అన్వేషించండి

Karimnagar: అగ్గిపుల్ల తల సైజులో ఎలుకల ట్రాప్, పని చేసేలా అరగంటలోనే తయారీ- సూదిపై నర్సు, గణపతి!

కేవలం 5 మిల్లీమీటర్ల పొడవు 2.5 మిల్లీ మీటర్ల వెడల్పుతో పూర్తిస్థాయిలో పనిచేసేలా 29 నిమిషాల్లోనే ఈ బోనుని తయారుచేసిన దయాకర్ గతంలో ఒక భారతీయుడు పేరు పై ఉన్న రికార్డును చెరిపేసాడు.

Jagityala Micro Artist: జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ మరో రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే అతి చిన్న ఎలుకల బోనుని రికార్డు టైంలో రూపొందించి అధికారికంగా గిన్నిస్ లో స్థానం సంపాదించాడు.  కేవలం 5 మిల్లీమీటర్ల పొడవు 2.5 మిల్లీ మీటర్ల వెడల్పుతో పూర్తిస్థాయిలో పనిచేసేలా 29 నిమిషాల్లోనే ఈ బోనుని తయారుచేసిన దయాకర్ గతంలో ఒక భారతీయుడు పేరు పై ఉన్న రికార్డును చెరిపేసాడు. అప్పట్లో పాత రికార్డు నమోదు చేసిన వ్యక్తి కి గంట సమయం పట్టగా అందులో సగం సమయంలోనే దయాకర్ తయారు చేయడం విశేషం. గత డిసెంబర్ రెండో తారీఖున అధికారుల సమక్షంలో వీడియో తీస్తూ, నిబంధనల మేరకు బోను తయారు చేసి గిన్నిస్ రికార్డ్ బుక్ అధికారులకు పంపగా తాజాగా దానికి సంబంధించి ప్రశంసాపత్రాన్ని దయాకర్ కి అందజేశారు

గతంలోనూ అనేక ప్రత్యేక సందర్భాల్లో గుర్రం దయాకర్ పలు రకాల సూక్ష్మ కళాఖండాలను తయారు చేశారు. శివరాత్రికి ప్రత్యేకమైన శివుడిని హిమాలయాలతో సహా గుండుసూది పై ప్రతిష్ఠించారు. ఇక వినాయకచవితికి కూడా అలాంటి కళాఖండాన్ని తయారు చేశారు. మాతృ దినోత్సవం సందర్భంగా తల్లి పిల్లల్ని ప్రతిబింబించేలా ఒక సూక్ష్మ కళాఖండాన్ని తయారు చేసిన దయాకర్ మహిళా దినోత్సవం రోజున బాధ్యతలు మోస్తూ పరిగెత్తుతున్న ఓ మహిళ సూక్ష్మ విగ్రహాన్ని 18 గంటల్లో 0.09 మిల్లి మీటర్ల సైజులో సూది మొనపై తయారు చేసి అందరిని అబ్బుర పరిచారు. 

ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Read: ఫోలులు: బియ్యం గింజ సైజులో ఎలుకల బోను, అరగంటలోనే గిన్నీస్ బుక్‌లో చోటు

ఇప్పటికే పలు రకాల అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న దయాకర్ ప్రతి అంశానికి తగ్గట్టుగా ప్రజల్లో అవగాహన పెంపొందించేలా తన కళని వాడుతున్నారు. సామాజిక కోణంలో పలుమార్లు ప్రజల్లో అవగాహన పెంచడానికి తన టాలెంట్ ని వాడుతున్న తీరు చూసి జగిత్యాల లోని పలువురు ప్రముఖులు ఆయనను ప్రశంసించారు. ఈసారి ఏకంగా ప్రపంచవ్యాప్తంగా పేరున్న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకోవడం పట్ల జగిత్యాల వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఒక జగిత్యాల వాసి రికార్డును క్రియేట్ చేయడం పట్ల ఆయనను అభినందిస్తున్నారు.

ఇక చిన్ననాటి నుండి సామాజిక స్పృహతో పెరిగిన తాను తన కళను ప్రజల్లో వివిధ అంశాలపై అవగాహన పెంపొందించడానికి వాడుతున్నానని ఇకపై కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Embed widget