అన్వేషించండి

Heavy Floods to Godavari: గోదావరికి మళ్లీ పెరిగిన వరద ఉద్ధృతి, ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక!

Heavy Floods to Godavari: గోదావరి నదికి వరద ఉద్ధృతి మళ్లీ పెరిగింది. ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 14.20 లక్షల క్యూసెక్కులుగా ఉంది. 

Heavy Floods to Godavari: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి మళ్లీ వరద ఉద్ధృతి పెరిగింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత ఇన్ ఫ్లో 14.20 లక్షల క్యూసెక్కులు ఉండగా... ఔట్ ఫ్లో కూడా అంతే ఉంది. ముంపు గ్రామాల్లోని సహాయక చర్యల్లో భాగంగా మొత్తం 3 ఎస్డీఆర్ఎఫ్, 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో ఎన్డీఆర్ఎఫ్, ఐయినవిల్లి, మామిడి కుదురులో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు  సహాయక చర్యలు కొనసాస్తున్నాయి. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో ఎన్డీఆర్ఎఫ్, విఆర్ పురంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం చర్యలు అందిస్తోంది. 

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి..!

కృష్ణా నదికి కూడా వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.15 లక్షల క్యూసెక్కులుగా ఉండగా.. వంశధార - నాగావళి నదులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. అలాగే గొట్టా బ్యారేజ్ వద్ద ఔట్ ఫ్లో 30,712 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయిలో వరద ప్రవాహం తగ్గే వరకు నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వీలయినంత వరకు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని చెబుతున్నారు. 

ఆదివారం నుంచి జల దిగ్బంధంలోనే గ్రామాలు..

మూడు రోజుల కిందట.. ఆదివారం ఉదయం 6 గంటలకు బ్యారేజీలో నీటిమట్టం 14.90  అడుగులు ఉండగా.. సముద్రంలో14,62,217 క్యూసెక్కుల జలాలు దిగువకు విడుదల చేశారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు నీటి మట్టం 14.80కు చేరుగా.. కడలిలోకి 14,44,414 క్యూసెక్కుల నీటని వదిలారు. దీని వల్ల కోనసీమలోని గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదీపాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలోన్ని చాలా గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఈ క్రమంలోనే 3 ఎస్డీఆర్ఎఫ్, 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.. ప్రస్తుతం సహాయక చర్యలు అందిస్తున్నాయి. 

భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటిమట్టం

గోదావరి నదికి వరద ఉద్ధృతి పెరగడంతో భద్రాచలం వల్ల గోదావరి  నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరిలోకి 54.6 ఉంది. దీనికి అధికారులు మూడో హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం 15.08 లక్షల క్యూసెక్కుల వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. మంగళ వారం నీటిమట్టం 44 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. అలాగే మరింత నీటి మట్టం పెరగిన కారణంగా సోమవారం రెండో ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. బుధవారం మధ్యాహ్నం 55 అడుగులకు చేరే అవకాశం ఉండటంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని ఇంద్రావతి, ప్రాణహిత, కిన్నెరసాని, తాలిపేరు, శబరి వంటి ఉప నదులు పొంగి పొర్లుతున్నాయి. నదులన్నీ ప్రమాదకర స్థాయిని మించి ప్రవాహం కొనసాగుతోంది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Forbes 30 Under 30 Asia 2026:ఫోర్బ్స్‌ జాబితాలో ఇద్దరు తెలుగు కుర్రాళ్లు! ప్రయోగాశాలతో లారీ డ్రైవర్ కుమారుడికి ప్రపంచ ఖ్యాతి!
ఫోర్బ్స్‌ జాబితాలో ఇద్దరు తెలుగు కుర్రాళ్లు! ప్రయోగాశాలతో లారీ డ్రైవర్ కుమారుడికి ప్రపంచ ఖ్యాతి!
Telangana Employee Dues: తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!
తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!
Breaking News:సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
Revanth Reddy CM Change Rumors: తెలంగాణపై కర్ణాటక ఎఫెక్ట్! కాంగ్రెస్ అధిష్ఠానం కార్యాచరణ సిద్ధం చేస్తోందా?
తెలంగాణపై కర్ణాటక ఎఫెక్ట్! కాంగ్రెస్ అధిష్ఠానం కార్యాచరణ సిద్ధం చేస్తోందా?

వీడియోలు

RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ
Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్
Bhuvneshwar Kumar Comments on Virat Kohli | విరాట్ పై భువి ఫన్నీ కామెంట్స్
Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్‌ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం
Ambati Rayudu Comments on Yashasvi Jaiswal | యశస్వి జైస్వాల్‌ కు రాయుడు సలహా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 GT In Final: ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్, ఫైన‌ల్ కు పోరుకు సిద్ధం.. క్వాలిఫ‌య‌ర్ 2లో రాయ‌ల్స్ పై జీటీ గ్రాండ్ విక్ట‌రీ.. గిల్ సెంచ‌రీ, సుద‌ర్శ‌న్ ఫిఫ్టీ
ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్, ఫైన‌ల్ కు పోరుకు సిద్ధం.. క్వాలిఫ‌య‌ర్ 2లో రాయ‌ల్స్ పై జీటీ గ్రాండ్ విక్ట‌రీ.. గిల్ సెంచ‌రీ, సుద‌ర్శ‌న్ ఫిఫ్టీ
Telangana Employee Dues: తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!
తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!
Supreme Court Guidelines: సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
Beer for Kidney Stones : బీర్ తాగితే కిడ్నీలో స్టోన్స్ బయటకి వచ్చేస్తాయా? ఇది ఎంతవరకు నిజం?
బీర్ తాగితే కిడ్నీలో స్టోన్స్ బయటకి వచ్చేస్తాయా? ఇది ఎంతవరకు నిజం?
Vaibhav Suryavanshi: చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
Vaginal Health : యోని ఆరోగ్యాన్ని కాపాడే డ్రింక్స్ ఇవే.. మహిళలు రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిది
యోని ఆరోగ్యాన్ని కాపాడే డ్రింక్స్ ఇవే.. మహిళలు రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిది
Scrolling Social Media for Hours : గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారా? ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా?
గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారా? ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా?
Embed widget