By: ABP Desam | Updated at : 21 Aug 2021 01:22 PM (IST)
పాయల్ రాజ్ పుత్ (ఫైల్ ఫోటో)
ఆర్ఎస్ 100 సినిమాతో తెలుగు సినిమాల్లోకి ప్రవేశించి కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. విక్టరీ వెంకటేశ్ వంటి సీనియర్ నటులతోనే కాకుండా యువ హీరోలతో కూడా నటిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ప్రేక్షకుల్లో క్రేజ్ కూడా పాయల్‌కు బాగానే ఉంది. కేవలం సినిమాలతోనే కాకుండా పాయల్ రాజ్ పుత్ వివిధ మార్గాల ద్వారానూ సంపాదిస్తున్నారు. షాప్ ఓపెనింగ్‌లు, ఇతర ఈవెంట్ల ఆఫర్ల విషయంలోనూ పాయల్ ముందుంటున్నారు. అయితే, తాజాగా ఆమెపై ఓ కేసు నమోదైంది.
Also Read: In Pics: ఇది సిద్దిపేటా? కశ్మీరా? హరీశ్ రావు ట్వీట్ చేసిన ఫోటోలకు ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఓ కేసులో ఇరుక్కున్నారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో ఆమెపై పెద్దపల్లి జిల్లా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. గత నెల 11న పెద్దపల్లి పట్టణంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాయల్ రాజ్ పుత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాస్కు ధరించకపోవడంతో పాటు కొవిడ్ నిబంధనలు పాటించలేదు. ఈ విషయాన్ని పెద్దపల్లికి చెందిన బొంకూరి సంతోష్ అనే వ్యక్తి కోర్టులో ఫిర్యాదు చేశారు. దీంతో జూనియర్ సివిల్ ఇన్‌చార్జి జడ్జి పార్థసారథి ఆదేశాల మేరకు పాయల్ రాజ్ పుత్‌పై కేసు నమోదు చేసినట్లు పెద్దపల్లి పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన షాపు యజమానితో పాటు ఇంకొందరిపైనా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. షాప్ ఓపెనింగ్ ఏమో కానీ ఈ ముద్దుగుమ్మకు లేనిపోని కష్టాలు వచ్చిపడ్డట్లయింది. ఈ హాట్ బ్యూటీపై ఇలా కేసు నమోదు అవ్వడంతో పాయల్ ఫ్యాన్స్ కొంచెం ఫీలయ్యారు.
Also Read: Lotus Pond Banjara Hills: లోటస్ పాండ్‌ను ఇలా ఎప్పుడూ చూసుండరు! పని తీరును మెచ్చుకున్న కేటీఆర్
అయితే, ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత మళ్లీ ఆ స్థాయి హిట్ పాయల్‌కు అందలేదు. వెంకటేష్ సరసన వెంకీ మామ, రవితేజకు జోడీగా డిస్కోరాజా వంటి సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోకపోవడంతో పాయల్‌కు కూడా మంచి పేరు రాలేదు. దీంతో ఆఫర్లు కూడా పర్లేదనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా పాయ రాజ్ పుత్‌పై పోలీస్ కేసు నమోదైంది. ఆమెపై పెద్దపల్లి కోర్టులో ఫిర్యాదు నమోదైంది.
Also Read: Traffic Challan Telangana: పెండింగ్ చలానా ఉంటే పోలీసులు మన బండి సీజ్ చేయొచ్చా? హైకోర్టు క్లారిటీ
World Tribal Day : 75 ఏళ్ల స్వాతంత్య్రంలో మారని బతుకులు, ఆదివాసీల ఆవేదన
ABP Desam Anniversary: ఏబీపీ దేశం తొలి వార్షికోత్సవం- మొదటి అడుగుతోనే మరింత ముందుకు
గ్యాప్ ఇవ్వలేదు వచ్చింది అంటున్న పొన్నం- కాంగ్రెస్‌లో ఊపు కోసం స్కెచ్
Rains in AP Telangana: వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం - నేడు ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, IMD రెడ్ అలర్ట్
Rains in AP Telangana: తీవ్రరూపం దాల్చుతోన్న అల్పపీడనం - భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ వార్నింగ్
Tirumala News : శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్, తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి
Mahesh Babu: ఆ మహేష్ బాబును మళ్లీ చూడలేమా? ఈ ప్రయోగాలు మరే హీరో చేయలేడు!
Zoonotic Langya virus: చైనా నుంచి మరో వైరస్ - ఇది కరోనా కంటే ఎంత డేంజరంటే ?
Alto K10 2022 Vs Celerio: కొత్త ఆల్టో K10 ఫస్ట్ లుక్ రివ్యూ, సెలెరియో ఫీచర్స్‌తో మరో బడ్జెట్ కార్, ప్రత్యేకతలు ఇవే!