KTR On Modi: వరంగల్ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే రావాలి - ప్రధాని మోదీకి కేటీఆర్ డిమాండ్ !
ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే వరంగల్ రావాలని ప్రధాని మోదీని కేటీఆర్ డిమాండ్ చేశారు. వరంగల్ ప్రజలకు ఇచ్చిన హామీలను మోదీ ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు.
KTR On Modi: వరంగల్ ప్రజలకు ఇచ్చిన మాట తప్పిన ప్రధాని నరేంద్ర మోడీ క్షేమపణ చెప్పిన తర్వాతే వరంగల్ కు రావాలి అని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లాలో పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. మరో పదిరోజుల్లో నరేంద్ర మోడీ వరంగల్ కు వస్తున్నారు.. వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజల తరుపున అడుగుతున్నానని ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతాం అన్నారు.. ఎందుకు ఉక్కు పరిశ్రమ పెట్టడం లేదు.. వరంగల్ కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెడుతాం అని మాట తప్పారన్నారు. రైళ్లు తయారీ కేంద్రం పెడతామని చెప్పి ఇప్పుడు మెకానిక్ ఫాక్టరీ పెడతా అంటున్నారు అని కేటీఆర్ విమర్శించారు. వీటన్నింటిపై మాట తప్పినందుకు మోదీ క్షమాపణ చెప్పి రావాలన్నారు.
పోడు పట్టాల పంపిణీ ద్వారా 4లక్షల 6 వేల ఎకరాలు 1.50 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుందని.. ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే 24, 972 మంది రైతులకు 70, 434 ఎకరాల భూమిని పంపిణీ చేస్తున్నామన్నారు. జల్ జంగల్ జమీన్ అనే కొమురం భీం నినాదంతో అన్ని తండాలకు మంచినీరు అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. బిందెలు, కుండలు పట్టుకుని ఆడపడుచులు రోడ్డు పైకి వచ్చే పరిస్థితి తెలంగాణలో లేకుండా పోయిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హరిత హారం పేరుతో చెట్ల పెంపకంతో పాటు ఇప్పుడు గిరిజనుల అభివృద్ధి కోసం పోడు పట్టాలు పంపిణీ చేసి భూమి కూడా ఇస్తున్నామన్నారు.
6 శాతం ఉన్న గిరిజనులు, ఆదివాసీల రిజర్వేషన్ ను 10 శాతంకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని కేటీఆర్ అన్నారు. పోడు భూములకు పట్టాలు పొందడంతో పాటు రైతు బంధు, రైతు భీమా పొందుతున్నారు. జిల్లాల పునర్విభజన తరువాత మీకు పాలన అందుబాటులోకి వచ్చింది అని కేటీఆర్ తెలిపారు. 10 మంది డాక్టర్లు లేని మహబూబాబాద్ సర్కారు దవాఖానకు 110 మంది వైద్యులు వచ్చారు.. కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి మోసపోవద్దు.. ఆచరణ సాధ్యం కాని హామీలతో మీ ముందుకు వస్తున్నారు.. వారి మాటలు వింటే మీరు మోసపోతారు అని మంత్రి కేటీఆర్ అన్నారు.
అంతకు ముందు గుమ్మడూరులోని రామచంద్రాపురం కాలనీలో 200 డబుల్ బెడ్‌రూం ఇండ్లను మంత్రి ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇంటిపేపర్లను అందజేశారు. అంతకుముందు మానుకోటలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద రూ.50 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం రూ.5 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్, ఫ్రూట్స్, ఫ్లవర్ మార్కెట్లను ప్రారంభించారు.
పట్టణ ప్రజలకు అవసరమైన నాణ్యమైన, తాజా కూరగాయలు, పండ్లు, మాంసం అన్నీ ఒకే చోట లభించేలా తెలంగాణ ప్రభుత్వం ప్రతీ మున్సిపాలిటీలో సమీకృత మార్కెట్ల నిర్మాణం చేపట్టింది.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) June 30, 2023
ఈ కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ పట్టణంలో నిర్మించిన సమీకృత మార్కెట్ ను మంత్రులు @KTRBRS, @Satyavathi_BRS, @EDRBRS… pic.twitter.com/h3I2FCHbD9