అన్వేషించండి

Bandi Sanjay : కొండగట్టు బాధితులను ఆదుకుంటే కేసీఆర్ కు పాలాభిషేకం చేస్తా, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay : కేంద్రం తెలంగాణలో మానవహక్కులు కాలరాస్తోందన్న కవిత వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.

Bandi Sanjay : సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మానవ హక్కులను కాలరాస్తోందే కేసీఆర్ అంటూ విమర్శలు చేశారు. అత్యాచారాలు, హత్యలు, దోపిడీ జరుగుతుంటే కవిత కళ్లలో నుంచి నిప్పులెందుకు రాలేదని ప్రశ్నించారు. కనీసం బాధితులను పరామర్శించాలనే సోయి ఎందుకు రాలేదన్నారు. కవితను అరెస్ట్ చేస్తారనే సరికి మహిళలంతా కన్నీళ్లు, నిప్పులు కురిపించాలా? అంటూ ప్రశ్నించారు.  ఇంటికో ఉద్యోగం, పెన్షన్, ఆర్థిక సాయం చేస్తానన్న హామీలు ఏమయ్యాయన్నారు. కొండగట్టు ప్రమాద బాధితులకు ఇప్పటి వరకూ సాయం అందలేదని ఆరోపించారు. బస్సులో ప్రయాణించడమే వాళ్లు చేసిన పాపమా? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకూ ప్రమాద బాధితులను సీఎం కేసీఆర్ పరామర్శించలేదన్నారు.   గోడ కట్టడం తప్ప కొండగట్టు వద్ద ప్రమాదాలు జరగకుండా తీసుకున్న చర్యలు శూన్యమని ఆరోపించారు. కొండగట్టు బాధితులను పూర్తిస్థాయిలో ఆదుకుంటే కేసీఆర్ కు పాలాభిషేకం చేస్తామన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే కొండగట్టు బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు.  

కల్వకుంట్ల అవినీతికి జేజేలు కొడితే మానవహక్కులున్నట్లా? 

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో మానవ హక్కులను హరిస్తుందని కేసీఆర్ బిడ్డ, ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై  ఎంపీ బండి సంజయ్ కుమార్ ఘాటుగా వ్యాఖ్యానించారు. మానవ హక్కుల గురించి మాట్లాడే నైతిక అర్హత కవితకు లేదన్నారు. మానవ హక్కులను హరించి వేస్తోంది కేసీఆర్ అన్నారు. ప్రశ్నించే వాళ్లే ఉండకూడదని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ ను ఎత్తేశారమన్నారు. ప్రశ్నించే వాళ్లపై కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారని మండిపడ్డారు. నిజాలు రాసే మీడియాను తొక్కివేస్తున్నారని ఆరోపించారు.  ప్రశ్నించే కవులు, కళాకారులు, మేధావులను బెదిరిస్తున్నారన్నారు. బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ రాజ్యాంగాన్నే కేసీఆర్ తిరిగ రాస్తానన్నారని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం చేస్తున్న అరాచకాలకు, అవినీతికి జేజేలు కొడితేనే మానవ హక్కులున్నట్లా? అంటూ ఎద్దేవా చేశారు. మీడియాను బీజేపీ అణిచివేస్తోందంటూ కవిత చేసిన వ్యాఖ్యలపైనా బండి సంజయ్ మండిపడ్డారు. 

అయ్య కాడికి పోయి ఏడవమను

‘‘కేసీఆర్ సీఎం కాగానే కొన్ని టీవీ ఛానళ్లను బ్యాన్ చేసిందెవరు? మీడియాను పాతాళానికి తొక్కేస్తానని బెదిరిస్తున్నదెవరు?  సీఎం హోదాలో ప్రెస్ మీట్ పెడితే ఒక్క విలేకరిని కూడా ప్రశ్నించకుండా దబాయిస్తున్నదెవరు?  యాడ్స్ తో, డబ్బులతో పబ్లిసిటీ చేసుకుంటూ మీడియాను మేనేజ్ చేస్తోందెవరు?’’అంటూ మండిపడ్డారు. బండి సంజయ్ వ్యాఖ్యలు బాధిస్తున్నాయంటూ కేసీఆర్ బిడ్డ చెప్పడంపైనా తనదైన రీతిలో స్పందించారు.  ‘‘నా వ్యాఖ్యలు బాధిస్తే అయ్య కాడికి పోయి ఏడవమను’’ అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ మహిళల కళ్లల్లో నుంచి నిప్పులు కురవాలంటూ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. హైదరాబాద్ సహా రాష్ట్రమంతటా హత్యలు, అత్యాచారాలు, భూకబ్జాలు జరుగుతుంటే మీ కళ్ల నుంచి నిప్పులెందుకు రాలేదని ప్రశ్నించారు. పోడుభూములకు పట్టాలివ్వాలని అడిగిన పాపానికి బాలింతలపై రాక్షసంగా వ్యవహరించి జైలుకు పంపినప్పుడెందుకు నిప్పులు కురవలేదన్నారు. లిక్కర్ కేసులో అరెస్ట్ చేస్తారనే సరికి తెలంగాణ మహిళలంతా నిప్పులు కురిపించాలా?’’అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. 

15న ముగింపు సభ 

 ఈనెల 15న కరీంనగర్ లో జరిగే ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు ప్రజలంతా స్వచ్ఛందంగా తరలి రావాలని బండి సంజయ్ కోరారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ 4 ఏళ్ల క్రితం కొండగట్టు ఘాట్ రోడ్డు వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలను కలిశారు. తమకు సాయం అందలేదంటూ ఆయా కుటుంబాలు బండి సంజయ్ కు వివరించారు. మృతుల కుటుంబాలకు బండి సంజయ్ ధైర్యం చెప్పారు.  అనంతరం మాట్లాడుతూ...4 సంవత్సరాల క్రితం కొండగట్టులో ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగిందని, బస్సులో ప్రయాణిస్తున్న పేద ప్రయాణికులు మరణించారని గుర్తుచేశారు. ఈ ఘటనలో 68 మంది నిరుపేద ప్రయాణికులు మృత్యువాత పడ్డారన్నారు. బస్సు ప్రమాద కుటుంబాలను కేసీఆర్ ప్రభుత్వం కనీసం పరామర్శించలేదు, పట్టించుకోలేదని ఆరోపించారు. పోస్ట్ మార్టం కోసం తీసుకెళ్లాల్సిన మృతదేహాలకు కనీసం కేసీఆర్ సర్కార్ చాపలు కూడా కొని ఇవ్వని పరిస్థితి ఉందన్నారు. హాస్పిటల్ లో క్షతగాత్రులకు డబ్బులు కూడా కట్టలేదని ఆరోపించారు.  
ఈ ప్రమాదంలో ఇప్పటికీ 20 మంది క్షతగాత్రులు వైద్యం తీసుకుంటున్నారన్నారు. ప్రమాద బాధిత కుటుంబాలను నేటికీ కేసీఆర్ ఆదుకోలేదన్నారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget