Telangana New DGP: తెలంగాణ నూతన డీజీపీగా రవిగుప్తా నియామకం - ఈసీ కీలక ఉత్తర్వులు
Telangana New DGP: తెలంగాణ నూతన డీజీపీగా రవిగుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
Ravigupta Appointed as Telangana New DGP: తెలంగాణ నూతన డీజీపీగా రవి గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. రవిగుప్తా 1990 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగంతో పాటు ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు నిర్వరిస్తున్నారు.
అంజనీ కుమార్ పై వేటు
కాగా, ప్రస్తుతం తెలంగాణ డీజీపీగా ఉన్న అంజనీ కుమార్ పై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే అంజనీ కుమార్, ఇద్దరు అదనపు డీజీలు సందీప్‌కుమార్ జైన్, మహేశ్‌భగవత్ లు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారంపై చర్చించారు. దీంతో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఆగ్రహించిన ఈసీ ఆయన్ను సస్పెండ్ చేసింది. ఇదే సమయంలో ఇద్దరు అదనపు డీజీలకు నోటీసులు జారీ చేసింది. దీనిపై అంజనీ కుమార్ ను వివరణ కోరింది. అనంతరం నూతన డీజీపీగా రవిగుప్తాను నియమిస్తూ ఆదేశాలిచ్చింది.