News
News
X

బెజ్జూర్‌ మండలంలో హడలెత్తిస్తున్న పెద్దపులి- మళ్ళీ పశువులపై దాడి!

కుమ్రం భీం జిల్లాలో 4 రోజులుగా పెద్దపులి సంచారం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. బెజ్జూరు, దహెగాం, పెంచికల్ పేట్, కాగజ్‌నగర్‌, సిర్పూరు(టి), చింతలమానేపల్లి, వాంకిడిలో పులుల అనవాళ్లను నిర్ధారించారు.

FOLLOW US: 

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్జూర్‌ మండలంలోని మారుమూల గ్రామాల్లో పెద్దపులి సంచరిస్తూ హడలెత్తిస్తోంది. కాగజ్‌నగర్‌, సిర్పూర్ (టి) ప్రాంతాల్లో ఇది వరకు కనిపించిన పులి.. ఇప్పుడు బెజ్జూర్‌ మండలంలోని మారుమూల గ్రామాల్లో సంచరిస్తూ పశువులపై దాడి చేస్తోంది. నిన్న రాత్రి బెజ్జూర్‌ మండలం కుకూడ గ్రామంలో కొట్టంలో కట్టెసిన ఎద్దుపై పులిదాడి చేసింది. పశువుల అరుపులు విన్న గ్రామస్తులు బయటకు వచ్చి కేకలు వేయడంతో పులి సమీప అడవిలోకి వెళ్ళిపోయింది. దీంతో ఆ ఎద్దు ప్రాణాలతో బయటపడింది. తాజాగా మళ్ళీ ఈరోజు సోమవారం బెజ్జూర్‌ మండలంలోని మర్తిడి గ్రామంలో మొండికుంట వద్ద నిద్రిస్తున్న పులిని మీసాల రాజు అనే రైతు చూసాడు. పులి చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి అక్కడ నుండి పరుగులు తీసి గ్రామానికి చేరుకున్నాడు. వెంటనే పులి సమాచారాన్ని అటవి శాఖ అధికారులకు అందించారు.

కుమ్రం భీం జిల్లాలో గత నాలుగు రోజులుగా పెద్దపులి సంచారం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. బెజ్జూరు, దహెగాం, పెంచికల్ పేట్, కాగజ్‌నగర్‌, సిర్పూరు(టి), చింతలమానేపల్లి, వాంకిడి అటవీ ప్రాంతాల్లో పులుల అన వాళ్లను అధికారులు నిర్ధారించారు. ఇప్పటికే ఒక రైతు బెబ్బులి దాడిలో చనిపోగా.. పదుల సంఖ్యలో పశువులు హతమయ్యాయి. దీంతో పశువులను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లడానికి కాపర్లు, పత్తి చేన్లకు వెళ్లడానికి రైతులు జంకు తున్నారు. కుమ్రం భీం జిల్లాలో 12 నుంచి 15 పులులు సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. అటవీ సమీప గ్రామాలైన వాంకిడి మండలంలోని ఖానాపూర్, సవ్వాతి, దాబా, అంతాపూర్, గడమర, వెలిగి, లక్ష్మిపూర్, పెంచికల్పేట్ మండలంలోని కొండపల్లి, లోడ్ పల్లి, అగర్ గూడ, కమ్మర్ గావ్, నందిగాం, గుండపల్లి, జిల్లెడ, మొర్లగూడ, బెజ్జూర్‌ మండలంలోని సులుగుపల్లి, పెద్దసిద్దాపూర్, తలాయి, తిక్కపల్లి, రెబ్బెన, కొత్తగూడ, దహెగాం మండలంలోని దిగిడ, రాంపూర్, మొట్లగూడ తదితర గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వాంకిడి మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన సిడాం భీము అనే రైతును హతమార్చిన పులి.. కాగజ్‌నగర్‌ డివిజన్ లోని అటవీ ప్రాంతంలో సంచరిస్తుంది ఒకటేనని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పాదముద్రలు ఒకే పరిమాణంలో ఉండటంతో ఆ పులి ఇటుపై వచ్చిందని భావిస్తున్నారు.

గత గురువారం రాత్రి కాగజ్‌నగర్‌ పట్టణంలోని వినయ్ గార్డెన్స్ సమీపంలో పులి రోడ్డు దాటుతుండగా  ఓ ట్రాలీ డ్రైవర్ చూశాడు. శుక్రవారం వంజీరి బెంగాలీ క్యాంపు ఏరియాలోని పంట చేన్లలో పులి సంచరించింది. శనివారం అనుకోడ పంట పొలాల్లో పులి అడుగులు కనిపించాయి. అదేవిధంగా భూపాలపట్నం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో గొర్రెల పై దాడి చేసింది. మళ్ళీ ఆదివారం బెజ్జూర్‌ మండలం కొత్తగూడ, రెబ్బెన, చింతలమానేపల్లి మండలం బాబాసాగర్ పంటపొలాల్లో పెద్దపులి పాదముద్రలను గుర్తించారు. అక్కడ రైతును హతమార్చిన పులి ఈ ప్రాంతంలో ఆవాసం కోసం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆ పులి సుమారు 120 కిలో మీటర్లకు పైగా ప్రయాణం చేసినట్లు అంచనా వేస్తున్నారు. చింతలమానెపల్లి మండలంలోని అడేపెళ్లి, డబ్బా, బాబాసాగర్ గ్రామాల శివారులో పులి సంచరిస్తుందని ఆదివారం పలువురు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని గ్రామాల సర్పంచులకు విషయం తెలిపి గ్రామాల్లో డప్పు చాటింపు, మైకుల ద్వారా జాగ్రత్తపడాలని తెలియజేశారు. బాబాసాగర్ గ్రామ శివారుల్లోని నీటికుంట వద్ద పులి అడుగులను గుర్తించారు. బాబాసాగర్ శివారులోని పత్తి చేన్లలో పత్తి ఏరుతున్న రైతులను అధికారులు ఇళ్లకు పంపించారు. చాలా గ్రామాల్లో పనులకు వెళ్లిన కూలీలు మధ్యాహ్నమే ఇళ్లకు చేరారు. బెజ్జూరు మండలంలోని కొత్తగూడ వాటర్ ట్యాంక్ సమీపంలో ఆదివారం పులి అడుగులు కనిపించాయి. విషయాన్ని గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆటవీశాఖ అధికారులు కొత్తగూడ, రెబ్బెన, బాబాసాగర్ గ్రామాల సరిహద్దులోని పంట చేన్లల్లో పరిశీలించారు. బెజ్జూరు మండలం కొత్తగూడ గ్రామ సమీపంలో చెరువులో నీళ్లు తాగుతున్న పెద్దపులిని గ్రామస్తులు గమనించారు. దీంతో అటవీ శాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం అందించారు. పులిపాద ముద్రలను సేకరించి పులి జాడ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. 

తాజాగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం కుకూడా గ్రామంలో ఎద్దులపై పెద్దపులి దాడి ఘటన చోటుచేసుకుంది. ఆదివారం కొట్టంలో కట్టేసి ఉన్న ఎద్దులపై రాత్రి పెద్దపులి దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. ఎద్దుల అరుపులు విన్న గ్రామస్తులు గట్టిగా కేకలు వేయడంతో పులి పారిపోయినట్టు స్థానిక రైతులు చెబుతున్నారు. పెద్దపులి సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజా మళ్ళీ ఈ రోజు సోమవారం ఉదయం కుమ్రం భీం జిల్లా బెజ్జూరు మండలంలోని మర్తిడి గ్రామ సమీపంలోని చొప్పదండి మొండికుంట వద్ద రైతు మీసాల రాజన్నకు పులి కనిపించింది. కుంట వద్ద పులి పడుకొని ఉండగా చూసి పరుగులు పెడుతూ ఇంటికి వచ్చినట్లు ఆయన తెలిపారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవి శాఖ అధికారులు గస్తి కాస్తున్నారు. సమీప గ్రామాల ప్రజలు బయటకు వెళ్ళొద్దని రైతులు చేలలోకి వెళ్ళొద్దని సూచిస్తున్నారు.

News Reels

Published at : 21 Nov 2022 12:22 PM (IST) Tags: Tiger News Kumram Bheem District cattle

సంబంధిత కథనాలు

బక్క పలుచని వీరుడు బందూకై తన జాతిని మేలు కొలిపిన రోజు: కేటీఆర్‌

బక్క పలుచని వీరుడు బందూకై తన జాతిని మేలు కొలిపిన రోజు: కేటీఆర్‌

Gold-Silver Price 29 November 2022: 53వేల రూపాయల కంటే దిగువకు బంగారం- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే!

Gold-Silver Price 29 November 2022:  53వేల రూపాయల కంటే దిగువకు బంగారం- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే!

TS News Developments Today: బైంసాలో బీజేపీ బహిరంగసభ నేడు, హాజరుకానున్న కేంద్రమంత్రి

TS News Developments Today: బైంసాలో బీజేపీ బహిరంగసభ నేడు, హాజరుకానున్న కేంద్రమంత్రి

Petrol-Diesel Price, 29 November 2022: డీజిల్‌ కొట్టించాలంటే మాత్రం ఈ జిల్లాల్లో బెటర్!

Petrol-Diesel Price, 29 November 2022: డీజిల్‌ కొట్టించాలంటే మాత్రం ఈ జిల్లాల్లో బెటర్!

వైఎస్ షర్మిల అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది?

వైఎస్ షర్మిల అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది?

టాప్ స్టోరీస్

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Sajjala On Viveka Case : వివేకా హత్య కేసులో నిజాలు తెలియాలి, తెలంగాణలో విచారణ జరిగితే మంచిదే- సజ్జల

Sajjala On Viveka Case : వివేకా హత్య కేసులో నిజాలు తెలియాలి, తెలంగాణలో విచారణ జరిగితే మంచిదే- సజ్జల

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

Kashmir Files: ‘కశ్మీరీ ఫైల్స్’ ప్రచారం కోసం తీసుకున్న అసభ్యకర చిత్రం - మంటలు రేపుతున్న ఇఫీ అధ్యక్షుడి కామెంట్స్

Kashmir Files: ‘కశ్మీరీ ఫైల్స్’ ప్రచారం కోసం తీసుకున్న అసభ్యకర చిత్రం - మంటలు రేపుతున్న ఇఫీ అధ్యక్షుడి కామెంట్స్