Look Back 2024 : తెలంగాణలో వచ్చే ఏడాది ఏ పార్టీకి బాగుంటుంది ? స్థానిక ఎన్నికల్లో మరో యుద్ధంలో ఎవరి నిలబడతారు.. ఎవరు పడిపోతారు?
Look Back 2024 : తెలంగాణలో ఈ ఏడాది జరిగిన పరిణామాలు వచ్చే ఏడాది కీలక మార్పులకు కారణం కానున్నాయి. అభివృద్ధి టార్గెట్ కాంగ్రెస్ ఉంది. బీఆర్ఎస్ మళ్లీ లేచి నిలబడామని అనుకుంటోంది.
Lookback 2024 What will happen in Telangana next year: తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికలు ప్రతి ఏడాది కీలకంగా మారుతున్నాయి. రాజకీయ నేతలకు ఊపిరి సలపకుండా చేస్తున్నాయి. 2023లో అసెంబ్లీ ఎన్నికలు, 2024లో పార్లమెంట్ ఎన్నికలు రాజకీయ పార్టీలను పరుగులు పెట్టించగా.. వచ్చే ఏడాది అంటే 2025 స్థానిక ఎన్నికలతో ఊగిపోనున్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీలు పొలిటికల్ ఫీవర్ తో హై టెంపర్ తో ఉన్నాయి. జనవరి నుంచే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు కూడా జరుగుతాయి. అన్ని పార్టీలు ఈ ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. తాడో పేడో తేల్చుకోవాలనుకుంటున్నాయి. అసలు సవాల్ కాంగ్రెస్ కు ఉందని అనుకోవచ్చు.
తెలంగాణలో స్థానిక ఎన్నికల ఏడాది 2025
తెలంగాణకు వచ్చే ఏడాది కూడా ఎన్నికల ఫీవర్ ఉండనుంది. పంచాయతీ ఎన్నికలను ఏడాది ప్రారంభంలోనే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం బీసీ అస్త్రం ప్రయోగిచింది. బీసీ కులగణన చేపట్టింది. ఆ మేరకు రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహించబోతున్నారు. గత పదేళ్లుగా స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టు లేదు. అధికార పార్టీగా బీఆర్ఎస్ స్వీప్ చేస్తూ వచ్చింది. ఈ సారి అధికార పార్టీగా కాంగ్రెస్ రేసులో ఉంది. ఈ సారి తుడితి పెట్టాలని అనుకుటోంది. అందుకే ఇందిరమ్మ ఇళ్లు సహా అనేక ప్లాన్లతో గ్రామీణ ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్తోంది. మెజార్టీ పంచాయతీల్లో పట్టు నిలుపుకుని తమ పాలనకు గ్రామీణ ప్రాంతాల్లో ఆదరణ ఉందని నిరూపించాలని అనుకుంటున్నారు.
మున్సిపల్, ఎన్నికలు కూడా !
పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత మున్సిపల్ ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు జరుగుతాయి. గ్రేటర్ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం. గత రెండు గ్రేటర్ ఎన్నికల్లో ఆ పార్టీ కనీసం ఐదు సీట్లను కూడా గెల్చుకోలేకపోయింది. కానీ ఈ సారి మేయర్ పీఠం గెల్చుకోకపోతే భవిష్యత్ లో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడం అంత తేలికగా ఉండదు. బీజేపీ కి హైదరాబాద్ ప్రాంతంలో మంచి పట్టు ఉంది.దాన్ని నిలుపుకోవాల్సిన అవసరం లేదు. అధికారబలంతో రెండు సార్లు గ్రేటర్ పీఠాన్ని అధిరోహించిన బీఆర్ఎస్ కు.. ఈ సారి మరింత ఎక్కువ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అభివృద్ధి బాటలో కాంగ్రెస్ సర్కార్‌కు సవాళ్లు
2025లో కాంగ్రెస్ పార్టీ ఎదుట స్థానిక ఎన్నికల సవాళ్లు మాత్రమే కాదు అభివృద్ది, పాలనా పరమైన సవాళ్లను కూడా కాంగ్రెస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫోర్త్ సిటీని, మెట్రోనూ.. పట్టాలెక్కించాల్సి ఉంది. తొలి ఏడాదిలో ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో ఏ మాత్రం ముందడుగు పడలేదు. కానీ ప్రకటనలు మాత్రం ఎక్కడికో పోయాయి. అలాగే మూసి ప్రక్షాళన కూడా. ఈ ప్రాజెక్టులన్నీ అత్యంత ఖరీదైనవి. అయినా వాటిని పట్టాలెక్కించడానికి అన్ని ప్రయత్నాలను ప్రభుత్వం చేస్తోంది. ఇక సంక్షేమ పథకాల అమలు కోసం పెద్ద ఎత్తున నిధులు సమీకిరంచుకోవాల్సి ఉంది.
జరిగిపోయిన కాలం ఏమో కానీ.. కాంగ్రెస్ పార్టీకి 2025 మాత్రం ఎన్నో సవాళ్లు తెచ్చి పెడుతోంది. అది రాజకీయంగానే కాదు.. పాలనా పరంగా కూడా. ఎలా ఎదుర్కొంటారన్నది అత్యంత కీలకం. అదే ఆ తర్వాత కాంగ్రెస్ దారిని నిర్దేశిస్తుందని అనుకోవచ్చు.