Rajanna Siricilla News: జమ్ము కశ్మీర్ హెలికాప్టర్ ప్రమాదంలో సిరిసిల్ల జవాన్ మృతి, కేటీఆర్ సంతాపం
Rajanna Siricilla News: గురువారం రోజు జమ్ము కశ్మీర్ లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ ఆర్మీ జవాన్ మరణించాడు.
Rajanna Siricilla News: జమ్ముకశ్మీర్ లోని కిశ్త్ వాఝ్ సమీపంలో ఓ ఆర్మీ హెలికాప్టర్ గురువారం రోజు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ ఆర్మీ జవాన్ మరణించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్ కు చెందిన పబ్బాల అనిల్ అనే ఆర్మీ జవాన్ జమ్ము కశ్మీర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. అనిల్ గత 11 ఏళ్లుగా ఆర్మీలో పని చేస్తుండగా.. గురువారం జమ్ము కశ్మీర్ వద్ద సిగ్నల్ సమస్యల వలన అనిల్ తో పాటు మరో ఇద్దరు ప్రయాణిస్తున్న "ఆర్మీ ఏఎల్ హెచ్ ధ్రువ్" హెలికాప్టర్ నదిలో పడిపోయింది. అయితే విషయం తెలుసుకున్న అధికారులు.. మార్వా ప్రాంతంలోని నదిలో హెలికాప్టర్ శకలాలు గుర్తించారు. ఆ ప్రమాదంలో అనిల్ మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆర్మీ జవాన్ అనిల్ కు భార్య సౌజన్య, ఇద్దరు కుమారులు అయాన్, ఆరవ్, తల్లి తండ్రులు మల్లయ్య, లక్ష్మి, ఇద్దరు సోదరులు శ్రీనివాస్, మహేందర్ ఉన్నారు. అనిల్ మృతితో మల్లాపూర్ లో విషాధ ఛాయలు అలముకున్నాయి.
An Army ALH Dhruv Helicopter crashed near Kishtwar, Jammu & Kashmir. Pilots have suffered injuries but are safe. Further details awaited: Army Officials. pic.twitter.com/ya41m7CRfn
— ANI (@ANI) May 4, 2023
#WATCH | J&K: Northern Army Commander Lt Gen Upendra Dwivedi pays tribute to Craftsman (Avn Tech) Pabballa Anil, who lost his life in a helicopter crash in Kishtwar yesterday. pic.twitter.com/OjJhaJ379R
— ANI (@ANI) May 5, 2023
జవాన్ పబ్బాల అనిల్ మృతి తీరని లోటు
అనిల్ మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆయన కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ లో సైనికులు ప్రయాణించే హెలికాఫ్టర్ సాంకేతిక సమస్య ఏర్పడటంతో హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ఘటనలో బోయినిపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన జవాన్ పబ్బాల అనిల్ గారి మరణించడం బాధాకరం అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. దేశ రక్షణ కోసం విధులు నిర్వహిస్తూ ప్రమాదంలో చనిపోవడం తనను చాలా బాధించిందన్నారు. వారి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
జమ్మూకాశ్మీర్ లో హెలికాప్టర్ ప్రమాదంలో కరీంనగర్ జిల్లా బోయినిపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన పబ్బ అనిల్ మరణించడంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే బండి సంజయ్ కుమార్ అనిల్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయి విలపిస్తున్న.. కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న జిల్లా నేతలతో మాట్లాడుతూ అనిల్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉండాలని ఆదేశించారు. అంతిమ సంస్కార ఏర్పాట్లతోపాటు తదుపరి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకోవాలని కోరారు.
ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది.. నిన్న జమ్ము కశ్మీర్ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన క్రాఫ్ట్స్‌మ్యాన్ (Avn Tech) పబ్బల్ల అనిల్‌కు నివాళులు అర్పించారు.
జమ్ముకశ్మీర్‌లోని కిష్‌త్వర్ జిల్లాలో ఆర్మీ చాపర్ కూలిపోయింది. ప్రమాద సమయంలో చాపర్‌లో ఇద్దరు పైలట్‌లు ఉన్నారు. అదృష్టవశాత్తూ వీరిద్దరూ స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ALH Dhruv హెలికాప్టర్ మర్వా ప్రాంతంలో కుప్ప కూలినట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు. అంతకు ముందు మార్చి నెలలోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన ALH Dhruv Mark 3 హెలికాప్టర్ కేరళలోని కొచ్చిలో కుప్ప కూలింది. చాపర్‌ను టెస్ట్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఇది జరిగిన సమయంలో చాపర్‌లో ముగ్గురు ఉన్నారు. వీరంతా సురక్షితంగా ఉన్నట్టు ముందు అధికారులు తెలిపారు. తర్వాత గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత వాళ్లు అమరులైనట్టు గుర్తించారు. విషయాన్ని కుటుంబ సభ్యులకు చేరవేశారు.