Breaking News Live: ఆదివారం కడప, విశాఖపట్నం జిల్లాల పర్యటనకు ఏపీ సీఎం జగన్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Background
అండమాన్‌కు సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండదు. ఇది బలహీనపడుతూ బర్మా వైపు కదులుతోంది. మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం పొడిగా ఉంటుంది.పొడి గాలులు కారణంగా మూడు రోజుల పాటు పగటి పూట వేడిని పెంచేస్తాయి. రాత్రి పూట చలిపెట్టిస్తాయి. 21న జరగబోయే రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూకు వాతావరణ ప్రభావం ఉండబోదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఉత్తర, దక్షిణ కోస్తా, యానాం, రాయలసీమలో వాతావరణంలో పెద్ద తేడా ఉండదని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణలో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం కాసేపు పొగమంచు పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణగ్రత 31డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 19 డిగ్రీలు ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ దిశ ఉపరితల గాలులు గంటకు ఎనిమిది నుంచి పది కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉంది.
కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం పడొచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉంది. ఇవాళ రేపు చిరుజల్లులు పడొచ్చు. ఎల్లుండి నుంచి రెండు రోజులు వాతావరణం పొడిగానే ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రత నల్లగొండలో 33 డిగ్రీలు నమోదు కానుంది. అతి తక్కువ ఉష్ణోగ్రత అక్కడే నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతవరణ శాఖ ప్రకటించింది.
బంగారం వెండి ధరలు
ఇవాళ కూడా బంగారం ధర బాగా తగ్గింది. గ్రాముకు 40 రూపాయల చొప్పున తగ్గింది. వెండి ధర మాత్రం గ్రాముకు రూ.0.20 పైసలు పెరిగి.. 68 రూపాయలకు చేరింది. ఇప్పుడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర 4,580 రూపాయలు ఉంది. అంటే పది గ్రాముల బంగారం 45,800అన్నమాట. నిన్న 46, 200 ఉన్న బంగారం ఇవాళ నాలుగు వందలు తగ్గింది. అదే 24 క్యారెట్ల బంగారం గ్రామ్‌పై 43 రూపాయలు తగ్గింది. అంటే పది గ్రాముల ధర 49, 970 రూపాయలు ఉంది. నిన్న ఇదే 24 క్యారెట్ల బంగారం ధర 50, 400 రూపాయలు ఉంది. ఇప్పుడు వెండి కిలో 68 వేలు ఉంది. ఇదే కిలో వెండి నిన్న 67వేల 800 ఉంది. రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న వెండి ఒక్కసారిగా పెరిగింది.
పెట్రోల్, డీజిల్ ధరలు
హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత నెల రోజులకు పైగా నిలకడగానే ఉంటున్నాయి. నేడు కూడా పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే కొనసాగుతోంది. ఇక వరంగల్‌లోనూ గత వారం రోజుల తర్వాత నేడు ధరలు నిలకడగా ఉన్నాయి. నేడు (ఫిబ్రవరి 18) పెట్రోల్ ధర రూ.107.69 గా ఉంది. డీజిల్ ధర రూ.94.14 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
నిజామాబాద్‌లో ఇంధన ధరలు నేడు కాస్త పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు నేడు రూ.0.35 పైసలు పెరిగి రూ.110.09 గా ఉంది. డీజిల్ ధర రూ.0.33 పైసలు పెరిగి రూ.96.38 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తుండగా తాజాగా పెరిగాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం స్థిరంగా ఉంది. ముందు రోజు తరహాలోనే రూ.110.51గా ఉంది. డీజిల్ ధర కూడా బెజవాడలో రూ.96.59 గా నిలకడగానే ఉంది.
ఆదివారం కడప, విశాఖపట్నం జిల్లాల పర్యటనకు ఏపీ సీఎం జగన్
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదివారం కడప, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్నారు.
ఆదివారం ఉదయం 11 గంటలకు కడప చేరుకోనున్న సీఎం జగన్..
పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించనున్నారు.
ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కుమార్తె వివాహ వేడుకలో పాల్గొంటారు
అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
అదే రోజు సాయంత్రం 4.45 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు సీఎం చేరుకుంటారు.
నేవల్ ఎయిర్‌స్టేషన్, ఐఎన్‌ఎస్ డేగా వద్ద.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు స్వాగతం పలుకుతారు.
ఆ తర్వాత రాత్రి 7 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ చేరుకుంటారు
Himachal Pradesh CM: ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్
హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. రొటీన్ హెల్త్ చెకప్ కోసం ఆసుపత్రిలో చేరినట్లు అధికారిక వర్గాల సమాచారం.





















