అన్వేషించండి

Singareni: సౌరవిద్యుత్‌తో హైడ్రోజన్ ఉత్పత్తి, పర్యావరణహిత చర్యలో భాగంగా దేశంలోనే తొలిసారిగా ఏర్పాట్లు

Singareni: దేశంలోనే తొలిసారిగా సింగరేణి సౌరవిద్యుత్తుతో హైడ్రోజన్ ను ఉత్పత్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Singareni: పర్యావరణహిత చర్యల్లో భాగంగా సింగరేణి కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా సౌరవిద్యుత్ తో హైడ్రోజన్ ను ఉత్పత్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మంచిర్యాల జిల్లా జైపూర్ లో సింగరేణి సంస్థకు ఉన్న 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఉన్న హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ కేంద్రంగా మార్చాలని సింగరేణి నిర్ణయించింది. రామగుండం ప్రాంతంలో కూడా మరో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ను కొత్తగా నిర్మించాలని సింగరేణి సంస్థ బుధవారం నిర్ణయం తీసుకుంది. 

థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోని జనరేటర్లలో వేడిని తగ్గించడానికి శీతలీకరణ ధాతువుగా హైడ్రోజన్ ను వాడుతుంటారు. ఈ మేరకు జైపూర్ లోని థర్మల్ విద్యుత్ కేంద్రం ఆవరణలోనే ఒక హైడ్రోజన్ ప్లాంట్ ను గతంలో నిర్మించింది సింగరేణి. ఈ కేంద్రంలో సంవత్సరానికి 10 వేల క్యూబిక్ మీటర్ల హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుంది. ఇందుకోసం 100 కిలోవాట్ల విద్యుత్తును వినియోగిస్తున్నారు. పర్యావరణహిత చర్యగా ఈ ప్లాంటు నిర్వహణకు ఇకపై సౌర విద్యుత్ ను వాడుకోనున్నారు. ఇలా సౌర విద్యుత్ ను వాడుకుని ఉత్పత్తి చేసే హైడ్రోజన్ ను గ్రీన్ హైడ్రోజన్ గా పిలుస్తారు. కొత్త ప్లాంటులో ఉత్పత్తి అయ్యే గ్రీన్ హైడ్రోజన్ ను సమీపంలోని ఇతర కర్మాగారాలకు కూడా విక్రయిస్తామని సంస్థ డైరెక్టర్ డి. సత్యనారాయణ రావు తెలిపారు.

ఇందులో భాగంగా సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర ఆవరణలోనే ప్రస్తుతం 10 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం, 5 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే కరెంట్ ను ప్రస్తుత హైడ్రోజన్ ప్లాంట్ కు వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవాలని బుధవారం ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ అధికారులను సీఎండీ శ్రీధర్ ఆదేశించారు.

ఎస్టీపీపీలోని హైడ్రోజన్ ప్లాంట్ ను గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ గా మార్చడంతో పాటు సొంతంగా రామగుండం రీజియన్ లో మరో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటుకు అవకాశాలు పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ అధికారులను సీఎండీ ఆదేశించారు. గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే హైడ్రోజన్ వాయువును సింగరేణి, దాని సమీపంలోని ఎరువుల ఫ్యాక్టరీలతో పాటు ఇతర కర్మాగారాలకు విక్రయించే అవకాశం ఉంది. లాభాల కన్నా ఒక మంచి పర్యావరణహిత చర్యగా ఈ ప్రాజెక్టు చేపట్టాలని సింగరేణి భావిస్తోంది.

సింగరేణి వ్యాప్తంగా ప్రస్తుతం 224 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను నడుపుతోంది. ఈ ప్లాంట్ల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో 170 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసినట్లు సీఎండీ ఎన్. శ్రీధర్ తెలిపారు. సోలార్ పవర్ ఉత్పత్తితో సింగరేణి సంస్థ తెలంగాణ ట్రాన్స్‌కోకు చెల్లించే విద్యుత్ బిల్లులో రూ. 108 కోట్లు ఆదా చేసుకోగలిగిందని పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న 76 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను డిసెంబర్ నాటికల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. రివ్యూ మీటింగ్ లో సింగరేణి డైరెక్టర్ డి. సత్యనారాయణ, జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ సీటీసీ సంజయ్ కుమార్ సూర్, చీఫ్ ఓ అండ్ ఎం జేఎన్ సింగ్, ఎస్టీపీపీ జీఎం చినబసివి రెడ్డి, సోలార్ మేనేజర్ జానకీరాం, చీఫ్ ఆఫ్ పవర్ ఎన్వీకే రాజు, జీఎం సూర్య నారాయణ, ఏజీఎం ప్రసాద్, ఏజీఎం (ఎఫ్ అండ్ ఏ) సుధాకర్ సహా ఇతరులు పాల్గొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
Embed widget