Liquor Sales: సమ్మర్ ఎఫెక్ట్, బీర్లు పొంగించిన కరీంనగర్ మందుబాబులు - ఏప్రిల్‌లో విక్రయాలతో ఎక్సైజ్ శాఖకు కాసుల కిక్కు
Karimnagar Liquor Sales: మద్యం ప్రియులు సమ్మర్‌లో మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. జిల్లాలో ఎండలు మండిపోతుండటంతో చల్లని బీరు పొంగిస్తున్నారు. ఏప్రిల్ నెలలో ఎక్సైజ్ శాఖకు కిక్కే కిక్కు.
Karimnagar Liquor Sales: కరీంనగర్ జిల్లాలో మందుబాబులు మద్యం ఎలా సేవించారంటే ఎక్సైజ్ అధికారులు సైతం ఈ లెక్కలు చూసి ఆశ్చర్యపోతున్నారు. మద్యం ప్రియులు సమ్మర్‌లో మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. జిల్లాలో ఎండలు మండిపోతుండటంతో చల్లని బీరు తాగుతున్నారు. ఉదయం 11 గంటల నుండి వేడి వేడి గాలులతో మండే ఎండ తో ఇబ్బందులు పడుతున్న మద్యం ప్రియులు చల్లని బీరుతో సేదతీరుతున్నారు. దాదాపుగా 45 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో మద్యం ప్రియులను బీరు ఆకర్షిస్తోంది. దీంతో కరీంనగర్ జిల్లాలో మద్యం విక్రయాలు దాదాపుగా 150 శాతం పెరిగాయి.
రోజుకో కోటి రూపాయల బీర్ల విక్రయాలు..
ఏప్రిల్ నెలలో రోజుకు కోటి రూపాయల ఆరు లక్షల రూపాయల విలువైన బీర్లు తాగేశారు మందుబాబులు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 94 వైన్ షాపులు, 31 బార్ అండ్ రెస్టారెంట్లో ద్వారా గత నెల ఏప్రిల్‌లో అక్షరాలా 1,82,009 బీరు బాక్సులు అమ్ముడుపోయాయి. ఒక్కో బీరు పెట్టెలో 12 బీర్లు ఉంటాయి. దీని సరాసరి ధర 1755 రూపాయలుగా లెక్కిస్తే గత నెలలో 31 కోట్ల 94 లక్షల 25 వేల 795 రూపాయల అమ్మకాలు జరిగాయి.
ఇందులో స్ట్రాంగ్ బీర్ బాక్స్ ఎమ్మార్పీ ధర 1,830 ఉండగా లైట్ బీర్ బాక్స్ ధర 1680 రూపాయలుగా ఉంది. ఇక బెల్టు షాపులు, బార్ అండ్ రెస్టారెంట్‌లలో పది రూపాయల నుండి 30 రూపాయల వరకూ గరిష్టంగా ఎమ్మార్పీ కి మించి ఛార్జ్ చేస్తున్నారు. ఈ మార్చిలో లక్ష 53 వేల 357 పెట్టెల బీరు అమ్మకాలు జరిగాయి. వీటి విలువ అక్షరాలా 26 కోట్ల 91 లక్షల 41 వేల 535 రూపాయలు. గత సంవత్సరం మార్చిలో లక్ష 14వేల 135 పెట్టెల బీరు సెల్ జరిగింది .గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చి వరకు 34.36 శాతం అమ్మకాలు పెరిగాయి.
2021 ఏప్రిల్ నెలలో కరీంనగర్ అర్బన్ పరిధిలో 19, 746 (బాక్సులు) అమ్ముడుపోగా 2022 ఏప్రిల్ లో 60,192(బాక్సులు) విక్రయాలు జరిగాయి. ఇక కరీంనగర్ రూరల్‌లో 2021ఏప్రిల్ నెలలో 22,640 బాక్సులు అమ్ముడుకాగా, 2022 ఏప్రిల్‌లో 50,186 పెట్టెలు విక్రయించారు.
ఇక వరుసగా స్టేషన్ల వారీగా గత సంవత్సరం , ఈ ఏడాది లెక్కలు ఇలా ఉన్నాయి.
తిమ్మాపూర్ 13,445 27,265
హుజూరాబాద్ 8,270 21,950
జమ్మికుంట 8,637 22,416
2021లో మొత్తం 72,738 పెట్టెలు అమ్ముడుపోగా,150 శాతం విక్రయాలు పెరగడంతో 2022 ఏప్రిల్ నెలలలో 1,82,009పెట్టెల అమ్మకాలు జరిగాయి. ఎండల ప్రభావంతో ఎక్సైజ్ శాఖ ఆశించిన దాని కన్నా భారీగానే కరీంనగర్ జిల్లాలో బీర్ విక్రయాలు జరిగాయి.
Also Read: Hyderabad Rains: అకాల వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్ - లోతట్టు ప్రాంతాలు జలమయం, విద్యుత్ సరఫరాకు అంతరాయంతో కష్టాలు
ఏపీ, తెలంగాణ సహా ఇతర సెక్షన్స్‌లో మరిన్ని లేటెస్ట్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి