AP Rain :ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు: రాబోయే 4 రోజుల్లో పిడుగులతో కూడిన వర్షాలు, జాగ్రత్తలు తప్పనిసరి!
Andhra Pradesh Weather Update: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ రైన్ అలర్ట్ జారీ చేసింది. నాలుగు రోజుల పాటు పిడుగులతో కూడిన కుండపోత ఖాయమంటూ హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.

Andhra Pradesh Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కుమ్మేస్తాయని వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా జోరు వానలు పడుతున్నాయి. మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు అధికారులు.
నాలుగు రోజులపాటు కురిసే వానలు మామూలుగా ఉండబోవని పిడుగులు, గాలి వానతో కూడినవై ఉంటాయని వాతావరణ శాఖాధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ విడుదల చేసిన ఈ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెట్ల కింద ఉండొద్దని సూచిస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వద్ద నిలబడొద్దని హెచ్చరిస్తున్నారు. వ్యవసాయానికి వెళ్లే రైతులు, బయటకు వెళ్లే ప్రజలు కచ్చితంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న నాలుగు రోజుల్లో వాతావరణం ఇలా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
మంగళవారం(22-07-2025) :అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.
బుధవారం(23-07-2025):అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
గురువారం(24-07-2025) : అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
శుక్రవారం(25-07-2025):శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు.
కాబట్టి వాతావరణ శాఖ సూచనలకనుగుణంగా ప్రజలు వారి వారి పనులను షెడ్యూల్ చేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.





















