News
News
X

KTR Birthday: కేటీఆర్ 'గిఫ్ట్ ఏ స్మైల్'.. 100 మంది దివ్యాంగులకు వాహనాలు

ఈ నెల 24న మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా..  గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా.. వంద మంది దివ్యాంగులకు ప్రత్యేకమైన బైకులను అందించనున్నట్లు ట్విట్టర్లో కేటీఆర్ తెలిపారు.

FOLLOW US: 

కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా వంద మంది దివ్యాంగులకు ప్రత్యేకమైన వాహనాలను  అందించనున్నారు. కిందటి సంవత్సరం గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా తాను 6 అంబులెన్స్‌లను విరాళంగా ఇవ్వగా.. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు 90 ఇచ్చారని గుర్తు చేశారు.

ఈ సంవత్సరం కూడా.. సేవాకార్యక్రమాలు చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే తాను స్వయంగా 100 త్రిచక్ర వాహనాలను వికలాంగులకు అందిస్తానని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రకటించారు. పార్టీ శ్రేణులు కూడా ఇలాంటీ సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే పలువురు దివ్యాంగులు కేటీఆర్ ను ట్విట్టర్ ద్వారా.. వాహనాలు కావాలని అడుగుతున్నారు. దానికి ఆయన సానుకూలంగా స్పందిస్తున్నారు.

బొకేలు, కేకులు, హోర్డింగుల కోసం డబ్బు వృథా చేయొద్దని టీఆర్ఎస్ కార్యకర్తలకు కేటీఆర్ సూచించారు. కేటీఆర్ పిలుపు మేరకు తాము కూడా దివ్యాంగులకు ఉచితంగా వాహనాలు పంపిణీతో పాటు ఇతర సాయం అందిస్తామని నేతలు చెబుతున్నారు.

పలువురు పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు, ముందుకు వచ్చారు.  ఎమ్మెల్సీ నవీన్ రావు 100, ఎమ్మెల్సీలు శంబిపూర్ రాజు 60, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి 60, మంత్రి పువ్వాడ అజయ్ 50 , ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు 20, గాదరి కిషోర్ 20 త్రిచక్ర వాహనాలను కేటీఆర్ జన్మదినం సందర్భంగా అందిస్తామని చెప్పారు. 

News Reels

మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, శానంపూడి సైదిరెడ్డి, జీవన్ రెడ్డి పలువురు తమ వ్యక్తిగత స్థాయిలో త్రిచక్ర వాహనాలను అందిస్తామన్నారు.

‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’.. కింద గతేడాది వచ్చిన.. అంబులెన్సులు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఈ కార్యక్రమం ద్వారా.. ఎంతోమంది సేవలందుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చిన అంబులెన్సులు చాలామంది రోగులకు అపర సంజీవనులయ్యాయని చెప్పొచ్చు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రులను క్షణాల్లో దవాఖానలకు చేర్చి ఊపిరి పోశాయి. కదిలే వైద్యశాలలుగా కనిపించే ఈ వాహనాల్లో అత్యాధునికమైన వైద్య పరికరాలు ఏర్పాటు చేయడంతో మెరుగైనప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 18 వాహనాలు ఆయా దవాఖానలకు రాగా పదివేల మందికిపైగా సేవలు అందించాయి.

Last year on the eve of my birthday, I had personally donated 6 ambulances & our TRS MLAs & MPs joined in taking the total No. to 90!

This year too, decided that the best way to celebrate is to #GiftASmile in personal capacity to 100 differently abled with custom made vehicles pic.twitter.com/9YcgpHgY7S

— KTR (@KTRTRS) July 22, 2021 " title="" target="">

Also Read: Rains: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజులు కూడా గొడుగులు పట్టుకొని తిరగాల్సిందే!

Published at : 22 Jul 2021 09:00 PM (IST) Tags: gift a smile KTR ktr birthday

సంబంధిత కథనాలు

Sharmila Arrest : కారులో షర్మిల - క్రేన్‌తో తరలించిన పోలీసులు ! సోమాజిగూడలో హైడ్రామా

Sharmila Arrest : కారులో షర్మిల - క్రేన్‌తో తరలించిన పోలీసులు ! సోమాజిగూడలో హైడ్రామా

Gadwal News : సెల్ ఫోన్ ఛార్జింగ్ తీస్తుండగా విద్యుత్ షాక్, పదేళ్ల బాలిక మృతి!

Gadwal News : సెల్ ఫోన్ ఛార్జింగ్ తీస్తుండగా విద్యుత్ షాక్, పదేళ్ల బాలిక మృతి!

Hyderabad News: పదో తరగతి విద్యార్థినిపై క్లాస్‌మేట్స్ అత్యాచారం- వైరల్‌ వీడియో చూసి తల్లిదండ్రులు షాక్!

Hyderabad News: పదో తరగతి విద్యార్థినిపై క్లాస్‌మేట్స్ అత్యాచారం-  వైరల్‌ వీడియో చూసి తల్లిదండ్రులు షాక్!

Breaking News Live Telugu Updates: వైఎస్ షర్మిల అరెస్టు, ప్రగతి భవన్‌కు వెళ్తుండగా పంజాగుట్టలో అదుపులోకి

Breaking News Live Telugu Updates: వైఎస్ షర్మిల అరెస్టు, ప్రగతి భవన్‌కు వెళ్తుండగా పంజాగుట్టలో అదుపులోకి

CM KCR Diksha Divas: తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలకమైన రోజు - నవంబర్ 29

CM KCR Diksha Divas: తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలకమైన రోజు - నవంబర్ 29

టాప్ స్టోరీస్

బక్క పలుచని వీరుడు బందూకై తన జాతిని మేలు కొలిపిన రోజు: కేటీఆర్‌

బక్క పలుచని వీరుడు బందూకై తన జాతిని మేలు కొలిపిన రోజు: కేటీఆర్‌

Pushpa Russian Trailer: ‘పుష్ప’ రష్యన్ ట్రైలర్ వచ్చేసింది, రిలీజ్ ఎప్పుడంటే?

Pushpa Russian Trailer: ‘పుష్ప’ రష్యన్ ట్రైలర్ వచ్చేసింది, రిలీజ్ ఎప్పుడంటే?

NBK Unstoppable Episode 5 : మళ్ళీ బాలకృష్ణ ట్రిపుల్ ధమాకా - పూలు, పళ్ళు డిస్కషన్ వస్తే...

NBK Unstoppable Episode 5 : మళ్ళీ బాలకృష్ణ ట్రిపుల్ ధమాకా - పూలు, పళ్ళు డిస్కషన్ వస్తే...

Shraddha Murder Case: అఫ్తాబ్‌పై హత్యాయత్నం- పోలీసు వాహనాన్ని చుట్టుముట్టి కత్తులతో!

Shraddha Murder Case: అఫ్తాబ్‌పై హత్యాయత్నం- పోలీసు వాహనాన్ని చుట్టుముట్టి కత్తులతో!