అన్వేషించండి

KLH University: కేఎల్‌హెచ్ యూనివర్శిటీ రికార్డు - జాతీయ స్థాయిలో 22వ ర్యాంక్

Hyderabad News: కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో కేఎల్‌హెచ్ డీమ్డ్ వర్శిటీ 22వ ర్యాంకు కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. దీనిపై వర్శిటీ వీసీ పార్థసారధి హర్షం వ్యక్తం చేశారు.

KLH University Ranked 22nd In NIRF: కేఎల్‌హెచ్ యూనివర్శిటీ (KLH University) రికార్డు సృష్టించింది. దేశంలోని అత్యుత్తమ ప్రమాణాలు పాటించే విద్యా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ఎన్ఐఆర్‌ఎఫ్ (NIRF) ర్యాంకింగ్స్‌లో 22వ ర్యాంకు సాధించింది. ఈ విషయాన్ని కేఎల్ డీమ్డ్ వర్శిటీ ఉపకులపతి డాక్టర్ పార్థసారధి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అద్భుతమైన విజయం సాధించడం గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.

'నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ - 2024లో తమ హైదరాబాద్ క్యాంపస్ అత్యుత్తమ పని తీరు కనబరిచినందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ ర్యాంకు ప్రకటించింది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలను కలిపి ప్రకటించిన ర్యాంకుల్లో కేఎల్‌హెచ్ యూనివర్శిటీ 22వ ర్యాంకు కైవసం చేసుకుంది. ఈ ఘనత దేశంలో విశ్వ విద్యాలయాలు, అకడమిక్ ఎక్స్ లెన్స్, ఇన్నోవేషన్ పట్ల మా నిబద్ధతను పునరుద్ఘాటించింది. దేశవ్యాప్తంగా అన్ని వర్శిటీలు, ఇంజినీరింగ్ కళాశాలలు, ఐఐటీలు, ఎన్ఐటీలు మొత్తం కలిపి 6,517 ఉన్నత విద్యా సంస్థలు పోటీ పడ్డాయి. ఇందులో మా యూనివర్శిటీకి 22వ ర్యాంకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ విజయాలు కేఎల్‌హెచ్ వర్శిటీ సమగ్ర విద్యా విధానాన్ని స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ మొత్తం మీద మా క్యాంపస్ అత్యుత్తమ ర్యాంక్ దక్కించుకోవడం గర్వకారణం.' అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కేఎల్‌హెచ్ హైదరాబాద్ క్యాంపస్ ప్రిన్సిపాల్ రామకృష్ణ, వర్శిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ జె.శ్రీనివాసరావు పాల్గొన్నారు. అటు, అజీజ్ నగర్, బోరంపేట, కొండాపూర్ క్యాంపస్‌ల్లో అత్యాధునిక కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రిన్సిపాల్ రామకృష్ణ తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని కోర్సులు అందుబాటులోకి తెస్తామన్నారు. 

Also Read: Warangal News: వాగు మధ్యలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు - రాత్రంతా బస్సులోనే ప్రయాణికులు, చివరకు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
US Fed Rates Cut: అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
Bhogapuram Airport : వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Embed widget