By: ABP Desam | Updated at : 30 Jan 2023 05:18 PM (IST)
జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ బోగ శ్రావణి రాజీనామాకు ఆమోదం
Bhoga Shravani Resignation Accepted: జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ భోగ శ్రావణి రాజీనామాకు ఆమోదం లభించింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేసిన భోగ శ్రావణి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు గత వారం ప్రకటించారు. ఈ క్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ పదవికి రాజీనామా లేఖను సోమవారం జగిత్యాల కలెక్టర్ కు సమర్పించారు. భోగ శ్రావణి రాజీనామాకు జిల్లా కలెక్టర్ ఆమోదం తెలిపారు. దాంతోపాటు వైస్ ఛైర్మన్ కు ఇంఛార్జ్ గా బాధ్యతలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు.
జనవరి 25న రాజీనామా ప్రకటన
జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ పదవికి బోగ శ్రావణి జనవరి 25న రాజీనామా చేశారు. మీడియా ముందు కంటతడి పెట్టిన ఆమె.. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ మహిళ ఎదగడం చూసి ఓర్వలేక ప్రతి తప్పుకు తనని బాధ్యుల్ని చేశారని శ్రావణి ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిలర్లను సైతం ఎమ్మెల్యే సంజయ్ టార్చర్ చేశాడని ఆమె ఆరోపించారు. తనకు చెప్పకుండా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టొద్దని ఎమ్మెల్యే హుకుం జారీ చేశాడని, తన పదవితో పోలిస్తే మున్సిపల్ చైర్మన్ పదవి చాలా చిన్నది అంటూ చాలాసార్లు సంజయ్ అవమానించాడని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే ఇబ్బందులు పెడుతున్నా అభివృద్ధే లక్ష్యంగా తాను ముందుకు వెళ్ళానని శ్రావణి చెప్పారు.
ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేసిన శ్రావణి
మీకు పిల్లలు ఉన్నారు.. వ్యాపారాలు ఉన్నాయి జాగ్రత్త అని బెదిరించారు. డబ్బులు కోసం డిమాండ్ చేశారు. మేము ఇచ్చుకోలేం అని చెప్పామమని అయినా వదిలి పెట్టలేదన్నారు భోగ శ్రావణి. దొర అహంకారం తో బీసీ బిడ్డ ఎదుగుతుందని ఓర్వలేక తనపై కక్ష కట్టారని ఆమె ఆరోపించారు. నరక ప్రాయంగా మున్సిపల్ చైర్మన్ పదవి ఉందని.. నడి రోడ్డుపై అమరవీరుల స్థూపం సాక్షిగా అవమానానికి గురయ్యాను అని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్ని అవమానాలు చేసినా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్ళాననన్నారు. స్నేహితుడి కోసం జంక్షన్ చిన్నగా కట్టిన వ్యక్తి ఎమ్మెల్యే అని.. మూడు సంవత్సరాలనుండి నరకం అనుభవిస్తున్నానని ఆమె విలపించారు.
తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆవేదన
కమిషనర్ ను బెదిరించి సస్పెండ్ చేస్తాను అని బెదిరించడం తోనే ఆయన లీవ్ పై వెళ్లిన మాట వాస్తవం కాదా అని భోగ శ్రావణి ప్రశ్నించారు. ఎమ్మెల్యే అడ్డు పడ్డా అభివృద్ధి వైపే ఉన్నామన్నారు. తన కుటుంబానికి ప్రాణహాని ఉందని.. తన కుటుంబానికి ఏమైనా జరిగితే సంజయ్ కుమార్ కారణం అవుతారని హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవితను కలవకూడదని, కేటీఆర్ పేరు ప్రస్తావించకూడదని సంజయ్ కుమార్ హెచ్చరించారని శ్రావణి అన్నారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని కోరారు.
పేరుకే మున్సిపల్ చైర్మన్ అయినా పెత్తనం అంతా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ దే అని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసమే పని చేస్తామని పలుసార్లు వేడుకున్న కూడా వినకుండా కక్ష గట్టారన్నారు. తప్పు ఎక్కడ జరిగింది సర్దుకుంటాం అని పలుమార్లు అడిగినా ఉద్దేశపూర్వకంగానే తనను కార్నర్ చేసారని ఇటీవల మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం, పెన్‌డ్రైవ్‌లో మొత్తం 15 ప్రశ్నపత్రాలు!
TS EAMCET: టీఎస్ఎంసెట్ - 2023 షెడ్యూల్‌లో మార్పులు, కొత్త తేదీలివే!
Ponnam Prabhakar: అదానీ ఓ దొంగ, ఆయనకు ప్రధాని మద్దతు ఎందుకు? - ప్రశ్నిస్తూనే ఉంటామన్న పొన్నం
Karimnagar Accident : హెల్మెట్ ధరించినా దక్కని ప్రాణం, రోడ్డు ప్రమాదంలో మహిళా టీచర్ మృతి
TSRJC CET - 2023 దరఖాస్తు గడువు పెంపు, పరీక్ష ఎప్పుడంటే?
Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
MP Nandigam Suresh : పథకం ప్రకారమే దాడి, ఆదినారాయణ రెడ్డి మనుషులే కవ్వించారు- ఎంపీ నందిగం సురేష్
Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్