By: ABP Desam | Updated at : 02 May 2022 08:51 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
మంత్రి కేటీఆర్
Minister KTR : ఎలక్ట్రానిక్స్ రంగంలో వచ్చే పదేళ్ల కాలంలో 16 లక్షల ఉద్యోగాల కల్పన రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాల ఈ-సిటీలో రేడియంట్ అప్లయెన్సెస్ సంస్థ ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. పరిశ్రమలకు తెలంగాణ అడ్డాగా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోని ప్రముఖ వ్యాపార సంస్థలు తెలంగాణలో తమ సంస్థలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు. తెలంగాణలో వ్యాపార అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. అనుకూల వాతావరణం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ఎన్నో చర్యలు తీసుకున్నారన్నారు.
Procter & Gamble's #Hyderabad site is on the way to become the FMCG giant's largest consumer care facility in #India.
— IANS (@ians_india) May 2, 2022
Spread on 170 acres at Kothur on the outskirts of Hyderabad, it added a new state of the art liquid detergent manufacturing unit.@KTRTRS pic.twitter.com/BFipaP2dhZ
రూ.50 లక్షల టీవీలు
తెలంగాణలో శాంతిభద్రతలు, మౌలిక వసతులు, ప్రభుత్వం సహకారం కారణంగానే చాలా కంపెనీలు తమ వ్యాపార కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రేడియంట్ సంస్థ ఎల్‌ఈడీ టీవీలను తయారు చేస్తుందన్నారు. తెలంగాణలో ఈ సంస్థ 50 లక్షల టీవీలు తయారుచేయనుందన్నారు. ఈ సంస్థలో పనిచేసే వారిలో 50 శాతం మహిళలు, స్థానికులు ఉన్నారు. ఫ్యాబ్ సిటీలో 15 వేల మంది ఉపాధి పొందుతున్నారని కేటీఆర్ గుర్తుచేశారు. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ఇతర మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్ రంగంలో తెలంగాణ ఇతర రాష్ట్రాల కన్నా ముందుందన్నారు.
Was delighted to inaugurate the factory of Radiant electronics at E-City, who now have scaled up to manufacture 45 lakh TVs per annum😊
— KTR (@KTRTRS) May 2, 2022
25% of India’s TVs will now be manufactured from Hyderabad including brands such as Samsung, Panasonic, Xiaomi, One Plus, Skyworth & others pic.twitter.com/YgG6dCY9vT
రూ.200 కోట్ల లిక్విజ్ డిజర్జెట్ ప్లాంట్ ప్రారంభం
షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల పరిధిలోని పెంజర్ల గ్రామంలో పీ అండ్ జీ లిక్విడ్ డిటర్జెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను మంత్రి కేటీఆర్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రూ.200 కోట్లకు పైగా విలువైన కంపెనీని ఇవాళ ప్రారంభించుకున్నామన్నారు. భవిష్యత్ లో లిక్విడ్ డిటర్జెంట్స్ అని పీ అండ్ జీ ప్రతినిధులు తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో పీ అండ్ జీ తెలంగాణలోని అన్ని వర్గాలకు మద్దతు నిలిచిందన్నారు. జెండర్ ఈక్వాలిటీ కోసం పీ అండ్ జీ చేస్తున్న కృషి ఎంతో స్ఫూర్తిదాయకం అన్నారు. 2014లో సీఎం కేసీఆర్ ఈ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారని కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. ఈ ఆరేళ్లలో రాష్ట్రంలో పీ అండ్ జీ తన కార్యకలాపాలను విస్తరించిందని పేర్కొన్నారు. తెలంగాణకు నిరంతరం మద్దతు తెలపాలని కోరుతున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు.
Petrol-Diesel Price, 29 May: నేడు చాలాచోట్ల పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం - ఈ నగరాల్లో స్థిరంగా
Gold-Silver Price: నేడు నిలకడగా బంగారం ధరలు, వెండి మాత్రం పైపైకి - మీ ప్రాంతంలో ధరలు ఇవీ
Stock Market Weekly Review: హ్యాపీ.. హ్యాపీ! 2000 లాభపడ్డ సెన్సెక్స్ - ఇన్వెస్టర్లకు రూ.10 లక్షల కోట్ల లాభం
Hyundai Venue: హ్యుండాయ్ వెన్యూ కొత్త రికార్డు - ఎన్ని కార్లు అమ్ముడుపోయాయంటే?
Gas Cylinders Explode: గ్యాస్ సిలిండర్ పేలితే బీమా పొందడం ఎలా? ఈజీ ప్రాసెస్ ఇదే!
TDPకి సరికొత్త నిర్వచనం చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి, నారా లోకేష్, మహానాడుపై సెటైర్లు
Sriya Lenka: 'K-పాప్' ఆర్టిస్ట్ గా ఎన్నికైన ఇండియన్ అమ్మాయి - ఎవరంటే?
Heavy Rush at Tirumala: తిరుమలకు వెళ్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు, కిలోమీటర్లు మేర క్యూలైన్లలో గోవిందా గోవిందా !
AP TS 10th Exam Results: ఆ తేదీల్లో ఏపీలో టెన్త్ రిజల్ట్స్ విడుదలయ్యే ఛాన్స్ - తెలంగాణలో స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రారంభం