అన్వేషించండి

Bandi Sanjay Mother Heart Attack:కేంద్రమంత్రి బండి సంజయ్‌ తల్లికి గుండెపోటు! అత్యవసర చికిత్స చేసి స్టంట్ వేసిన వైద్యులు!

Bandi Sanjay Mother Heart Attack:కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తల్లి శకుంతలమ్మ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను హైదరాబాద్ తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బండి సంజయ్ తల్లి బండి శకుంతలమ్మకు గుండెపోటు.
  • వెంటనే హైదరాబాద్ తరలించి మెడికవర్ ఆసుపత్రిలో చేర్చారు.
  • గుండెకు రక్తం సరఫరా నాళాల్లో అడ్డంకులతో స్టంట్ వేశారు.
  • మనవడిపై పోక్సో కేసు, ప్రచారంతో మనస్తాపం గురైనట్లు సమాచారం.

Bandi Sanjay Mother Heart Attack: తెలంగాణ రాజకీయాల్లో కీలక నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay ) తల్లి బండి శకుంతలమ్మ(Bandi Sakuntala) అనారోగ్యంపాలయ్యారు. శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే కరీంనగర్ నుంచి హైదరాబాద్ తరలించి  చికిత్స అందిస్తున్నారు. (Union Minister Bandi Sanjay Kumar News)

మే 15 శుక్రవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో కరీంనగర్‌లోని తన నివాసంలో ఉన్న శకుంతలమ్మ హఠాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. ప్రాథమిక లక్షణాలను బట్టి అది గుండెపోటు గా గుర్తించిన వెంటనే ఆమెను మెరుగైన చికిత్స కోసం హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. (Telangana Political News)

Also Read: భగీరథ్ కేసులో కోర్టు సంచలన ఆదేశాలు - మీడియా, సోషల్ మీడియాల్లో బండి సంజయ్ పేరు వాడితే కఠిన చర్యలు

కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు తరలించే క్రమంలో ఎటువంటి జాప్యం జరగకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్తల తీసుకున్నారు. గచ్చిబౌలిలోనీ మెడికోవర్‌ ఆసుపత్రి(Medicover Hospital )కి చేరుకున్న వెంటనే నిపుణులైన కార్డియాలజిస్టుల బృందం ఆమెను పరీక్షించింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు తక్షణమే అత్యవసర చికిత్సను ప్రారంభించారు. (Hyderabad Hospital Emergency)

మెడికోవర్ ఆసుపత్రికి చేరుకున్న శకుంతలమ్మను వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలలో గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో అడ్డంకులు ఉన్నట్టు గుర్తించారు. దీంతో కార్డియాలజీ నిపుణులు అత్యవసరంగా ఆంజియోప్లాస్టీ నిర్వహించి గుండెకు స్టంట్‌ వేశారు. 

Also Read: బండి సంజయ్ ఇంటి నుంచి భయంతో బయటకొచ్చాం.. బాధితురాలి తల్లి సంచలన లేఖ విడుదల

ప్రస్తుతం ఆమెను అత్యవసర చికిత్స విభాగంలో ఉంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. శస్త్ర చికిత్స విజయవంతమైందని, ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నప్పటికీ మరికొద్ది గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచాల్సి ఉంటుందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. 

శకుంతలమ్మ హఠాత్తుగా గుండెపోటుకు గురికావడం వెనుక గత కొన్ని రోజులుగా సాగుతున్న రాజకీయ పరిణామాలు ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు(Bandi Bhagirath case ), దానికి సంబంధించిన సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఆమెను తీవ్రంగా కలచివేసినట్టు తెలుస్తోంది. 

Also Read: అమ్మాయి బాగుంది... మూసుకుని పెళ్లి చేసుకో - బండి భగీరథపై పబ్లిక్ స్టార్ ట్వీట్

గత మూడు రోజులుగా రోజులుగా సామాజిక మాధ్యమాల్లో తన మనవడిపై జరుగుతున్న విమర్శలు, వ్యక్తిగత  దూషణలు చూసి ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, ఆ మానసిక ఒత్తిడి కారణంగానే గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు, పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 

ఇలాంటి పరిస్థితుల్లో తన తల్లి ఆనారోగ్యం బండి సంజయ్‌ను మరింత ఆందోళనకు గురి చేసింది. తల్లి అనారోగ్యం వార్త తెలిసిన వెంటనే ఆయన తన కార్యక్రమాలను రద్దు చేసుకొని నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న తల్లిని పరామర్శించి, ఆమెకు అందుతున్న వైద్య సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. 

Frequently Asked Questions

బండి సంజయ్ తల్లికి ఏమి జరిగింది?

బండి సంజయ్ తల్లి బండి శకుంతలమ్మకు శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆమె ఆరోగ్యం ఎలా ఉంది?

వైద్యులు ఆమెకు అత్యవసరంగా ఆంజియోప్లాస్టీ చేసి స్టంట్ వేశారు. శస్త్రచికిత్స విజయవంతమైంది, ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉంది. అయితే, మరికొద్ది గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచాల్సి ఉంటుంది.

గుండెపోటుకు కారణం ఏమిటి?

గత కొద్ది రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఆమెను తీవ్రంగా కలచివేసి, మానసిక ఒత్తిడికి గురిచేసినట్లు తెలుస్తోంది.

బండి సంజయ్ స్పందన ఏమిటి?

తల్లి అనారోగ్యం వార్త తెలియగానే బండి సంజయ్ తన కార్యక్రమాలను రద్దు చేసుకుని వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన తల్లిని పరామర్శించి, వైద్యుల నుంచి సమాచారం తెలుసుకున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Future City Hyderabad: ఫ్యూచర్ సిటీ కోసం మొదటి అడుగు - కొత్త ఆఫీస్ రెడీ - 9 నెలల్లో మాస్టర్ ప్లాన్ - అనుకున్నట్లు సాగుతుందా?
ఫ్యూచర్ సిటీ కోసం మొదటి అడుగు - కొత్త ఆఫీస్ రెడీ - 9 నెలల్లో మాస్టర్ ప్లాన్ - అనుకున్నట్లు సాగుతుందా?
Hyderabad Rain Traffic Chaos: తొలకరి వానకు హైదరాబాద్ ఖల్లాస్ - ఐటీ కారిడార్‌లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్.. నరకం అనే మాట చిన్నదే!
తొలకరి వానకు హైదరాబాద్ ఖల్లాస్ - ఐటీ కారిడార్‌లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్.. నరకం అనే మాట చిన్నదే!
Hyderabad Heavy Rain Update 2026: భాగ్యనగరాన్ని దడదడలాడించిన తొలి రుతుపవన వర్షం - ట్రాఫిక్ కష్టాలు.. వాహనదారులకు పోలీసుల కీలక సూచనలు!
భాగ్యనగరాన్ని దడదడలాడించిన తొలి రుతుపవన వర్షం - ట్రాఫిక్ కష్టాలు.. వాహనదారులకు పోలీసుల కీలక సూచనలు!
HYDRA Name Hystory: హైడ్రా అంటే హిట్లర్ కోర్ టీమా? మార్వెల్ విలనా? సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు నిజం ఇదీ!
హైడ్రా అంటే హిట్లర్ కోర్ టీమా? మార్వెల్ విలనా? సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు నిజం ఇదీ!
Advertisement

వీడియోలు

Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Steel Plant ప్రమాదంలో షాకింగ్ నిజాలు.. మృత్యుంజయులం అంటూ పోస్ట్, అంతలోనే తీవ్ర విషాదం
Vizag Steel Plant ప్రమాదంలో షాకింగ్ నిజాలు.. మృత్యుంజయులం అంటూ పోస్ట్, అంతలోనే తీవ్ర విషాదం
US Attacks Iran: ఇరాన్‌పై అమెరికా ప్రతీకారం.. హర్మూజ్ నుంచి బందర్ అబ్బాస్ వరకు బాంబు దాడులు
ఇరాన్‌పై అమెరికా ప్రతీకారం.. హర్మూజ్ నుంచి బందర్ అబ్బాస్ వరకు బాంబు దాడులు
Future City Hyderabad: ఫ్యూచర్ సిటీ కోసం మొదటి అడుగు - కొత్త ఆఫీస్ రెడీ - 9 నెలల్లో మాస్టర్ ప్లాన్ - అనుకున్నట్లు సాగుతుందా?
ఫ్యూచర్ సిటీ కోసం మొదటి అడుగు - కొత్త ఆఫీస్ రెడీ - 9 నెలల్లో మాస్టర్ ప్లాన్ - అనుకున్నట్లు సాగుతుందా?
Kumuram Bheem Asifabad Latest News: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దిందాలో రణరంగం! ప్లాంటేషన్ అడ్డుకున్న రైతులు! 
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దిందాలో రణరంగం! ప్లాంటేషన్ అడ్డుకున్న రైతులు! 
Hyderabad Rain Traffic Chaos: తొలకరి వానకు హైదరాబాద్ ఖల్లాస్ - ఐటీ కారిడార్‌లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్.. నరకం అనే మాట చిన్నదే!
తొలకరి వానకు హైదరాబాద్ ఖల్లాస్ - ఐటీ కారిడార్‌లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్.. నరకం అనే మాట చిన్నదే!
Hyderabad Heavy Rain Update 2026: భాగ్యనగరాన్ని దడదడలాడించిన తొలి రుతుపవన వర్షం - ట్రాఫిక్ కష్టాలు.. వాహనదారులకు పోలీసుల కీలక సూచనలు!
భాగ్యనగరాన్ని దడదడలాడించిన తొలి రుతుపవన వర్షం - ట్రాఫిక్ కష్టాలు.. వాహనదారులకు పోలీసుల కీలక సూచనలు!
Vizag Steel Plant Accident Updates:
"స్టీల్‌ప్లాంట్ సమస్యలపై త్వరలోనే చర్చలు- రాజకీయాలకు అతీతంగా కార్మిక సంఘాలు పనిచేయాలి" డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్
Visakhapatnam Steel Plant Accident Nara Lokesh Visit:
"విశాఖ స్టీల్‌ప్లాంట్‌ బాధితులకు 90 రోజుల్లో న్యాయం" పరామర్శ తర్వాత లోకేష్‌ ప్రకటన
Embed widget