అన్వేషించండి

Komatireddy Venkat Reddy : కోవర్ట్ రెడ్డిలం కాదు, కల్వకుంట్ల కమిషన్ల గుట్టు విప్పుతా - కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎంపీ హెచ్చరిక !

తనపై విమర్శలు చేసిన కేటీఆర్‌కు కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కల్వకుంట్ల కుటుంబ కమిషన్ల బాగోతాన్ని బయట పెడతానని హెచ్చరించారు.

Komatireddy Venkat Reddy : కోమటిరెడ్డి సోదరులు కోవర్ట్ రెడ్డి బ్రదర్స్ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించడంపై.. ఎంపీ వెంకటరెడ్డి మండిపడ్డారు. కోమటిరెడ్డి అంటే  నిజాయితీకి మారు పేరు అని..  కల్వకుంట్ల కుటుంబం అంటేనే కమీషన్ల కుటుంబం అన్నారు.  కాదనే ధైర్యం ఉందా అని కేటీఆర్‌ను ప్రశ్నించారు.  ‘‘మీ అవినీతి చిట్టా మొత్తం నాకు తెలుసు. నా జోలికి వస్తే మీ చిట్టా విప్పుతా. కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఉద్యమంలో రబ్బరు బుల్లెట్లు తిన్న మేము కోవర్టులమా? తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నావ్‌ కేటీఆర్? ’’ అంటూ ప్రశ్నించారు.  తమ గురించి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు.  

కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా పార్టీ మారుతాడని ఇటీవల జోస్యం చెప్పిన కేటీఆర్ 

ఇటీవల కేటీఆర్ కోమటిరెడ్డి సోదరులను టార్గెట్ చేస్తున్నారు. బీజేపీ తపున రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ లో ఉన్న వెంకటరెడ్డిని కూడా కలిపి కేటీఆర్ రాజకీయ విమర్శలు చేస్తున్నారు. ఇటీవల మీడియా ప్రతినిధులతో చిట్ చాట్‌గా మాట్లాడినప్పుడు కోమటిరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని వీడి పోతారని చెప్పారు. ఈ అంశంపై కోమటిరెడ్డి స్పందించారు. తన గురించి మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు. అయితే  మళ్లీ కోమటిరెడ్డి సోదరను కోవర్ట్ రెడ్డి సోదరులను సంబోధించడంతో మరోసారి కాక రేగినట్లయింది. కాంగ్రెస్ పార్టీలోనే ఉండిబీజేపీ కోసం పని చేస్తారన్న కారణంగా కేటీఆర్ ఈ విమర్శలు చేశారు. 

సొంత పార్టీ నేతలు తిట్టిన బాధతోనే మునుగోడులో ప్రచారానికి పోవడం లేదన్న కోమటిరెడ్డి 

అయితే తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని..  కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబుతున్నారు. మరి మునుగోడుకు ఎందుకు ప్రచారానికి పోవడం లేదన్న అంశంపై మాత్రం ఆయన భిన్నంగా స్పందించారు.  సొంత పార్టీ నేతలు తిట్టిన బాధలోనే నేను ప్రచారానికి వెళ్లడం లేదని  చెబుతున్నారు. ఏ ముఖంపెట్టుకుని మునుగోడ ప్రచారానికి వెళ్లాలని ఆయన ప్రశ్నిస్తున్నారు. తన ఆశీస్సులు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికే ఉంటాయని చెబుతున్నారు. మరో వైపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మునుగోడులో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కాంగ్రెస్ తరపున ప్రచారానికి వస్తారని ఆయన చెబుతున్నారు. 

విదేశీ పర్యటనకు వెళ్లి ..ఎన్నిక పూర్తయిన తర్వాతే తిరిగి రానున్న కోమటిరెడ్డి 

అయితే కోమటిరెడ్డి మాత్రం రెండు రోజుల్లో కుటుంబంతో సహా విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆయన కూడా అంగీకరిస్తున్నారు. కుటుంబంతో వ్యక్తిగత పర్యటనపై ఆస్ట్రేలియాకు వెళ్తున్నానని చెబుతున్నారు. మునుగోడు ఉపఎన్నిక పూర్తయిన తర్వాతనే ఆయన తిరిగి వచ్చే అవకాశం ఉంది. అంటే ఆయన ఉపఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఆయన ప్రచారం చేసే అవకాశం కనిపించడం లేదు.  విదేశీ పర్యటన నా వ్యక్తిగతం, నాపై కేటీఆర్‌ చేసిన కోవర్ట్‌ కామెంట్స్‌ విత్‌ డ్రా చేసుకోవాలని కోమటిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Singapore Tour: సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ తో చంద్రబాబు బృందం భేటీ, విశాఖ పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం
సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ తో చంద్రబాబు బృందం భేటీ, విశాఖ పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం
Bandi Sanjay: కేటీఆర్‌పై సీఎం రమేష్ వ్యాఖ్యలు నిజమే, కేసీఆర్ నిరాకరిస్తే టికెట్ సైతం ఇప్పించాడు: బండి సంజయ్
కేటీఆర్‌పై సీఎం రమేష్ వ్యాఖ్యలు నిజమే, కేసీఆర్ నిరాకరిస్తే టికెట్ సైతం ఇప్పించాడు: బండి సంజయ్
Ind vs Eng 4th Test: ఇంగ్లాండ్ విజయాన్ని అడ్డుకున్న ఆ నలుగురు.. మాంచెస్టర్ టెస్టులో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన టీమిండియా
ఇంగ్లాండ్ విజయాన్ని అడ్డుకున్న ఆ నలుగురు.. మాంచెస్టర్‌లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన టీమిండియా
Naga Vamsi: సింగిల్ స్క్రీన్స్, థియేటర్స్‌ ఇష్యూ: నాగవంశీ సంచలన వ్యాఖ్యలు... ఏషియన్ సునీల్ మీద సెటైర్లు!
సింగిల్ స్క్రీన్స్, థియేటర్స్‌ ఇష్యూ: నాగవంశీ సంచలన వ్యాఖ్యలు... ఏషియన్ సునీల్ మీద సెటైర్లు!
Advertisement

వీడియోలు

Ben Stokes Appeal for Draw Jadeja Denied | సెంచరీలు కొట్టే టైమ్ కి ఇంగ్లండ్ కు డ్రా గుర్తొచ్చింది | ABP Desam
Ben Stokes Rishabh Pant Injuries | సబ్ స్టిట్యూట్స్ ను పెట్టుకోవటంపై బెన్ స్టోక్స్ మండిపాటు | ABP Desam
Eng vs Ind Fourth Test Draw Day 5 Highlights | తెగువ చూపించి మాంచెస్టర్ టెస్ట్ ను డ్రా చేసిన యంగ్ ఇండియా | ABP Desam
Rave Party In Kondapur | కొండాపూర్‌లో రేవ్‌ పార్టీని భగ్నం చేసిన పోలీసులు
Haridwar Mansa Devi Temple Stampede | మన్సా దేవి ఆలయంలో తొక్కిసలాట
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Singapore Tour: సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ తో చంద్రబాబు బృందం భేటీ, విశాఖ పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం
సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ తో చంద్రబాబు బృందం భేటీ, విశాఖ పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం
Bandi Sanjay: కేటీఆర్‌పై సీఎం రమేష్ వ్యాఖ్యలు నిజమే, కేసీఆర్ నిరాకరిస్తే టికెట్ సైతం ఇప్పించాడు: బండి సంజయ్
కేటీఆర్‌పై సీఎం రమేష్ వ్యాఖ్యలు నిజమే, కేసీఆర్ నిరాకరిస్తే టికెట్ సైతం ఇప్పించాడు: బండి సంజయ్
Ind vs Eng 4th Test: ఇంగ్లాండ్ విజయాన్ని అడ్డుకున్న ఆ నలుగురు.. మాంచెస్టర్ టెస్టులో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన టీమిండియా
ఇంగ్లాండ్ విజయాన్ని అడ్డుకున్న ఆ నలుగురు.. మాంచెస్టర్‌లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన టీమిండియా
Naga Vamsi: సింగిల్ స్క్రీన్స్, థియేటర్స్‌ ఇష్యూ: నాగవంశీ సంచలన వ్యాఖ్యలు... ఏషియన్ సునీల్ మీద సెటైర్లు!
సింగిల్ స్క్రీన్స్, థియేటర్స్‌ ఇష్యూ: నాగవంశీ సంచలన వ్యాఖ్యలు... ఏషియన్ సునీల్ మీద సెటైర్లు!
Bank Holidays in August 2025: ఆగస్టులో సెలవుల సందడి, 15 రోజులు బ్యాంకులు బంద్- బ్యాంక్ హాలిడేస్ జాబితా చూశారా
ఆగస్టు నెలలో 15 రోజులు బ్యాంకులు బంద్- సెలవుల లిస్ట్ చూసి ప్లాన్ చేసుకోండి!
Crime News: భర్త హత్యకు భార్య ప్లాన్, అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి - మేడ్చల్‌లో ఘటన
భర్త హత్యకు భార్య ప్లాన్, అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి - మేడ్చల్‌లో ఘటన
Singer Madhu Priya: చెల్లి ఎంగేజ్‌మెంట్‌లో మధుప్రియ... సింగర్ విడాకులు, రెండో పెళ్లిపై నెటిజన్ల ఆరా
చెల్లి ఎంగేజ్‌మెంట్‌లో మధుప్రియ... సింగర్ విడాకులు, రెండో పెళ్లిపై నెటిజన్ల ఆరా
TCS Layoffs: సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు టీసీఎస్ బిగ్ షాక్, 12 వేల మందిని తొలగించాలని నిర్ణయం
సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు టీసీఎస్ బిగ్ షాక్, 12 వేల మందిని తొలగించాలని నిర్ణయం
Embed widget