News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Karimnagar: కరెంటు సార్లూ ఏంటిది? చేతికి అందుతున్న కరెంటు తీగలు - భయంతో స్థానికులు

పొలంలో నుండి వేసిన కరెంటు వైర్లు కేవలం ఐదు అడుగుల నుండి ఆరడుగుల ఎత్తులోనే చేతికి అందేలా ఉన్నాయి. అవన్నీ కూడా త్రీ ఫేస్ కరెంటు వైర్లు.

FOLLOW US: 
Share:

ఈ చిత్రంలో మీరు చూస్తుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోని ముస్తాబాద్ మండలం గూడెం గ్రామం లోనిది. పొలంలో నుండి వేసిన కరెంటు వైర్లు కేవలం ఐదు అడుగుల నుండి ఆరడుగుల ఎత్తులోనే చేతికి అందేలా ఉన్నాయి. అవన్నీ కూడా త్రీ ఫేస్ కరెంటు వైర్లు. అంటే అందులో ప్రతీ వైర్ లోనూ కరెంటు ప్రవహిస్తూ ఉంటుంది. ఒకవేళ గాలి దుమారం వచ్చి వైర్లు గనుక ఒకదానికొకటి తాకినట్లయితే దాని కనెక్షన్ ఉన్నటువంటి వ్యవసాయ బావిలోని మోటర్లు కాలిపోతాయి. ఇక పొరపాటున పశువులను మేపే సమయంలో  కానీ లేదా పనులకు వెళ్లే మనుషులు కానీ పొరపాటున తాకినట్లయితే అక్కడికక్కడే ప్రాణాలూ పోవడం ఖాయం. నిజానికి విద్యుత్ శాఖకు చెందిన అధికారులు కరెంటు పోల్స్ వేసే సమయంలో కనీసం దూరాన్ని పాటించడం లేదు. మూడు పోల్స్ వాడే ప్రాంతాల్లో రెండు మాత్రమే వాడుతుంటారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. 

ఇప్పుడు జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇదే తరహా పోల్స్ వేసి ఉన్నాయి. ఇప్పటికే వ్యవసాయం కోసం అన్నీ సిద్ధం చేసుకుంటున్న రైతన్నలకు ఇవి ప్రాణాంతకంగా మారే పరిస్థితి ఉంది. సిరిసిల్లలోని వెంకటాపుర్ గ్రామంలో గతంలోనూ ఒక రైతు తన వ్యవసాయ పొలంలో నిల్చుని ఉన్న సమయంలో అక్కడే ఉన్న కరెంటు పోల్ ని తాకగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సంఘటన అప్పట్లో ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణం అయింది. 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ భవనం వద్ద కూడా అప్పట్లో ధర్నాలు కూడా చేశారు. కానీ అధికారులు తాత్కాలికంగా ఆ వ్యవహారాన్ని చక్కదిద్దారు. కానీ దీనికి పర్మినెంట్ సొల్యూషన్ మాత్రం వెతకలేదు. ప్రతి సంవత్సరం కరెంట్ షాక్ తో పలువురు రైతులు, వ్యవసాయ కూలీలు ఎక్కడో ఒకచోట చనిపోతూనే ఉన్నారు. కానీ అధికారుల్లో మాత్రం ముందస్తు జాగ్రత్తలు లేవు.

సాధారణంగా రైతులు వ్యవసాయం కోసం వాడే మోటార్ల ఖరీదు కనీసం 25 వేల పైనే ఉంటుంది. ఒకసారి కరెంటు సరఫరాలో తేడాలు ఏర్పడితే అది కాలిపోతుంది. అలాంటప్పుడు ఒక రైతు కనీసం నాలుగు నుండి ఆరు వేల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కొన్నిసార్లు కొత్త మోటర్లు కూడా పనికిరాకుండా పోతాయి. ఇక వ్యవసాయం మొదలవుతున్న సమయంలో ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు మేల్కొంటే మంచిదని స్థానికులు చెబుతున్నారు.

Published at : 22 Jun 2022 10:22 AM (IST) Tags: karimnagar Rajanna Sircilla Sircilla News Power lines crops in karimnagar TSSPDCL News

ఇవి కూడా చూడండి

Telangana Elections 2023 Live  News Updates: కాంగ్రెస్‌ను గెలిపించండి- తెలంగాణ ప్రజలకు సోనియా సందేశం

Telangana Elections 2023 Live News Updates: కాంగ్రెస్‌ను గెలిపించండి- తెలంగాణ ప్రజలకు సోనియా సందేశం

Sonia Gandhi: మీకు నిజాయతీ పాలనను అందించడానికి మేం సిద్ధం - సోనియా గాంధీ వీడియో విడుదల

Sonia Gandhi: మీకు నిజాయతీ పాలనను అందించడానికి మేం సిద్ధం - సోనియా గాంధీ వీడియో విడుదల

Rythu Bandhu News: రైతుబంధు ఎవరివల్ల నిలిచింది? పోలింగ్ రోజు రైతన్న దెబ్బ బీఆర్ఎస్‌కా? కాంగ్రెస్‌కా?

Rythu Bandhu News: రైతుబంధు ఎవరివల్ల నిలిచింది? పోలింగ్ రోజు రైతన్న దెబ్బ బీఆర్ఎస్‌కా? కాంగ్రెస్‌కా?

TS Elections: తెలంగాణ ఎన్నికలు, విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు, ఉత్తర్వులు జారీ

TS Elections: తెలంగాణ ఎన్నికలు, విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు, ఉత్తర్వులు జారీ

Koushik Reddy: గెలిస్తే విజయ్ యాత్రతో వస్తా లేకుంటే శవయాత్రకు రండీ- బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎమోషనల్‌ స్పీచ్‌

Koushik Reddy: గెలిస్తే విజయ్ యాత్రతో వస్తా లేకుంటే శవయాత్రకు రండీ- బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎమోషనల్‌ స్పీచ్‌

టాప్ స్టోరీస్

Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు

Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు

Telangana Elections Holiday: పోలింగ్ రోజు సెలవు ఇవ్వని కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు: సీఈవో వికాస్‌ రాజ్‌

Telangana Elections Holiday: పోలింగ్ రోజు సెలవు ఇవ్వని కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు: సీఈవో వికాస్‌ రాజ్‌

Hi Nanna: ఒడియమ్మా... నానితో ఆట, తమిళ హీరోతో పాట - శృతి హాసన్ సాంగ్ స్పెషాలిటీస్ ఎన్నో!

Hi Nanna: ఒడియమ్మా... నానితో ఆట, తమిళ హీరోతో పాట - శృతి హాసన్ సాంగ్ స్పెషాలిటీస్ ఎన్నో!

Aishwarya Marriage: రెండో పెళ్లికి హీరో కుమార్తె రెడీ - దర్శకుడితో ఐశ్వర్య ప్రేమ!

Aishwarya Marriage: రెండో పెళ్లికి హీరో కుమార్తె రెడీ - దర్శకుడితో ఐశ్వర్య ప్రేమ!