అన్వేషించండి

KTR Saval To Revanth Reddy : దమ్ముంటే మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేద్దాం రా - రేవంత్ రెడ్డికి కేటీఆర్ సంచలన సవాల్ !

KTR Saval To Revanth Reddy :మల్కాజిగిరిలో పోటీ చేద్దాం రమ్మని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. ఒక్క సీటైనా గెలవాలన్న రేవంత్ సవాల్‌కు కేటీఆర్ ఘాటు కౌంటర్ ఇచ్చారు.

KTR Saval To Revanth Reddy :  దమ్ముంటే ఒక్క లోక్‌సభ సీటు గెల్చుకుని చూపించాలని  సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు.   రేవంత్  కు దమ్ముంటే  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రావాలని..  … మల్కాజ్ గిరిలో పోటీ చేద్దామని సవాల్ చేశారు.  అది అయన సిట్టింగ్ సీటే కదా దమ్ముంటే పోటీకి రావాలన్నారు.  తాను సిరిసిల్లలో ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తానన్నారు.  ఇద్దరం పదవులకు రాజీనామా చేసి పోటీ చేద్దామన్నారు. కేటీఆర్ చేసిన సవాల్ వైరల్ అవుతోంది.  

రాజకీయాల్లో గెలుపోటములు సహజం ! 

గెలిచిన ప్రతిసారి మగవాడిని ..ఓడితే  కాదు అంటావా అని కేటీఆర్ ప్రశ్నించారు.  కొడంగల్ లో  ఓడిపోయినప్పుడు మగాడివి కాదా అని మండిపడ్డారు. మగాడివి అయితే..  రైతులకు 2 లక్షల రుణ మాఫీ చేయి..  అడబిడ్డలకు 2500 ఇవ్వు… ఇచ్చిన 420 హమీలు అమలు చేయాలన్నారు.  అడవాళ్లు రాజకీయాల్లో గెలవ వద్దా ఇవేం మాటలని మండిపడ్డారు.  రేవంత్ కు  ఆత్మన్యూనతాభావం ఉందన్నారు.  కొండగల్,  గ్రేటర్ ఎన్నికల్లో  పోటీ చేసి… సవాల్ విసిరి పారిపోయాడని కేటీఆర్ గుర్తు చేశారు.  ఆయన మాటకు విలువ ఏం ఉందని ప్రశ్నించారు.  రాజకీయాల్లో గెలుపు ఒటములు సహజమన్నారు. 

రేవంత్ రెడ్డిది  పేమెంట్ కోటా !                                                          

తనను పదే పదే మేనేజ్‌మెంట్ కోటా లీడర్ అని అనడంపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తనది మేనేజ్ మెంట్ కోటా అయితే… రాహుల్, ప్రియంకాలది ఏం కోటా అని ప్రశ్నించారు.  రేవంత్ ది పేమెంట్ కోటా అని ఎద్దేవా చేశారు. మాణిక్యం ఠాగూర్‌కు డబ్బులిచ్చి పదవులుతెచ్చుకున్న  పేమెంట్ కోటా అన్నారు.  పేమెంట్ కోటాలో సీటు తెచ్చుకున్నందుకే రేవంత్… ఢిల్లీకి పేమెంట్ చేయాలన్నారు.  బిల్డర్లను బెదిరించాలి… వ్యాపారులను బెదిరించాలి… ఢిల్లీకి కప్పం కట్టాల్సి ఉందన్నారు.   అందుకే భవన నిర్మాణ అనుమతులు ఆపారన్నారు. ఎన్ని ఆపారు.. ఎన్ని అనుమతులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.  త్వరలో బిల్డర్లు, వ్యాపారులు రేవంత్ సెస్ పై రోడ్ ఎక్కుతారని జోస్యం చెప్పారు.   తానే  సీఎం అని పదేపదే చెప్పుకుంటున్నారని..  అయనకు అయననే సీఎం అన్న నమ్మకం  లేదా అని ఎద్దేవా చేశారు. 

రేవంత్ కేటీఆర్ సవాల్‌ను స్వీకరిస్తారా ?                  

చేవెళ్లసభలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ , కేటీఆర్ పై ఘాటుగా విరుచుకుపడ్డారు. ఒక్క సీటులో అయినా గెలవాలని సవాల్ చేశారు. రేవంత్ చేసిన సవాల్‌తో పాటు.. చేసిన విమర్శలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో కేటీఆర్ అంతే ఘాటుగా స్పందించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మల్కాజిగిరిలో పోటీకి సిద్ధమవుతారా లేదా అని.. బీఆర్ఎస్ నేతలు ఎదురదుదాడికి దిగే అవకాశం ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget