions: నిట్‌ వరంగల్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్, ప్రవేశం ఇలా!

NTR Centenary Celebrations: రంగమేదైనా ఆయనే హీరో-శకపురుషుని కథనాల సమాహారం

NTR Centenary Celebrations: రంగమేదైనా ఆయనే హీరో-శకపురుషుని కథనాల సమాహారం

TS EAMCET Counselling: ఎంసెట్‌లో ఏ ర్యాంక్‌కు ఏ కాలేజీలో సీటు వ‌స్తుందో తెలుసుకోండి! గతేడాది సీట్ల కేటాయింపు ఇలా!

TS EAMCET Counselling: ఎంసెట్‌లో ఏ ర్యాంక్‌కు ఏ కాలేజీలో సీటు వ‌స్తుందో తెలుసుకోండి! గతేడాది సీట్ల కేటాయింపు ఇలా!

UPSC 2023 Civils Exam: నేడే సివిల్ సర్వీసెస్ 'ప్రిలిమ్స్' పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

UPSC 2023 Civils Exam: నేడే సివిల్ సర్వీసెస్ 'ప్రిలిమ్స్' పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

టాప్ స్టోరీస్

Telangana Politics : అయితే కొత్త పార్టీ లేకపోతే కాంగ్రెస్ - పొంగులేటి, జూపల్లి డిసైడయ్యారా ?

Telangana Politics :  అయితే కొత్త పార్టీ లేకపోతే కాంగ్రెస్ - పొంగులేటి, జూపల్లి డిసైడయ్యారా ?

New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

NT Rama Rao Jayanti : ఎన్టీఆర్‌ను దేవుడిని ఎందుకు కొలుస్తున్నారు? ఆయనకు ఎందుకు అంత క్రేజ్?

NT Rama Rao Jayanti : ఎన్టీఆర్‌ను దేవుడిని ఎందుకు కొలుస్తున్నారు? ఆయనకు ఎందుకు అంత క్రేజ్?

New Parliament Opening: కొత్త పార్లమెంట్‌పై RJD వివాదాస్పద ట్వీట్, శవపేటికతో పోల్చడంపై దుమారం

New Parliament Opening:  కొత్త పార్లమెంట్‌పై RJD వివాదాస్పద ట్వీట్, శవపేటికతో పోల్చడంపై దుమారం