అన్వేషించండి

Sircilla Textile Park: మేడే రోజునే పరిశ్రమలు మూసివేసి నిరసన - మంత్రి కేటీఆర్ ఎంట్రీతో సిరిసిల్లలో మారిన సీన్

Telangana IT Minister KTR: మేడే రోజునే తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరవధిక బంద్‌ను సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్క్‌లోని పరిశ్రమల యజమానులు విరమించారు. మంత్రి కేటీఆర్ జోక్యంతోనే సీన్ రివర్స్ అయింది.

Sircilla Textile Park To Reopen: కరీంనగర్ / రాజన్న సిరిసిల్ల: కార్మికులు ఒక్క నిర్ణయం తీసుకుని నిరసనకు దిగారంటే తాము తలుచుకున్నది సాధించే వరకు విశ్రమించరు. ఎందుకంటే వారి డిమాండ్లు చాలా వరకు తమ హక్కులు, సమస్యలకు పరిష్కారం కోసమే ఉంటాయి. తాజాగా మేడే రోజునే పరిశ్రమలు మూసివేసి టెక్స్‌టైల్ పార్క్ యాజమానులు సమ్మెకు దిగారు. చర్చలు జరిపిన ప్రభుత్వం వారి డిమాండ్‌కు అంగీకరించింది. సమ్మె విరమించి పరిశ్రమలు రీ ఓపెన్ చేయాలని టెక్స్‌టైల్ యజమానులు నిర్ణయించుకున్నారు.

మే డే రోజున డిమాండ్ల సాధనకు నిరసన  
ఏకంగా మేడే రోజునే తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరవధిక బంద్‌ను సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్క్‌లోని పరిశ్రమల యజమానులు విరమించారు. అధికారులు  స్పష్టమైన హామీ ఇవ్వడంతో సమ్మెను విరమిస్తున్నట్లు యజమానులు ప్రకటించారు. అయితే మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగడం (Telangana IT Minister KTR)తో సీన్ రివర్స్ అయింది. విద్యుత్ రాయితీలు విడుదల చేయడం, మరిన్ని డిమాండ్లను నెరవేర్చుతామని ప్రకటన చేయడంతో ఈ మేరకు సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్క్‌ ఎదుట సోమవారం సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. 

విద్యుత్ రాయితీలపై ప్రభుత్వం హామీ 
డిమాండ్ల సాధన కోసం సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్క్‌లోని పరిశ్రమల యజమానులు ఆదివారం కార్మిక దినోత్సవం (International Workers' Day) రోజున బంద్‌ పాటించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై మంత్రి కేటీఆర్‌ వెంటనే స్పందించారు. టెక్స్‌టైల్‌ పార్క్‌లో మంత్రి వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్‌, చేనేత జౌళిశాఖ రీజినల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ అశోక్‌రావు, ఏడీ సాగర్‌, సెస్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌ తదితరులు టెక్స్‌టైల్‌ పార్క్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అన్నల్‌దాస్‌ అనిల్‌, కమిటీ సభ్యులతో సమావేశమై చర్చలు జరిపారు. 2015 ఏడాది నుంచి 2020 వరకు పార్క్‌కు రావాల్సిన విద్యుత్‌ రాయితీ రూ.14.66 కోట్లు విడుదల చేయడానికి మంగళవారం జీవో విడుదల చేయిస్తానని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చినట్లు తెలిపారు. 

టెక్స్‌టైల్‌ పార్క్‌కు ప్రభుత్వ ఆర్డర్లను కేటాయించేలా హామీ లభించిందన్నా రు. కాగా, టెక్స్‌టైల్‌ రంగంపై 5శాతం జీఎస్టీని రద్దు చేయాలని, టఫ్‌ పథకం కింద సబ్సిడీని తిరిగి 30శాతానికి పెంచాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్క్‌ కమిటీ సభ్యులు వినతిపత్రం అందజేశారు.

 Also Read: Smita Sabharwal : పరువు నష్టం కేసులో స్మితా సబర్వాల్ కు షాక్, రూ.15 లక్షలు తిరిగి కట్టాలని హైకోర్టు ఆదేశం

Also Read: Minister KTR : పరిశ్రమలకు తెలంగాణ అడ్డా, వచ్చే పదేళ్లలో 16 లక్షల ఉద్యోగాలు కల్పన : మంత్రి కేటీఆర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Embed widget