Ponnam Prabhakar on KCR: సీఎం కేసీఆర్ జగిత్యాల పర్యటనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు రెడీ !
Ponnam Prabhakar on KCR: రేపు సీఎం కేసీఆర్ జగిత్యాల పర్యటనను అడ్డుకుంటామని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఇందుకు సహకరించాలని కోరారు.
Ponnam Prabhakar on KCR: సీఎం కేసీఆర్ జగిత్యాల పర్యటనను అడ్డుకుంటామని కరీంనగర్ మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత పొన్న ప్రభాకర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జీ శ్రీనివాస్ నివాసంలో మీడియాతో మాట్లాడారు. జగిత్యాల జిల్లాలో వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లోని గ్రామాలు ఇప్పటి వరకూ అభివృద్ధి చెందలేవని అన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా చేయలేదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం కేసీఆర్ పర్యటనను అడ్డుకోవాలని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జీ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు 100 కోట్ల కుంభకోణం గురించి మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. అధికారంలో ఉండి కూడా 100 కోట్ల కుంభకోణంపై చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలన్నారు. కలెక్టర్ తో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
బరాబర్ రేపటి సభకు పోయి నిరసన తెలుపుతం..
"వేములవాడలో శాసన సభ్యుడి వైఫల్యం వల్లే రోడ్డన్నీ అధ్వాన్నంగా మారాయి. రేపు సీఎం కేసీఆర్ జగిత్యాల జిల్లాకు వస్తా ఉన్నరు. ముఖ్యమంత్రి గారు మేమడుగుతున్నవి సొంత డిమాండ్లు కావు. మీరు వేములవాడకు 100 కోట్లు ఇస్తా అన్నారు. దానికి సంబంధించి అడుగుతా ఉన్నాం. కలిగొండ సూరమ్మ ప్రాజెక్టుకు 2018 శంకుస్థాపన చేసి ఇప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టలేదు. ఏడాది కాలంగా దీని గురించి అడుగుతా ఉన్నాం. అయినా ఎలాంటి స్పందన లేదు. ఉమ్మడి కరీంనగల్ జిల్లాలోని ప్రజలంతా రేపటి ముఖ్యమంత్రి సభకు పోతాం ఉన్నాం. పోలీసులు అరెస్ట్ చేసే కాడికి అరెస్ట్ చేస్తరు. తప్పిచ్చుకునేటోల్లు తప్పిచ్చుకోర్రి. బరాబర్ రేపుటి సభకు పోయి నిరసన తెలుపుతం. మేమేమీ కొత్త డిమాండ్లు కోరుతలేం. అన్నీ పాత సమస్యలే. వాటన్నిటినీ పరిష్కరించాలే." - పొన్నం ప్రభాకర్, కరీంనగర్ మాజీ ఎంపీ
వేములవాడం 100 కోట్ల కుంభకోణంపై స్పందించాలి..
"వేములవాడ 100 కోట్ల కుంభకోణంపై జిల్లా కలెక్టర్ స్పందించి సిట్ ని పిలిచి దర్యాప్తు చేయించాలి. ఎమ్మెల్యే రమష్ బాబు మాట్లాడిన మాటలన్నీ ఉన్నయ్. దీన్ని సూమోటోగా తీసుకొని విచారించాలి. సిట్టును పిలిపిస్తవా మీ ముఖ్యమంత్రితో మాట్లాడి లేదా సిట్టింగ్ జడ్డితో మాట్లాడి విచారణ జరిపిస్తవా లేకపోతే సీబీఐకి అప్పజెప్తవా నీ ఇష్టం. కానీ వంద కోట్ల కుంభకోణం మాత్రం బయటకు తీసుకురావాలి. ఆ భూక్జాదారులను బయటకు తీసుకురావాల్సిందే. ఆ భూములను పేదలకు అప్పగించాల్సిందే." ఆది శ్రీనివాస్
జగిత్యాలకు రానున్న సీఎం కేసీఆర్..
జగిత్యాలలో సీఎం కేసీఆర్ పర్యటన ఖరారు అయింది. డిసెంబర్ 7వ తేదీన సీఎం కేసీఆర్ జగిత్యాల్ కు రాబోతున్నారు. ఉదయం 11 గటలకు హెలికాప్టర్ ద్వారా జగిత్యాల చేరుకునే అవకాశం ఉంది. మొదట జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మొదట 110 కోట్లతో ఏర్పాటు కానున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం నూతన కలెక్టరేట్ ను ప్రారంభించనున్నారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో నూతన కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ప్రత్యేక బస్సు ద్వారా రోడ్డు మార్గాన బహిరంగ సభకు చేరుకోనున్నారు. అనంతరం మోతె రోడ్ లో ఏర్పాటు చేసిన బహిరగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.