అన్వేషించండి

Goshamahal Plitics : గోషామహల్ సీటు కోసం ఓవైసీ చుట్టూ బీఆర్ఎస్ ఆశావహుల చక్కర్లు - రాజాసింగ్ చెబుతోంది నిజమేనా ?

బీఆర్ఎస్ టిక్కెట్ల కోసం ఓవైసీ దగ్గరకు వెళ్తున్నారు నేతలు. ఏబీపీ దేశం ఎక్స్‌క్లూజివ్ స్టోరీ

Goshamahal Plitics :  గోషామహల్ బీఆర్ఎస్ టిక్కెట్‌ ను ఖరారు చేసేది మజ్లిస్ చీఫ్ ఓవైసీనేనని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపిస్తున్నారు. అందుకే టిక్కెట్ ఎవరికి ఇస్తారో ఖరారు చేయలేదంటున్నారు. దానికి తగ్గట్లుగానే గోషామహల్ బీఆర్ఎస్ ఆశావహులు మజ్లిస్ చీఫ్ ఆశీస్సుల కోసం తిరుగుతున్నారు. గోషామహల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరపున ఎక్కువగా  పర్యటిస్తోంది గడ్డం శ్రీనివాస్ యాదవ్ అనే నేత. ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ ఆఫీసులో కంటే ఎక్కువగా  మజ్లిస్ ఆఫీసులోనే కనిపిస్తున్నారు. తన పేరును సిఫారసు చేయాల్సిందిగా ఆయన మజ్లిస్ చీఫ్ ను కోరుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మజ్లిస్ చీఫ్ తో మంతనాలు జరుపుతున్న గడ్డం శ్రీనివాస్ ఫోటోలను  ABP దేశం ఎక్స్ క్లూజివ్‌గా సేకరించింది. 
Goshamahal Plitics :  గోషామహల్ సీటు కోసం ఓవైసీ చుట్టూ బీఆర్ఎస్ ఆశావహుల చక్కర్లు -  రాజాసింగ్ చెబుతోంది నిజమేనా ?

మజ్లిస్ చీఫ్ ప్రాపకం కోసం బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ యాదవ్ మంతనాలు

గడ్డం శ్రీనివాస్ యాదవ్ గోషామహల్ నియోజకవర్గంలో చాలా కాలంగా పని చేసుకుంటున్నారు. ఆయన ఇప్పుడు మజ్లిస్ సపోర్ట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఎంఐఎం ప్రజాప్రతినిధులు నిర్వహించే ప్రజాదర్బార్‌కు వెళ్లిన శ్రీనివాస్ యాదవ్  చేతులు చాచి ఓవైసిని అభ్యర్దిస్తున్నట్లున్న  ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. శ్రీనివాస్ యాదవ్  గోషామహల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ కార్యకలాపాల్లో యాక్టీవ్ గా ఉంటూ పార్టీ తరుపున రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ ఆశిస్తున్నారు. తాజాగా ABP దేశం చేతిలో ఉన్న  ఫొటోలలో ఓవైసితో గడ్డం శ్రీనివాస్ యాదవ్  , దారుసలామ్ లో ప్రత్యేకంగా కలిసిన విషయాన్ని బట్టబయలు చేస్తోంది. MIM అధినేతతో గోషామహల్ బిఆర్ ఎస్ కు ఏం పని అందులోనూ టిక్కెట్ రేసులో ఉన్న కీలక నేతకు మంతనాలేంటి అనే ప్రశ్నలు అనేక సందేహాలకు తావితస్తున్నాయి. ఓవైసి కరుణిస్తేనే.. లేదా అయన రిఫర్ చేస్తేనే గోషామహల్ సీటు దక్కుతుందనే ఉద్దేశ్యంతో ఇలా క్యూకడుతున్నారనే విమర్శలకు బలం చేరుకూరుతున్నాయి ఈ ఫొటోస్..
Goshamahal Plitics :  గోషామహల్ సీటు కోసం ఓవైసీ చుట్టూ బీఆర్ఎస్ ఆశావహుల చక్కర్లు -  రాజాసింగ్ చెబుతోంది నిజమేనా ?

ప్రేమ్ సింగ్ రాథోడ్‌కి కూడా అదేపని ! 

ఓవైసి సిఫారసు కోసం గడ్డం శ్రీనివాస్ యాదవే కాదు.. సీనియ్ర నేత ప్రేమ్ సింగ్ రాథోడ్ కూడా ప్రయత్నిస్తున్నారు. ఆయన కూడా దారుసలాంలో పడిగాపులు పడుతూ  కెమెరాలకు చిక్కారు.  గోషామహల్ బిఆర్ ఎస్ ఎమ్మెల్యే రేసులో ఉన్న మరో్ అభ్యర్దిగా ప్రేమ్ సింగ్ రాథోడ్ పై టాక్ నడుస్తోంది. ఈయన  సైతం నేరుగా ఒవైసిని కలసిన ఫోటో ABP దేశంకు చిక్కింది. ఇలా ఒకరు ఇద్దరు కాదు. గోషామహల్ నియోజకవర్గంలో బిఆర్ ఎస్ తరుపున ఎవరికి సీటు కావాలో ఆశావహలు నేరుగా MIM అధినేత ఒవైసిని కలసి అభ్యర్దిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ వార్తలకు బలం చేరేకూరేలా తాజాగా రాజాసింగ్ సైతం తనదైన శైలిలో విమర్శలతో రెచ్చిపోయారు. దారు సలామ్ నుండి బిఆర్ ఎస్ అభ్యర్దిని ఎంపిక చేస్తారు అంటూ మరోసారి బిఆర్ ఎస్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసారు రాజాసింగ్.
Goshamahal Plitics :  గోషామహల్ సీటు కోసం ఓవైసీ చుట్టూ బీఆర్ఎస్ ఆశావహుల చక్కర్లు -  రాజాసింగ్ చెబుతోంది నిజమేనా ?

గ్రేటర్ హైదరాబాద్ నాయకులంతా దారుస్సలాంకు క్యూ ! 

గ్రేటర్ పరిధిలో  బీఆర్ఎస్ నతలు కొంత మంది కేవలం డమ్మీలుగా పోటీ చేస్తూంటారు. ముఖ్యంగా మజ్లిస్ సిట్టింగ్ సీట్లలో.  ఓట్లను చీల్చే వ్యూహంతో నిలబెడతారు. నాంపల్లి నియోజకవర్గంలో కూడా అదే ఉద్దేశంతో టిక్కెట్ ఖరారు చేయలేదు. అక్కడ తన పేరు సిఫార్సు చేయాలని  ఆనంద్ కుమార్ గౌడ్ అనే నేత..  ఓవైసీని కోరుతున్నారు.  హైదరాబాద్ లో బిఆర్ ఎస్ అభ్యర్దులు ఎవరైతే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్నారో వారు నేరుగా ఓవైసి ఆశీర్వాదం తీసుకుంటున్నారట.అలా ఆయన ఓకే అంటేనే ఖాళీగా ఉన్న స్దానాల్లో కొత్త లిస్ట్ లో వారి పేరు ఉంటుందనే టాక్ నడుస్తోంది.అలా విమర్శించేవారికి మాటలను బలపరిచేలా ఇదిగో ఇలా ABP దేశం చేతికి చెక్కిన  ఫొటోలు పలు పశ్నలు , సందేహాలు సంధిస్తున్నాయి. ఇప్పటికే బిజెపి నేతలు బిఆర్ ఎస్ కారు స్టీరింగ్ MIM చేతిలో ఉందని పదే పదే విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఈ ఫోటోల అంతర్యంపై బిఆర్ ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో వేచిచూద్దాం..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
IRCTC Compensation : ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Embed widget