Koppula Eswar : కేసీఆర్ అవమానించలేదు - ప్రగతిభవన్ ఘటనపై మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రకటన ! అసలేం జరిగిందంటే ?
కేసీఆర్ తనను అవమానించలేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ వివరణ ఇచ్చారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Koppula Eswar : తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ సీఎం కేసీఆర్ తనను అవమానించారటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. టీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి... కేసీార్ తండ్రి లాంటి వారన్నారు. గురువారం జరిగిన ప్రెస్ మీట్ లో తండ్రి హోదాలో మంత్రులను ఒక వైపు ఎమ్మెల్యేలను ఓ వైపు కూర్చోవాలని చెప్పారు. తాను ఎమ్మెల్యేల వైపు కూర్చునేందుకు సిద్ధమవుతున్ నసమయంలో.. మంత్రుల వైపు రావాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారన్నారు. అంతే తప్ప తనను సీఎం కేసీఆర్ అవమానించలేదన్నారు.
దళిత సమాజాన్ని అవమానించారని కేసీఆర్‌పై విపక్ష పార్టీల విమర్శలు
అయితే ఈ విషయంైప బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు మంత్రిని, దళిత సమాజానికి అవమానం జరిగిందని చిత్రీకరిస్తున్నారు ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇలాంటివి మానుకోవాలని హెచ్చరించారు. పార్టీ అనేది ఒక కుటుంబం ఇందులో ముఖ్యమంత్రి కెసీఆర్ రు కుటుంబానికి తండ్రి లాంటి వారు కుటుంబ సభ్యులను సంభోదించినట్టు గానే తనన సంబోధించారన్నారు. ఆ పక్కన సహచర మంత్రి హరీష్ రావు తన కోసం పక్కకు జరిగి నాకు కుర్చీ ఇచ్చారు ఇది కూడాప్రతిపక్షాలు గమనించాలని కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.
కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి తండ్రి లాంటి వారని పేర్కొన్న కొప్పుల ఈశ్వర్
అనవసరమైన విషయాలు జరిగిన సంఘటనలు పూర్తిగా తెలుసుకోకుండా ఎవరికి వారు వారికి అనుకూలంగా ఉహించుకుంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. బురద చల్లే రాజకీయం మానుకోవాలని హెచ్చరించారు. లేదంటే అసత్య ఆరోపణలు చేస్తున్న వారి పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
తన కోసం హరీష్ రావు తన సీటు ఇచ్చారని గుర్తు చేసిన మంత్రి ఈశ్వర్
ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై మీడియా ముందు వీడియో సాక్ష్యాలు ప్రవేశ పెట్టేందుకు కేసీఆర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ప్రెస్‌మీట్‌లో మాట్లాడేందుకు వచ్చిన సమయంలో.. కేసీఆర్ వెంటనే పలువురు మంత్రులతో పాటు ఇటీవల ఫామ్ హౌస్ కొనుగోలు వ్యవహారంలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. కేసీఆర్ కు ఓ వైపున కొప్పుల ఈశ్వర్ కూర్చునే ప్రయత్నం చేశారు. కేసీఆర్ రాక ముందు సీట్లలో ఎవరెవరు కూర్చోవాలో సిద్ధమయ్యారు. కేసీఆర్ రాక ముందు ఆయన పక్కన కుర్చీలో కొప్పుల ఈశ్వర్ కూర్చున్నారు.
కేసీఆర్ రాక ముందే సీటులో కూర్చున్న కొప్పుల ఈశ్వర్
అయితే కేసీఆర్ ఆయనను పక్కకు లాగేసినట్లుగా వీడియోలో కనిపించింది. కసురుకున్నారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇది దళితులకు అవమానమని.. కేసీఆర్ ఇలా చేశారని విమర్శిస్తూ.. రాజకీయ పార్టీలల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి కొప్పుల ఈశ్వర్ క్లారిటీ ఇచ్చినట్లయింది. దీనిపై విపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది.
ఏపీ ప్రభుత్వాన్ని కూడా కూల్చేందుకు బీజేపీ కుట్ర - ఎమ్మెల్యేల కొనుగోలు ఆధారాలు బయట పెట్టిన కేసీఆర్ !