అన్వేషించండి

MGNREGA Replaced by VBG RAM G: మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీ జీరామ్‌జీ స్కీమ్ అమల్లోకి.. పెరిగిన పని దినాలు

ఉపాధి హామీ స్థానంలో కేంద్రం తెచ్చిన కొత్త పథకం 'వీబీ జీరామ్‌జీ' బుధవారం నుంచి అమలులోకి వచ్చింది. దీని ద్వారా పనిదినాలు 125కి పెరిగాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • MGNREGA ముగిసి, కొత్త ఉపాధి పథకం VBG RAM-G అమలు.
  • నూతన పథకానికి రాష్ట్రానికి నిధులు, పనిదినాలు 125కు పెంపు.
  • కొత్త పథకంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు, సొంత పథకం ఆలోచన.

హైదరాబాద్: దేశవ్యాప్తంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (MGNREGA) పథకం గడువు మంగళవారంతో ముగిసింది. ఈ స్కీమ్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్, అజీవికా మిషన్‌-గ్రామీణ్‌ (VBG RAM-G) పథకం నేటి (జులై 1) నుంచి అమలులోకి రానుంది. ఈ నూతన పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం రూ.3,825.31 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తన 40 శాతం వాటా కింద రూ.2,550.21 కోట్లను కేటాయించానుంది. 

125కు పెరిగిన పనిదినాలు

పాత పథకం(MGNREGA)లో కొనసాగుతున్న మహిళా సంఘాల భవనాలు, గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ, పాఠశాల గదుల వంటి నిర్మాణాలను పూర్తి చేయడానికి కేంద్రం అనుమతించగా, బుధవారం నుంచి చేపట్టే కొత్త పనులన్నీ జీరామ్‌జీ కిందే నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక వెబ్‌సైట్, నూతన యాప్‌లను కూడా అందుబాటులోకి తెస్తున్నారు. పాత పథకంలో 100 పనిదినాలు ఉండగా, ఈ కొత్త విధానంలో కూలీలకు 125 పనిదినాలు లభించనున్నాయి.

Also Read: Rythu Bharosa Funds Release 2026:తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్- రైతు భరోసా నిధులు విడుదల- స్టాటస్‌ ఇలా చెక్ చేసుకోండి! 

రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు
ఈ నూతన పథకాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేయడం తెలిసిందే. ఈ వీబీజీ రామ్‌జీ పథకంలో చేరాలా వద్దా అనే అంశంపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం రెండు సార్లు సమావేశమై పలు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గురువారం జరగబోయే మంత్రిమండలి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. జీరామ్‌జీ మార్గదర్శకాల్లోని 2 ప్రధాన నిబంధనలపై రాష్ట్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పాత పద్ధతిలా కాకుండా కేంద్రం నిర్ణయించిన పనులనే చేయాలనడం, అలాగే వ్యవసాయ సీజన్‌లో 60 రోజులు పనులకు విరామం ఇవ్వాలనే నిబంధనల వల్ల కూలీలకు నష్టం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. కేంద్రం ఈ నిబంధనలను సడలించకపోతే, రాష్ట్రంలో సొంతంగా ఒక ప్రత్యేక ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావాలనే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తోంది.

కేంద్రానికి నివేదించిన వివరాలు
తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం అమలుపై ఇంకా అధికారిక నోటిఫికేషన్ జారీ చేయనప్పటికీ, కేంద్రం సూచనల మేరకు కొత్త బ్యాంక్ ఖాతా, ఆర్‌బీఐ (RBI) అకౌంట్‌ను ప్రారంభించింది. అలాగే రాష్ట్రంలో ముఖ గుర్తింపు విధానం అమలు చేస్తున్నట్లు, ఇప్పటివరకు 94.58 శాతం ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేసినట్లు కేంద్రానికి స్పష్టం చేసింది.



Frequently Asked Questions

పాత MGNREGA పథకం స్థానంలో ఏ కొత్త పథకం అమలులోకి వస్తుంది?

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, అజీవికా మిషన్-గ్రామీణ్ (VBG RAM-G) పథకం అమలులోకి వస్తుంది. ఇది జులై 1 నుండి ప్రారంభమవుతుంది.

కొత్త VBG RAM-G పథకంలో కూలీలకు ఎన్ని పనిదినాలు లభిస్తాయి?

కొత్త VBG RAM-G పథకం కింద కూలీలకు 125 పనిదినాలు లభిస్తాయి. పాత పథకంలో ఇవి 100 రోజులు మాత్రమే ఉండేవి.

కొత్త ఉపాధి హామీ పథకంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు ఏమిటి?

కేంద్రం నిర్ణయించిన పనులనే చేయాలనడం, అలాగే వ్యవసాయ సీజన్‌లో 60 రోజులు పనులకు విరామం ఇవ్వాలనే నిబంధనలపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ నిబంధనల వల్ల కూలీలకు నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వం వాదిస్తోంది.

కొత్త VBG RAM-G పథకం కింద తెలంగాణకు ఎంత నిధులు మంజూరయ్యాయి?

2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం రూ.3,825.31 కోట్లు మంజూరు చేసింది. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తన 40 శాతం వాటా కింద రూ.2,550.21 కోట్లను కేటాయించనుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Breaking News: హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Embed widget