Karimnagar: ఆసియాలో ఆ ఘనత సాధించిన తొలి అంధ విద్యార్థి ఇతను.. సోనూసూద్ ఫిదా, స్పెషల్ గిఫ్ట్
కరీంనగర్‌ని మంకమ్మ తోటకు చెందిన లక్కీ మిరాని తన ఏడేళ్ళ వయసులోనే రెటినో డిస్ట్రోఫీ అనే వ్యాధి కారణంగా క్రమక్రమంగా చూపు కోల్పోయాడు. ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు.
చదువుల ఒత్తిడి భరించలేమంటూ ఆత్మహత్యకు పాల్పడే విద్యార్థుల కథనాలు మనం తరచుగా చూస్తూ ఉంటాం. పిల్లలకి కనీసం సమయం కేటాయించలేని సెలెబ్రిటీ తల్లిదండ్రుల సంగతులు కూడా వింటుంటాం. కానీ తనకు ఆకస్మికంగా వచ్చిన అంధత్వాన్ని ఎదిరించి జయించాడు ఓ విద్యార్థి. అతనికి తోడుగా తామే ఒక నీడగా పూర్తి సహకారం అందించారు ఆ బాబు తల్లిదండ్రులు. వారి కృషి వృథా కాలేదు పదో తరగతి పరీక్షల్లో 10/10 జీపీఏ సాధించిన ఆ విద్యార్థి పేరు లక్కీ మిరాని. కరీంనగర్‌కి చెందిన లక్కీ ఇప్పుడు జాతీయ స్థాయి పరీక్షల్లో నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. ఈ ఘనత సాధించి అరుదైన రికార్డును నెలకొల్పాడు.
కరీంనగర్‌ని మంకమ్మ తోటకు చెందిన లక్కీ మిరాని తన ఏడేళ్ళ వయసులోనే రెటినో డిస్ట్రోఫీ అనే వ్యాధి కారణంగా క్రమక్రమంగా చూపు కోల్పోయాడు. అయితే ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఏ మాత్రం కోల్పోలేదు. చదువే లోకంగా లక్కీ మిరాని ఐఏఎస్ టార్గెట్‌గా పెట్టుకున్నాడు. లక్కీ తల్లిదండ్రులు తమ పూర్తిస్థాయి సహకారాన్ని అందించారు. ప్రతిరోజు పాఠశాలలో జరిగే క్లాసుల సారాంశాన్ని అతని తల్లిదండ్రులు కూర్చోబెట్టి తాము చదువుతూ లక్కీకి వినిపించేవారు. అంతేకాదు పరీక్షల్లో వేగంగా ఎలా రాయాలో కూడా నేర్పించారు.
Also Read: తెలంగాణలో కలిసేందుకు మహారాష్ట్ర, కర్ణాటక సరిహ్దదు ప్రాంతాల ఆసక్తి ! కారణం ఏమిటంటే ?
లక్కీని బ్రెయిలీ లిపిపై ఆధారపడకుండా సాధారణ పద్ధతిలోనే చదివించారు. ప్రశ్నలను అర్థం చేసుకొని, రాసిన సమాధానం కూడా మరోసారి చెప్పే మెమరీ లక్కీ సొంతం. పదో తరగతి పరీక్షల్లో 10 జీపీఏ ఇంటర్మీడియట్లో 96% మార్కులను సాధించాడు లక్కీ. మరోవైపు సౌండ్ ద్వారా పనిచేసే ప్రత్యేక సాఫ్ట్వేర్ సహాయంతో ల్యాప్‌టాప్‌లో కంప్యూటర్ కోడింగ్ శిక్షణ కూడా పొందాడు.
అంతేకాదు సంగీతంలో ప్రవేశం కూడా లక్కీకి ఉంది. కీబోర్డ్ ప్లే చేయగలడు. లక్కీకి రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం సహా సుమారు 38 అవార్డులు ఇప్పటిదాకా అందుకున్నాడు. తల్లిదండ్రుల శ్రమ వృథా కాలేదు. లక్కీ వరుసగా చదువులో ప్రతిభ కనబరిచాడు. దీంతో అప్పట్లో లక్కీ పేరు మార్మోగింది. ఇటీవల అఖిల భారత స్థాయిలో జరిగిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) ఇంటిగ్రేటెడ్ MA, సోషల్ సైన్స్ ఎంట్రన్స్ పరీక్ష కోటాలో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ఇదే ర్యాంకు జనరల్ విభాగంలో 148వ స్థానం. అప్పట్లో 10కి 10 జీపీఏ సాధించి.. ఆసియాలోనే ఈ ఘనత దక్కించుకున్న తొలి వ్యక్తిగా రికార్డు సాధించాడు.
Also Read: టీఆర్ఎస్‌కు ఆదాయం ఎక్కువ.. టీడీపీకి ఖర్చెక్కువ ! ప్రాంతీయ పార్టీల జమాఖర్చుల్లో చిత్రాలెన్నో !
లక్కీతో మాట్లాడిన సోనూ సూద్
లక్కీని ప్రశంసించిన వారిలో ఎందరో ప్రముఖులు ఉన్నారు. అయితే ప్రత్యేకంగా బాలీవుడ్ నటుడు సోనూ సూద్ మాట్లాడారు. తన సక్సెస్ ఇలాగే కొనసాగించాలని ఆశించిన సోనూసూద్ తన వంతుగా ఒక లాప్ టాప్‌ని బహుమతిగా అందించారు. పిల్లల కోసం సమయం కేటాయించలేని తల్లిదండ్రులు ఉన్న ఈ రోజుల్లో ఓపికతో ప్రతి పాఠాన్ని చదివి వినిపించారు లక్కీ తల్లి ముస్కాన్ మిరానీ. అయితే తన కోసం పూర్తి సమయాన్ని వెచ్చించి, ఈ రోజు తన గెలుపునకు అహర్నిశలు కృషి చేసిన తల్లిదండ్రుల త్యాగం ముందు తన శ్రమ తక్కువే అని లక్కీ అంటున్నాడు.
Also Read: Sunday Funday: హైదరాబాద్ వాసులకు మరో గుడ్‌న్యూస్.. ఇంకోచోట కూడా సన్ డే ఫన్ డే, ఎక్కడంటే..
Watch Video : టీఆర్ఎస్ ప్రచారంలో మంత్రి హరీష్ రావుకి షాక్ ... ఏం జరిగిందో చూడండి !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి