అన్వేషించండి

Telangana Weather: తెలంగాణలో భారీ వర్షాలు: వరదల్లో పలువురు గల్లంతు, ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత - తాజా పరిస్థితి ఇదే!

Telangana Weather: తెలంగాణలో ముసురు పట్టింది. హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో వానలు దంచి కొడుతున్నాయి. రికార్డు స్థాయిలో వర్షపాతాలు నమోదు అవుతున్నాయి.

Telangana Weather: తెలంగాణలో కరవుదీర వానలు పడుతున్నాయి. జులై మొదటి వరకు అనుకున్న వర్షాలు పడలేదు. కానీ గత వారం పది రోజుల నుంచి మాత్రం వానలు దంచి కొడుతున్నాయి. హైదరాబాద్‌సహా అన్ని జిల్లాల్లాల్లో వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. ఈ దెబ్బకు చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షపాతాలు నమోదు అవుతున్నాయి.  వాగులు వంకలు పొంగుతున్నాయి. ఈ దెబ్బకు కొన్ని ప్రాంతాల్లో రహదారులు తెగిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. మరో మూడు రోజులు వానలు తప్పవని వాతావరణ శాఖ చెబుతోంది. 

తెలంగాణలో పట్టిన ముసురు రికార్డు స్థాయి వానలకు కారణమవుతోంది. హైదరాబాద్‌లో అయితే పొద్దస్తమానం ఆకాశానికి చిల్లులు పడినట్టు వాన పడుతూనే ఉంది. ఇవాళ కాస్త పరిస్థితి అలానే ఉంది. రాత్రి నుంచి జల్లులు పడుతూనే ఉన్నాయి. మధ్య మధ్యలో కాస్త గ్యాప్ ఇస్తూ వానలు కమ్మేస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అధికారులు అప్రమత్తమయ్యారు. చెరవు గట్లు, కాలువల కట్టలు పరిశీస్తున్నారు. బలహీనంగా ఉన్న చోట చర్యలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తీసుకెళ్తున్నారు.

తెలంగాణవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పర్యాటకులు ఆ ప్రాంతాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రమాదకరంగా మారిన బొగత జలపాతం వంటి ప్రాంతాల్లో పర్యాటకుల రాకను అధికారులు నిషేధించారు. పరిస్థితులు ప్రమాదకరంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.  

ఖండాల సమీపంలోని మొలాల్ గుట్ట జలపాతంలో యువకుడు గల్లంతు
జలపాతాల వద్ద కొందరి అత్యుత్సాహం ప్రాణాల మీదికి తీసుకొస్తోంది. ఆదిలాబాద్ రూరల్ మండలం ఖండాల సమీపంలో గల మోలాల్ గుట్ట జలపాతంలో ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని భూక్తాపూర్ కాలనీకి చెందిన మనోహర్ సింగ్ (15) తన మిత్రులతో కలిసి బుధవారం ఖండాల ఘాట్ అందాలను తిలకిస్తూ మోలాల్ గుట్ట జలపాతం వద్దకు వెళ్లారు. అక్కడ జలపాతం వద్ద స్నానాలు చేస్తూ సెల్ఫీలు దిగారు. అంతలోనే కాసేపట్లో ప్రమాదవశాత్తు జలపాతంలో మనోహర్ సింగ్ గల్లంతయ్యాడు. ఇద్దరు మిత్రులు భయపడి ఎంతగా వెతికిన కనిపించలేదు. దీంతో భయపడి ఆదిలాబాద్ కు వచ్చేశారు. 

మనోహర్‌ సింగ్‌ గల్లంతైన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా.. పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక పోలీసులు డీడీఆర్ఎఫ్ బృందంతో ఘటనాస్థలానికి వెళ్లి గాలింపు చర్యలు చేపడుతున్నారు. గత 2021 లో లాక్ డౌన్ సమయంలో ఇంద్రవెల్లికి చెందిన ఓ యువకుడు ఇక్కడే కింద ఉన్న లోయలో గల్లంతయ్యాడు. ఇక్కడి ప్రాంతాల్లో ఉన్న జలపాతాలు కొంత లోతుగా ఉన్నాయి. అది తెలియక కొందరు సాహసంగా ఈతకొట్టడానికి ప్రయత్నిస్తుంటారు. స్నానాలు చేస్తుంటారు. ప్రమాదవశాత్తు జలపాతంలో గల్లంతవుతుంటారు. ఈ ప్రమాద స్థలాల వద్ద పలు సూచిక బోర్డులను ఏర్పాటు చేసి లోనికి దిగకుండా స్థానిక అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

ఇంతలా వర్షాలు పడుతున్నా చాలా మంది చేపల వేటు వెళ్తూ ప్రాణాలు తీసుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ముగ్గురు గల్లంత్యారు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలంలోని లోయర్‌ మానేర్‌ డ్యాంలో చేపల వేటకు వెళ్లిన ఓ కుటుంబంలోని ముగ్గురు గల్లంతయ్యారు. మహబూబాబాద్‌ జిల్లా ఒక వ్యక్తి కొట్టుకుపోయాడు. ఇలాంటి ప్రయత్నాలు చేసి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు. 

శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. 54,956 క్యూసెక్కులు కిందికి వదులుతున్నారు. ఇన్‌ఫ్లో 1.20 లక్షల క్యూసెక్కులుగా అధికారులు చెబుతున్నారు. నాగార్జునసాగర్‌కు 1.21 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే 5,174 క్యూసెక్కులను కింది వదులుతున్నారు. ఆల్మట్టికి 44,054 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే 25,640 క్యూసెక్కులు కిందికి విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌కు 24,842 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉంటే  14,411 క్యూసెక్కులు విడిచిపెడుతున్నారు. జూరాలకు 67 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే... 69,122 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. తుంగభద్రకు 29,546 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే 38,760 క్యూసెక్కులు కిందికి వదులుతున్నారు.  తాలిపేరు ప్రాజెక్టులో 15 గేట్లు ఎత్తి నీరు విడిచిపెడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి 98,440 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా 85 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Bonalu Traffic Diversions: బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా
బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget