News
News
X

Kavitha: 8 గంటల పాటు కవితను ప్రశ్నించిన ఈడీ - 16వ తేదీన మరోసారి విచారణకు హాజరు !

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను దాదాపుగా 8 గంటలు ప్రశ్నించిన తర్వాత వదిలి పెట్టారు. పదహారో తేదీన హాజరు కావాలని మరోసారి నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

FOLLOW US: 
Share:

Kavitha: కవితను అరెస్ట్ చేస్తారంటూ ఉదయం నుంచి ఏర్పడిన ఓ టెన్షన్ వాతావరణానికి రాత్రి ఎనిమిది గంటల సమయంలో ముగింపు లభించింది. ఎనిమిది గంటల విచారణ తర్వాత కవితను వదిలేశారు. దాంతో ఆమె ఢిల్లీలోని ఇంటికి వెళ్లిపోయారు. మళ్లీ  16వ తేదీన రావాలని నోటీసులు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఉదయం పదకొండు గంటల సమయంలో ఈడీ ఆఫీసులోకి వెళ్లిన కవితను ఐదుగురు అధికారుల బృందం ప్రశ్నించింది .  రామచంద్ర పిళ్లై, కవితను ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నలు అడిగారని..అలాగే ఇతర నిందితులు చెప్పిన విషయాల బట్టి కూడా ప్రశ్నించారని చెబుతున్నారు.   

విచారణ మధ్యలో కవిత ఫోన్ సీజ్ చేసిన ఈడీ అధికారులు

విచారణ మధ్యలో  కవిత ఫోన్ ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం విచారణకు వచ్చేటప్పుడు కవిత పోన్ తెచ్చుకోలేదు. ఢిల్లీలోని నివాసంలోనే ఫోన్ ఉంచి వచ్చారు. అయితే విచారణలో ఫోన్ గురించి ఈడీ అధికారులు వాకబు చేశారు. తన వద్ద లేదని చెప్పడంతో వెంటనే తెప్పించాలని ఆదేశించారు. ఈడీ కార్యాలయం బయట ఎదురు చూస్తున్న కవిత డ్రైవర్‌కు సమాచారం పంపి.. ఆయనను నివాసానికి వెళ్లి ఫోన్ తీసుకు రావాలని పురమాయించారు. మధ్యాహ్నం సమయంలో కవిత డ్రైవర్ ఫోన్ తీసుకుని ఈడీ కార్యాలయానికి వచ్చి అధికారులకు ఇచ్చారు. ఆ ఫోన్ ను ఈడీ అధికారులు సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. 

అరెస్ట్ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న బీఆర్ఎస్ శ్రేణులు
 
కవితను అరెస్ట్ చేస్తారని బీఆర్ఎస్ నేతలు పెద్ద  ఎత్తున మోహరించారు. అరెస్ట్ చేస్తే ఆందోళనలు చేయడానికి సిద్ధమయ్యారు. ఢిల్లీ, తెలంగాణల్లో ధర్నాలు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.  ఢిల్లీలో ఈడీ ఆఫీసు వద్ద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు మోహరించారు.  కవితకు సంఘిభావంగా ... న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపేందుకు కేటీఆర్, హరీష్ రావు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఇతర సీనియర్ నేతలు.. బీఆర్ఎస్ న్యాయనిపుణులు కూడా ఢిల్లీలోనే మకాం వేశారు. అరెస్ట్ చేయకపోవడతో ఊపిరి పీల్చుకున్నారు. 

  రామచంద్రపిళ్లై వాంగ్మూాలంతోనే అసలు చిక్కులు ! 

ఢిల్లీ లిక్కర్   స్కాంలో ప్రమేయం ఉందని ప్రచారం జరుగుతున్న నిందితులందర్నీ దాదాపుగా అరెస్ట్ చేెశారు.  ఇప్పటికే స్కాం జరిగినప్పుడు ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియాతో పాటు శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, అభిషేక్ బోయినపల్లి సలహా పలువురు మద్యం వ్యాపారులు, ఆప్ సన్నిహితుల్ని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో రామచంద్ర పిళ్లై తాను కవిత బినామీని అని వాంగ్మూలం ఇవ్వడంతో  ... కవితకు చిక్కులు ఏర్పడ్డాయి. ఈ వాంగ్మూలం ఆధారంగానే ఈడీ కవితను ప్రశ్నించారు.   అయితే ఈ వాంగ్మూలాన్ని తాను వెనక్కి తీసుకుంటానని  పిళ్లై ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉంది. 

లిక్కర్ స్కాంలో కవితపై ప్రధాన ఆరోపణలు ఏమిటంటే ? 

ఢిల్లీలో లిక్కర్ పాలసీని మార్చి..  అక్రమాలకు చేసిన అవినీతి చేసిన కేసులో సౌత్ గ్రూప్ నుంచి కవిత ప్రధాన పాత్ర పోషించారని ఈడీ చెబుతోంది.  సౌత్ గ్రూప్ లో రామచంద్ర పిళ్లై, సమీర్ మహీంద్రూ, మాగుంట శ్రీనివాస్ రెడ్డికి 65 శాతం పార్టనర్ షిప్ ఉన్నట్లు పేర్కొంది. మనీశ్ సిసోడియా తరపున విజయ నాయర్ పని చేస్తున్నారన్న ఈడీ ఇండో స్పిరిట్ కు కవిత ప్రతినిధిగా అరుణ్ పిళ్లై ఉన్నారని తెలిపింది. సౌత్ గ్రూప్ ప్రతినిధిగా ఉన్న బుచ్చిబాబు ఫిబ్రవరి 28వ తేదీన ఇచ్చిన స్టేట్ మెంట్ లో హవాలా మార్గంలో వంద కోట్లు చెల్లించినట్లు చెప్పినట్లు ఈడీ పేర్కొంది.ఢిల్లీ లిక్కర్ పాలసీ రూప కల్పనలో ఢిల్లీ సీఎం అరవింత్ కేజ్రీవాల్, కవిత మధ్య రాజకీయ అవగాహన కుదిరిందని ఈడీ పేర్కొంది. 2021 మార్చి 19, 20 తేదీల్లో కవితను విజయ నాయర్ కలిశారని, న్యూఢిల్లీలోని గౌరి అపార్ట్ మెంట్ లో జరిగిన సమావేశం తర్వాత అరుణ్ అభిషేక్ 2021 జూన్ లో హైదరాబాద్ లో ఐటీసీ కోహినూరులో విజయ్ నాయర్ దినేశ్ అరోరాతో సమావేశం అయ్యారని  ఈడీ పేర్కొంది. 

Published at : 11 Mar 2023 08:29 PM (IST) Tags: Delhi Liquor Scam Kavitha Arrested ED Arrested Kavitha

సంబంధిత కథనాలు

జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు

Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు

Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు

Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు

Bandi Sanjay : సిట్ కేసీఆర్ జేబు సంస్థ, కేటీఆర్ కు నోటీసులిచ్చే దమ్ముందా? - బండి సంజయ్

Bandi Sanjay : సిట్ కేసీఆర్ జేబు సంస్థ, కేటీఆర్ కు నోటీసులిచ్చే దమ్ముందా? - బండి సంజయ్

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు - తీహార్ జైలుకు రామచంద్ర పిళ్లై తరలింపు! 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు - తీహార్ జైలుకు రామచంద్ర పిళ్లై తరలింపు! 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్