Telangana Weather Update: తెలంగాణ ప్రజలంతా ఈ వారం అప్రమత్తంగా ఉండాల్సిందే - వానలు, వరదలు కూడా ! ఇవిగో పూర్తి డీటైల్స్
Heavy Rains: తెలంగాణలో ఈ వారం భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. పలు ప్రాంతాల్లో వరదలు వచ్చే చాన్సులున్నాయి.

Heavy rains Ahead in Telangana: తెలంగాణలో రాబోయే నాలుగు రోజులు అంటే ఆగస్టు 16 వరకూ అల్పపీడనం వల్ల భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పడీనం ప్రభావం భారీగా ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. దక్షిణ, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు (150-200 మి.మీ.) కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే వరంగల్, హన్మకొండ, సూర్యాపేట, యాదాద్రి వంటి జిల్లాల్లో రాత్రిపూట 150-200 మి.మీ. వర్షాలు నమోదయ్యాయి. ఈ తీవ్రత కొనసాగవచ్చునని చెబుతున్నారు.
మంగళవారం సాయంత్రం నుంచి తేలికపాటి వర్షాలు, ఆ తర్వాత రాత్రి నుండి భారీ వర్షాలు కురుస్తాయి. ఆగస్టు 13న కూడా ఇదే స్థాయిలో వర్షాలు కొనసాగుతాయి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి వంటి జిల్లాల్లో తీవ్రమైన వర్షాలు, వరదలు సంభవించవచ్చు.
పశ్చిమ , మధ్య తెలంగాణ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు (150-200 మి.మీ.) కురిసే అవకాశం ఉంది. అదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిరియల్, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మేడక్, కామారెడ్డి వంటి జిల్లాల్లో ఈ వర్షాలు భారీగా కురుస్తాయి. ఆగస్టు 14న హైదరాబాద్‌లో భారీ నుండి అతి భారీ వర్షాలు (70-120 మి.మీ.) కురుస్తాయి. పశ్చిమ హైదరాబాద్‌లో ఆగస్టు 15న కూడా భారీ వర్షాలు కొనసాగుతాయి. అదే రోజు భారత స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో, బయటి కార్యక్రమాలకు హాజరయ్యే వారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. హైదరాబాద్‌లో ఆగస్టు 15న ఆరెంజ్ అలర్ట్ జారీ చే చేశారు. ఇది భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కి.మీ. వేగంతో గాలులు వచ్చే అవకాశం ఉంటే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు.
FLOODING RAINFALL WARNING ⚠️⛈️
— Telangana Weatherman (@balaji25_t) August 12, 2025
Dear people of Telangana, due to LOW PRESSURE IMPACT, there will be FLOODING RAINS during next 4days ⚠️🌊
August 12-13 - VERY HEAVY FLOODING RAINS expected in South, East Telangana. Flooding rains (150-200mm) rains expected in few places ⚠️… pic.twitter.com/uzA8jzIpTh
హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్, ఉప్పల్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, ఒస్మానియా యూనివర్సిటీ, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, అల్వాల్, కాప్రా, హకీంపేట్ వంటి ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు , ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు ఐటీ కారిడార్‌లోని కంపెనీలకు వర్క్-ఫ్రమ్-హోమ్ ఇవ్వాలని సలహా ఇచ్చింది .





















