అన్వేషించండి

Medchal News: మేడ్చల్ పట్టణంలో భవనాల కూల్చివేతలు - హైకోర్టు ఆదేశాలు పాటించలేదని విమర్శలు

HYDRA Demolitions: మేడ్చల్‌లో ఫుట్‌పాత్‌ల కూల్చివేతలపై చిరు వ్యాపారులు హైడ్రా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలున్నా కూల్చేస్తుండడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు.

Protest Against HYDRA Demolitions In Medchal Town: మేడ్చల్ (Medchal) పట్టణంలో 'హైడ్రా' (HYDRA) కూల్చివేతలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాతు. ప్రధాన మార్కెట్ దారిలో అక్రమ నిర్మాణాలంటూ మున్సిపల్ అధికారులు ఫుట్‌పాత్‌లను కూల్చివేస్తుండగా.. ఎలాంటి నిబంధనలు పాటించకుండా కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలున్నప్పటికీ కూల్చివేతలు చేయడం ఎంతవరకూ సమంజసమని అధికారులను ప్రశ్నించారు. వాస్తవానికి గతంలో మేడ్చల్ గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు సంబంధిత భూ యజమానులు సొంత స్థలంలోనే నిర్మించుకున్నారు. అంతే కాకుండా రోడ్డుకు సుమారు 5 ఫీట్ల స్థలాన్ని వదిలి నిర్మాణాలు చేపట్టారు. అయితే మున్సిపల్ అధికారులు పోలీసులను రంగంలోకి దింపి అక్రమ నిర్మాణాలంటూ ఫుట్ పాత్లను తొలగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో సైతం రోడ్డు వెడల్పు పేరుతో ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలను కూల్చేందుకు ముందుకు రాగా అప్పటి సర్పంచికి వ్యతిరేకంగా హైకోర్టులో 19906/ 2003 బాధితులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు బాధితులకు న్యాయం జరిగేలా నష్ట పరిహారాన్ని చెల్లించి చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ, బాధితులెవరకీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్ట పరిహారం అందలేదని బాధితుల్లో ఒకరైన వై.విశ్వనాథ్ హైకోర్టుకు వెళ్లి ఆర్డర్ పొందారు. ప్రస్తుతం మున్సిపల్ అధికారులకు హైకోర్టు ఆదేశాలు వివరించినా.. అవేమీ పట్టించుకోకుండా పోలీస్ బందోబస్తుతో ఫుట్‌పాత్‌లను తొలగించేశారని అన్నారు. 

ఇదిలా ఉండగా మేడ్చల్ మున్సిపల్ పరిధిలో జి ప్లస్ టు అనుమతులు పొంది అదనపు అంతస్తులు నిర్మిస్తున్న వారి జోలికి వెళ్లని మున్సిపల్ అధికారులు.. చిరు వ్యాపారులపై వారి ప్రతాపం చూపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బడాబాబుల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సింది పోయి చిరు వ్యాపారులపై ప్రతాపం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలే అమలు కాకపోతే మున్సిపల్ యంత్రాంగం.. ప్రజలకు, ప్రభుత్వానికి శాసన వ్యవస్థకు ఏం చెప్పాలనుకుంటున్నారని బాధితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ పొట్రు జోక్యం చేసుకొని సమగ్రమైన విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

బీజేపీ మద్దతు 

అక్రమ కట్టడాలంటూ చిరు వ్యాపారులకు సంబంధించిన ఫుట్‌పాత్‌లను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించడం పూర్తిగా ఖండిస్తున్నామని మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలిపారు. బీజేపీ ప్రభుత్వం చిరు వ్యాపారులకు ఎలాంటి హామీ లేకుండా నగదు ప్రోత్సహం అందిస్తుంటే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వారిని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. చిరు వ్యాపారులను ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తే లోన్ రూపంలో లబ్ధి పొందిన వ్యాపారులు తిరిగి ఆ లోన్ డబ్బులను ఎలా చెల్లిస్తానని ఏనుగు సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. పట్టణ అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదని, అయితే సమాచారం లేకుండా ఇలాంటి చర్యలు చేపట్టకుండా అందరికీ ఒకే న్యాయం ఉండాలని కోరుతున్నట్లు చెప్పారు. చిరు వ్యాపారులకో న్యాయం, బడా వ్యక్తులకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. చిరు వ్యాపారులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Also Read: Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Sai Durgha Tej: ‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
Allu Arjun: రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Viral News: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ !  వీడియో
ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో
Embed widget