అన్వేషించండి

Bandi Bhageerath: బండి భగీరథ్‌కు షాక్! ముందస్తు బెయిల్‌పై ఈ దశలో ఆర్డర్ ఇవ్వలేమన్న హైకోర్టు

Bandi Bhageerath: బండి భగీరథ్‌పై పోక్సో కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలన్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బండి భగీరథ్ పోక్సో కేసు ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో కొట్టివేత.
  • బాధితురాలి ఫిర్యాదు, ఫోటోలు, చాటింగ్ ఆధారాలపై న్యాయవాది వాదనలు వినిపించారు.
  • ఫిర్యాదు ఆలస్యం, బాధితురాలి ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తపరిచిన న్యాయవాది.
  • కేసు తీవ్రత దృష్ట్యా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది.

Bandi Bhageerath: బండి భగీరథ్‌కు ముందుస్తు బెయిల్ విషయంలో షాక్ తగిలింది. తెలంగాణ హైకోర్టు. తనపై నమోదైన పోక్సో కేసులో ఈ దశలో ముందస్తు బెయిల్ మంజూరు చేయలేమని హైకోర్టు పేర్కొంది. వచ్చే వారం ఈ పిటిషన్ పై తీర్పు ఇవ్వనుంది. బండి భగీరథ్ తరుపున న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ పలు వాదనలు వినిపించారు. పోక్సో కేసుకు కారణమైన బాధితురాలి ఫిర్యాదు, ప్రవర్తన , కాల్ రికార్డ్‌లు, చాటింగ్ వివరాలతోపాటు అనేక అంశాలను ప్రస్తావిస్తూ, తన క్లయింట్‌పై వచ్చిన ఆరోపణలపై అనుమానాలున్నాయని వాదించారు. భగీరథ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.

భగీరథ్‌కు ముందస్తు బెయిల్ కోరుతూ వినిపించిన వాదనలు ఇవే..

బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదులో 2025 డిసెంబర్ 31వ తేది నుంచి రెండు రోజుల పాటు తన కూతురుని మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో ఉంచారని, ఆమెతో బలవంతంగా మద్యం తాగించారని ఫిర్యాదులో ఆరోపణలు చేశారు. అయితే అదే ఫిర్యాదులో బాధితురాలు, నిందితుడితోపాటు మరో ఐదుగురితో కలసి అదే ఫామ్ హౌస్‌లో ఉన్నట్లు ఫిర్యాదులో బాధితురాలి తల్లి తెలిపినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు న్యాయవాది నిరంజన్ రెడ్డి. ఫామ్ హౌస్‌లో తీసుకున్న ఫొటోలు, వీడియోల గురించి కోర్టు ముందు ప్రస్తావించిన నిరంజన్ రెడ్డి, స్నేహితులు తీసిన ఫొటోలు చూస్తుంటే , బాధితురాలు ఎవరి బలవంతం లేకుండానే స్వచ్చందంగా మద్యం తీసుకున్నట్లుగా కనిపిస్తోందన్నారు. బాధితురాలిని కించపరిచే ఉద్దేశ్యం తనకు లేదని, కానీ తన క్లయింట్‌పై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై స్పష్టత ఇచ్చేందుకే ఈ విషయాలు ప్రస్తావిస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే కోర్టుకు సమర్పించేందుకు తమ వద్ద అమ్మాయి స్నేహితులు తీసిన ఫొటోలు , వీడియోలు ఉన్నట్లు తెలిపారు.

అమ్మాయి కేసు ఆలస్యంగా ఎందుకు పెట్టింది..

బాధితురాలు ఫిర్యాదు ఆలస్యంగా ఎందుకు ఇచ్చిందనే అంశాన్ని సైతం ప్రధానంగా లేవనెత్తారు నిందితుడి తరపు న్యాయవాది. ఆమెపై బలవంతంగా దాడి జరిగిన ఘటన తరువాత పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు నాలుగున్నర నెలలు సమయం ఎందుకు తీసుకున్నారంటూ ప్రశ్నించారు నిందితుడి తరపు న్యాయవాది. నాలుగున్నర నెలలు ఆగి ఫిర్యాదు చేయడం వెనుక అనేక అనుమానాలున్నాయని కోర్టకు తెలిపారు. బాధితురాలు మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్న బాధితురాలి తల్లి, విషయం తెలిసిన వెంటనే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు భగీరథ్ తరపు న్యాయవాది.

Also Read: కేంద్రమంత్రి బండి సంజయ్‌ తల్లికి గుండెపోటు! అత్యవసర చికిత్స చేసి స్టంట్ వేసిన వైద్యులు!

పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో 2025 అక్టోబర్ 25వ తేదిన శారీరక వేధింపులు జరిగాయని పేర్కొన్నారని, కానీ ఆ తరువాత రోజే నిందితుడితో, బాధితురాలు నిందితుడిని సినిమాకు రావాలంటూ కోరుతూ టిక్కెట్లు పంపిందని కోర్టుకు తెలిపారు. నవంబర్ 12,13,14 తేదీలలో తన క్లయింట్‌తో బాధితురాలు 8 గంటలపైగా ఫోన్ మాట్లడిందని, నవంబర్ 14వ తేదీ గంటల తరబడి చాటింగ్ చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు నిరంజన్ రెడ్డి. నిజంగా లైంగిక వేధింపులు జరిగి ఉంటే ఇంత సన్నిహితంగా ఫోన్ సంభాషణలు, చాటింగ్ కొనసాగేవా అంటూ ప్రశ్నించారు. 

Also Read:భగీరథ్ కేసులో కోర్టు సంచలన ఆదేశాలు - మీడియా, సోషల్ మీడియాల్లో బండి సంజయ్ పేరు వాడితే కఠిన చర్యలు

పోక్సో చట్టం కింద నమోదైన కేసుల్లో అనుమానాలు ఉన్నప్పుడు నిందితులకు గతంలో అనేక కోర్టులు బెయిల్ మంజూరు చేసినట్లు తీర్పులున్నాయంటూ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు నిరంజన్ రెడ్డి. నిందితుడి తరపు న్యాయవాది వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు, కేసు తీవ్రత, ఆరోపణల స్వభావం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు బండి భగీరథ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. కోర్టు తీర్పుతో పోక్సో కేసులో తదుపరి విచారణ కొనసాగనుంది. ఏ సమయంలోనైనా బండి భగీరథ్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయి.

Also Read:బండి సంజయ్ ఇంటి నుంచి భయంతో బయటకొచ్చాం.. బాధితురాలి తల్లి సంచలన లేఖ విడుదల

Frequently Asked Questions

బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందా?

లేదు, బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. కేసు తీవ్రత, ఆరోపణల స్వభావం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంది.

బండి భగీరథ్‌పై నమోదైన కేసు ఏంటి?

బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు.

ఫిర్యాదులో ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి?

బాధితురాలిని ఫామ్‌హౌస్‌లో ఉంచి బలవంతంగా మద్యం తాగించారని ఫిర్యాదులో ఆరోపణలు చేశారు. అయితే, బాధితురాలు తనంతట తానుగా మద్యం తీసుకున్నట్లు ఆధారాలున్నాయని నిందితుడి తరపు న్యాయవాది వాదించారు.

బాధితురాలు ఫిర్యాదు ఆలస్యంగా చేయడంపై ఏమైనా అనుమానాలున్నాయా?

నిందితుడి తరపు న్యాయవాది, సంఘటన జరిగిన నాలుగున్నర నెలల తర్వాత ఫిర్యాదు చేయడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. నిజంగా వేధింపులు జరిగితే అంత సన్నిహితంగా ఫోన్ సంభాషణలు, చాటింగ్ ఉండవని వాదించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Embed widget