Maganti Sunitha: రౌడీలతో ఓటర్లను బెదిరిస్తున్న కాంగ్రెస్ - బీఆర్ఎస్ అభ్యర్థి ప్రెస్మీట్ - రూల్స్ ఉల్లంఘించారని ఈసీకి ఫిర్యాదు
Jubilee Hills by-election: కాంగ్రెస్ పార్టీ నేతలు రౌడీల సాయంతో పోలింగ్ ను ప్రభావితం చేస్తున్నారని మాగంటి సునీత ఆరోపించారు. ఆమె ప్రెస్మీట్ పెట్టడాన్ని కాంగ్రెస్ తప్పు పట్టింది.

Jubilee Hills by-election Maganti Sunitha pressmeet: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల్ోల కాంగ్రెస్ నేతలు ఓటర్లను బెదిరించి, ఎన్నికల ప్రక్రియను దెబ్బతీస్తున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. ఓ వైపు పోలింగ్ జరుగుతున్న సమయంలో తన నివాసంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాగంటి సునీత మాట్లాడారు. రాష్ట్రంలోని అందరూ రౌడీలు, గుండాలు జూబ్లీహిల్స్‌లోనే తిరుగుతున్నారని, వారు ఓటర్లను భయపెడుతూ బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.
స్టేట్‌లో ఉన్న ఆకు రౌడీలంతా జూబ్లీహిల్స్‌లోనే తిరుగుతున్నారు. కాంగ్రెస్ నేతల ఆదేశాల మేరకు వీరు ఓటర్లను బెదిరిస్తూ, మా పార్టీకి వ్యతిరేకంగా గుండాగిరీ స్తున్నారన్నారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో ఈ రకమైన అనైతిక చర్యలు జరుగుతున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి, ఓటర్ల హక్కులకు దెబ్బతీస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతల దుర్మార్గాలపై సునీత తీవ్ర అసంతృప్తి చెప్పారు. మా పార్టీ కార్యకర్తలపై దాడులు, ఓటర్లను భయపెట్టడం జరుగుతున్నా, పోలీసులు ఎట్టి చర్యలు తీసుకోవడం లేదన్నారు.
పోలింగ్ జరుగుతున్న వేళ
— BRS Party (@BRSparty) November 11, 2025
కాంగ్రెస్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు జూబ్లీహిల్స్ లో ఏం పని?
నిన్న రాత్రి నుండి దౌర్జన్యంగా కార్లలో చక్కర్లు కొడుతూ
ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.
- జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ 🔥#JubileeHillsWithBRS #VoteForCar… pic.twitter.com/3AilQ0b8ga
మరో వైపు మాగంటి సునీతపై ఎలక్షన్ కమిషన్ కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఎన్నికలు జరుగుతుండగా ప్రెస్ మీట్ నిర్వహించడం ఈసీ నిబంధనలకు విరుద్ధమని..ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సునీత ఉల్లంఘించారని ఫిర్యాదు చేశారు.
బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నిబంధనలకు విరుద్ధంగా నాన్ లోకల్ కాంగ్రెస్ నేతలు తిష్ట వేసి ఓటర్లను ప్రభావితం చేశారని బీఆర్ఎస్ నేతల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ విప్ లు బీర్ల అయిలయ్య, రాంచంద్ర నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ లు పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లను ప్రలోభ పెట్టిన సాక్ష్యాలను సీ ఈ ఓ కు అందజేసి చర్యలు తీసుకోవాలని కోరింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నిబంధనలకు విరుద్ధంగా నాన్ లోకల్ కాంగ్రెస్ నేతలు తిష్ట వేసి ఓటర్లను ప్రభావితం చేశారని బీఆర్ఎస్ నేతల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసింది.
— BRS Party (@BRSparty) November 11, 2025
ప్రభుత్వ విప్ లు బీర్ల అయిలయ్య, రాంచంద్ర నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ లు పోలింగ్ కేంద్రాల దగ్గర… pic.twitter.com/EmW0enl5At
రెండు పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలతో పోలింగ్.. ఉదయం నుంచి టెన్షన్ టెన్షన్ గా నడుస్తోంది. పలు చోట్ల తమను అడ్డుకున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి సునీత ఆరోపణలు చేశారు.





















