అన్వేషించండి

Kavitha Lawyer : నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఈడీ - అందుకే విచారణకు కవిత గైర్హాజర్ - తేల్చిచెప్పిన లాయర్ !

ఈడీ నిబంధనలు పాటించనందునే విచారణకు కవిత హాజరు కావడం లేదని ఆమె తరపు లాయర్ భరత్ ప్రకటించారు.


Kavitha Lawyer :  ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ ఎదుట హాజరు కావాల్సి  ఉన్న కవిత ఇవాళ హాజరు కాబోరని ఆమె తరపు లాయర్ సోమా భరత్ స్పష్టం చేశారు. కవిత  ఈడీ అధికారులకు రాసిన లేఖను ఈడీ కార్యాలంయలో  ఇచ్చిన తర్వాత ఆయన మడియాతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కవిత  గురువారం ఈడీ విచారణకు హాజరు  కాబోవడం లేదని ఆయన ప్రకటించారు.   కవితపై కేంద్రం కక్షగట్టి తప్పుడు కేసులు పెట్టించి ..  ఇబ్బంది పెట్టాలని చూస్తోందని కవిత తరపు లాయర్ భరత్ ఆరోపించారు.  మహిళల్ని ఇంటి దగ్గరే విచారించాలన్న నిబంధన పాటించడం లేదు కాబట్టే హాజరు కావడం లేదన్నారు. అనారోగ్యం కారణంగా హాజరు కావడం లేదని జరుగుతున్న ప్రచారం కరెక్ట్ కాదని కవిత లాయర్ స్పష్టం చేశారు. ఈడీకి కొన్ని డాక్యుమెంట్లను కూడా ఇచ్చామన్నారు. 
                           
Kavitha Lawyer : నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఈడీ - అందుకే విచారణకు కవిత గైర్హాజర్ - తేల్చిచెప్పిన లాయర్ !

 

ఈడీకి లాయర్ ద్వారా కవిత పంపిన లేఖలో ప్రధానంగా ఐదు అంశాలను ప్రస్తావించారు. తన ప్రాథమిక  హక్కుల ఉల్లంఘన జరుగుతోందని.. సుప్రీం కోర్టులో విచారణ తర్వాతే ఈడీ ఎదుట హాజరవుతానని లేఖలో తెలిపారు. తన ఫోన్ సీజ్ చేసినట్లుగా సమన్లలో ప్రస్తావించలేదన్నారు. వ్యక్తిగతంగా హాజరు కావాలని కూడా సమన్లలో లేదని.. అందుకే లాయర్‌తో డాక్యుమెంట్లను పంపానని  లేఖలో కవిత పేర్కొన్నారు. ఇవే విషయాలను మీడియాకు వెల్లడించిన కవిత లాయర్ భరత్.. సుప్రీంకోర్టు విచారణ తర్వాతనే విచారణకు సహకరిస్తామన్నారు. 


Kavitha Lawyer : నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఈడీ - అందుకే విచారణకు కవిత గైర్హాజర్ - తేల్చిచెప్పిన లాయర్ !


మహిళా రిజర్వేషన్లపై ఢిల్లీలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం కోసం కవిత రెండు రోజుల కిందటే ఢిల్లీకి వచ్చారు. ఈ కారణంగా గురువారం ఆమె ఈడీ విచారణకు హాజరవుతారని అనుకున్నారు.  ఉదయం పదకొండు గంటలకు ఆమె హాజరు కావాల్సి  ఉంది. ఆ సమయంలో మీడియా సమావేశం ఉంటుందని  సమాచారం ఇచ్చారు. అందుకే ఆలస్యంగా  వెళ్తారని అనుకున్నారు  అయితే మీడియా సమావేశం పెట్టలేదు. కానీ పదకొండు గంటలకు కవిత లాయర్ ఓ లేఖను తీసుకుని ఈడీ కార్యాలయానికి వెళ్లారు.    Kavitha Lawyer : నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఈడీ - అందుకే విచారణకు కవిత గైర్హాజర్ - తేల్చిచెప్పిన లాయర్ !


ఈడీ చట్టాలను ఉల్లంఘిస్తోందని ఇంటి దగ్గరే ప్రశ్నించాలనే నిబంధనలు ఉన్నా పట్టించుకోవడం లేదని.. ఆరోపిస్తూ కవిత సుప్రీంకోర్టులో  బుధవారం పటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణను 24వ తేదీన చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది.   కవిత విచారణకు సహకరించడం లేదన్న అభిప్రాయానికి ఈడీ వస్తే ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తాజా పరిణామాల ద్వారా అంచనా వేస్తున్నారు. విచారణకు  హాజరైన తర్వాత అయినా ఆమెను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే .. ఈడీ విచారణ కోసం ఢిల్లీకి వచ్చి..ఢిల్లీలోనే ఉన్న కవిత చివరి క్షణంలో   హాజరు కావడానికి వెనుకడుగు వేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈడీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది కీలకంగా మారింది.               Kavitha Lawyer : నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఈడీ - అందుకే విచారణకు కవిత గైర్హాజర్ - తేల్చిచెప్పిన లాయర్ !

టాప్ హెడ్ లైన్స్

Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Telangana Cabinet Decisions: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget