X

Mahabubabad: స్నేహమంటే ఇదేరా... కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రాణ స్నేహితుల నివాళి...

స్నేహం విలువను చాటి కన్నీరు తెప్పించే ఘటన ఇది. రోడ్డు ప్రమాదంలో మరణించిన మిత్రుడ్ని మరిచిపోలేక అతడి పుట్టిన రోజు వేడుకలను శ్మశానంలో నిర్వహించి నివాళులు అర్పించారు.

FOLLOW US: 

స్నేహమేరా జీవితం...స్నేహమేరా శాశ్వతం అని నిరూపించారు మహబూబాబాద్ జిల్లాకు చెందిన యువకులు. రోడ్డు ప్రమాదంలో తమ మిత్రుడిని కోల్పోయమన్న బాధను దిగమింగుకుని అతడి బర్త్ డే వేడుకలు నిర్వహించారు. మిత్రుడి సమాధిపై అతడిని గుర్తుచేసుకుంటూ తల్లిదండ్రుల చేత కేక్ కట్ చేసి నివాళులు అర్పించారు.  

Also Read: TRS : రైతుల కోసం జైలుకెళ్లడానికైనా కేసీఆర్ సిద్ధమే .. కేంద్రానికి భయపడేది లేదన్న టీఆర్ఎస్

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం రాజీవ్ నగర్ తండాకు చెందిన బాలాజీ అనే డిగ్రీ విద్యార్థి నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అతని పుట్టిన  రోజు సందర్భంగా బాలాజీ స్నేహితులు శ్మశానవాటికలో సమాధి దగ్గర పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. బాలాజీ తల్లిదండ్రుల చేత కేక్ కట్ చేయించి నివాళులు అర్పించారు. స్నేహితుడి సమాధి వద్ద కేక్ కట్ చేసి శోకసంద్రంలో ఉండిపోయారు. హెల్మెట్ లేకపోవడం వలనే బాలాజీ ప్రమాదంలో చనిపోయారు. బైక్ డ్రైవింగ్ లో ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని స్నేహితులు విజ్ఞప్తి చేశారు. 

Also read: సంక్రాంతికి ఊరెళ్లిపోతా మామ... ప్రయాణికులతో బస్టాండ్ లు, రైల్వేస్టేషన్లు కిటకిట... టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

మా మిత్రుడిలా మరొకరికి కాకూడదు

మ‌హబూబాబాద్ జిల్లా కేస‌ముద్రం మండ‌లం రాజీవ్ న‌గర్ తండాకు చెందిన బాలాజీ గత ఏడాది డిసెంబ‌ర్ 10 రోడ్డు ప్రమాదంలో మ‌ర‌ణించాడు. ఎంతో స‌ర‌దాగా ఉండే స్నేహితుడి అకాల మరణాన్ని తోటి స్నేహితులు తట్టుకోలేకపోయారు. ప్రాణ‌ స్నేహితుడి లేని లోటును మరిచిపోలేకపోయారు. జనవరి 10న బాలాజీ పుట్టినరోజు. ప్రతి ఏడాది స్నేహితులతో ఎంతో వేడుకగా బాలాజీ పుట్టినరోజును జరుపుకునేవాడు. ఈ విషయం గుర్తుచేసుకున్న తోటి స్నేహితుల గుండె బరువెక్కింది. స్నేహితుడి గుర్తుగా బర్త్ డే నిర్విహించి నివాళులు అర్పించాలని నిర్ణయించుకున్నారు. దీంతో త‌మ ప్రాణ స్నేహితుడు త‌మ మ‌ధ్య లేక‌పోయినా పుట్టిన రోజు వేడుక‌ల‌ను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో బాలాజీ పుట్టినరోజును శ్మశాన‌ వాటిక‌లో స‌మాధి వ‌ద్ద కేక్ క‌ట్ చేసి నిర్వహించారు. అంత‌కు ముందు స‌మాధిని పూల‌తో అలంకరించారు. స్నేహితుడుతో గ‌డిపిన మ‌ధుర జ్ఞాప‌కాల‌ను గుర్తుచేసుకున్నారు. మిత్రుడు తమ మధ్య లేడని క‌న్మీరుమున్నీరుగా విల‌పించారు. ఇక ప్రతీ ఒక్కరూ త‌ప్పకుండా హెల్మెట్ ధ‌రించండ‌ని, త‌మ స్నేహితుడిలా మరొకరికి కాకూడదని యువ‌కులు వేడుకున్నారు.

Also read: కేసీఆర్ జాతీయ రాజకీయాలపై కేటీఆర్ కామెంట్.. కేంద్ర ఐటీ శాఖ మంత్రిగా చేయాలని కోరిన నెటిజన్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Road Accident TS News Mahabubabad ksamudram cake cut on grave yard

సంబంధిత కథనాలు

KCR Eetala : రిపబ్లిక్ డే రోజున రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు.. కేసీఆర్‌పై ఈటల తీవ్ర ఆరోపణలు !

KCR Eetala : రిపబ్లిక్ డే రోజున రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు.. కేసీఆర్‌పై ఈటల తీవ్ర ఆరోపణలు !

Republic Day 2022 Live Updates: పూంఛ్ లోని నియంత్రణ రేఖ వద్ద త్రివర్ణ పతాకం రెపరెపలు

Republic Day 2022 Live Updates: పూంఛ్ లోని నియంత్రణ రేఖ వద్ద త్రివర్ణ పతాకం రెపరెపలు

KCR Drugs Issue : డ్రగ్స్ అంతు చూడాల్సిందే..28న కేసీఆర్ అత్యున్నత సమీక్ష !

KCR Drugs Issue :  డ్రగ్స్ అంతు చూడాల్సిందే..28న కేసీఆర్ అత్యున్నత సమీక్ష !

Breaking News Live: ఏపీలో కొత్త జిల్లాలు: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు మాజీ మంత్రి ముద్రగడ లేఖ

Breaking News Live: ఏపీలో కొత్త జిల్లాలు: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు మాజీ మంత్రి ముద్రగడ లేఖ

Dharmapuri Arvind: జీవన్ రెడ్డికి ఎంపీ అర్వింద్ సవాల్.. వచ్చే ఎన్నికల్లో ఘోరంగా..

Dharmapuri Arvind: జీవన్ రెడ్డికి ఎంపీ అర్వింద్ సవాల్.. వచ్చే ఎన్నికల్లో ఘోరంగా..
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Chiranjeevi: కోవిడ్ బారిన పడ్డ చిరు.. త్వరగా కోలుకోవాలంటూ సెలబ్రిటీల ట్వీట్స్..

Chiranjeevi: కోవిడ్ బారిన పడ్డ చిరు.. త్వరగా కోలుకోవాలంటూ సెలబ్రిటీల ట్వీట్స్..

RRB NTPC Exam Suspended: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఫేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తాత్కాలికంగా రద్దు.. బోర్డు కీలక ప్రకటన

RRB NTPC Exam Suspended: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఫేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తాత్కాలికంగా రద్దు.. బోర్డు కీలక ప్రకటన

Redmi New Phone: రూ.17 వేలలోపే కొత్త షియోమీ బడ్జెట్ ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. లాంచ్ ఎప్పుడంటే?

Redmi New Phone: రూ.17 వేలలోపే కొత్త షియోమీ బడ్జెట్ ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. లాంచ్ ఎప్పుడంటే?

New Study: సెరెబ్రల్ పాల్సీ... పిల్లల్లో వచ్చే ఆ మహమ్మరి వారసత్వంగా రావచ్చు

New Study: సెరెబ్రల్ పాల్సీ... పిల్లల్లో వచ్చే ఆ మహమ్మరి వారసత్వంగా రావచ్చు